దిల్లీ సరిహద్దులో తుపాకితో కాల్చుకున్న సిక్కు మత బోధకుడు మృతి

సిక్కు మత గురువు

ఫొటో సోర్స్, CaptainAmarinderSingh/Twitter

దిల్లీ సరిహద్దుల్లో బుధవారం సాయంత్రం తుపాకీతో కాల్చుకున్నారని చెబుతున్న సిక్కు మత బోధకుడు 65 ఏళ్ల రామ్ సింగ్ సింగ్రా మరణించారు.

రామ్ సింగ్‌ది హరియాణాలోని కర్నాల్ సమీపంలోని ఓ గ్రామం. మీడియాలో చూసి తమకు సమాచారం తెలిసిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

''అధికారికంగా మాకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా ద్వారా తెలిసింది'' అని ఆయన చెప్పారు.

''ఆయన్ను కర్నాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన్ను తరలించినట్లు తెలిసింది. ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

రామ్ సింగ్ తనను తాను కాల్చుకున్నారని ఆయన సహచరుడు జోగా సింగ్‌ 'బీబీసీ పంజాబీ' విలేకరి ఖుషాల్ లాలికి చెప్పారు.

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా సింగ్ సరిహద్దులో నిరసన చేస్తున్న సంత్ రాంసింగ్ జీ మరణవార్త విస్మయానికి గురి చేసిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)