సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్ గివెన్ నౌకను ఎలా కదిలించారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, రియాలిటీ చెక్, విజ్యుయల్ జర్నలిజం
- హోదా, బీబీసీ న్యూస్
సూయజ్ కాలువలో చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌకను కదిలించే ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి.
ఇది మంగళవారం నుంచి సూయెజ్ కాలువ మధ్యలో చిక్కుకుని ఉంది.
కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఈ భారీ నౌక వెనుక భాగానికి ఇనుప తాళ్లు కట్టి టగ్ బోట్లతో పక్కకు లాగారు. ఎవర్ గ్రీన్ మెరైన్ అనే తైవాన్ సంస్థకు చెందిన ఈ 'ఎవర్ గివెన్' నౌక 400 మీటర్ల పొడవు ఉంటుంది.
ఇంతకు ముందు నౌక వెనుక భాగం, కాలువ ఒడ్డు నుంచి నాలుగు మీటర్ల దూరంలో ఉండగా, ఇప్పుడు ఆ గ్యాప్ 102 మీటర్లకు పెరిగిందని సూయజ్ కెనాల్ అథారిటీ తెలిపింది. అంటే నౌక వెనుక భాగాన్ని 98 మీటర్ల దూరం జరిపారన్నమాట.
నౌకను ఎలా కదిలిస్తున్నారు?

ఈ కాలువ గుండా వెళ్లేందుకు ప్రస్తుతం 367 నౌకలు వేచి ఉన్నాయి. ఎవర్ గివెన్ నౌకను కాలువ వెడల్పు ఎక్కువగా ఉన్నచోటకు (వెయిటింగ్ ఏరియా) తరలించాక, మిగతా నౌకల ప్రయాణం ప్రారంభించే వీలుంటుందని కాలువ నిర్వహణ అధికారులు చెప్పారు.
నౌకను అక్కడి నుంచి తరలించేందుకు తదుపరి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఈ పని పూర్తి కావడం అంత సులువేమీ కాదని అధికారులు అంటున్నారు.
ఎవర్ గివెన్ చిక్కుకుపోయిన స్థానం

ఈ నౌక చుట్టూ టగ్ బోట్లు ఉన్నాయి.
ఇవి కేబుళ్లతో నౌకను లాగేందుకు ప్రయత్నిస్తున్నాయి.
డ్రెడ్జింగ్

టగ్ బోటులతో పాటు డ్రెడ్జర్ల ద్వారా కూడా షిప్ అడుగున ఉన్న ఇసుకను, మట్టిని తొలగిస్తున్నారు.
"సూయజ్ కాలువలో ఈ డ్రెడ్జర్లు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇవి నీటిని నౌకాయానానికి అనువుగా ఉంచేందుకు నిరంతరం తవ్వుతూ ఉంటాయి" అని మారిటైమ్ నిపుణులు సాల్ మెర్కుగ్లియానో చెప్పారు.
భారీ అధునాతన యంత్రాలు నీటిలోపలికి వెళ్లి అడుగు నుంచి మురికిని వెలికి తీస్తాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గంటకు 2000 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు ప్రత్యేక సక్షన్ డ్రెడ్జర్ ని కూడా తీసుకుని వచ్చినట్లు ఈ షిప్పును నిర్వహిస్తున్న 'బెర్న్‌హార్డ్ షల్ట్ షిప్‌మేనేజ్‌మెంట్' తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
బరువును తగ్గించడం

ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడంతో రోజుకు దాదాపు 70వేల కోట్ల నష్టం.. దాన్ని ఎలా బయటకు తీస్తారు
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- ఇందిరా గాంధీని ఫిరోజ్ మోసం చేశారా... వారి మధ్య గొడవలకు కారణాలేంటి?
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








