పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టామంటున్న శాస్త్రవేత్తలు

వీడియో క్యాప్షన్, పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టామంటున్న శాస్త్రవేత్తలు

'చిన్నారులకు మసాజ్ చేయడం ద్వారా వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వారికి యుక్త వయస్సు వచ్చే వరకు నిలిచి ఉంటాయి" అని పరిశోధనకారులు చెబుతున్నారు.

శిశువులకు తరచుగా మసాజ్ చేయడం ద్వారా మైక్రోబయోమ్ తయారయేందుకు సహాయపడుతుందని వేర్వేరుగా నిర్వహించిన వివిధ ట్రయల్స్‌లో కనుగొన్నారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టేందుకు ప్రభావవంతమైన నిరోధకంగా పని చేయడంలో మైక్రోబయోమ్ కీలకమైన పాత్రను పోషిస్తుంది.

పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయోమ్ వృద్ధి చెందినట్లు కనుగొన్నారు.

ఈ తైలాలతో మసాజ్ చేయడం ద్వారా శరీరం గట్టిపడి సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వ్యాపించి రక్తంలోకి చేరడాన్ని కష్టతరం చేసి ప్రాణాపాయ రోగాలు రాకుండా కాపాడుతుంది.

దక్షిణాసియాలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చేసే మసాజ్ వల్ల కూడా ప్రయోజనాలుంటాయని అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి.

మసాజ్‌ను సరైన రీతిలో చేయడం ద్వారా బిడ్డ బరువు పెరగడం మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్‌లను కూడా నివారిస్తుందని, శిశు మరణాలను 50శాతం వరకు తగ్గిస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, తమ పిల్లలకు మసాజ్ చేయాలని అనుకునే తల్లితండ్రులు ముందుగా తమ పిల్లలకు అది సురక్షితమో కాదో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది.

పూర్తి సమాచారం పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)