You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనాలోని షెన్‌జెన్ నగరం
చైనాలోని షెన్‌జెన్ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసం అమ్మడాన్ని, తినడాన్ని నిషేధించారు. చైనాలో ఈ నిషేధం విధించిన తొలి నగరం ఇదే.
వన్యప్రాణుల ద్వారానే కరోనావైరస్ వ్యాప్తి మొదలైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే అడవి జంతువుల మాంసం వ్యాపారాలను, వినియోగాన్ని నిషేధించాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు. మరో అడుగు ముందుకు వేసిన షెన్‌జెన్ నగరం అధికారులు... పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కల మాంసంపై కూడా నిషేధం విధించారు. మే ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.
ఆసియాలో ఏటా దాదాపు మూడు కోట్ల కుక్కలను మాంసం కోసం చంపుతున్నారని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) చెబుతోంది.
అయితే, చైనీయుల్లో అందరూ కుక్క మాంసం తినరు. తాము ఎన్నడూ కుక్క మాంసాన్ని ముట్టలేదని చాలామంది చెబుతున్నారు.
"కుక్కలు, పిల్లులు మనుషులతో అత్యంత సన్నిహితంగా మెలిగే పెంపుడు జంతువులు. కుక్కలు, పిల్లులతో పాటు, ఇతర పెంపుడు జంతువుల మాంసం తినడంపై అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, హాంకాంగ్, తైవాన్‌లోనూ నిషేధం ఉంది. ఇప్పుడు మేము కూడా అదే నిర్ణయం తీసుకున్నాం" అని షెన్‌జెన్ నగర ప్రభుత్వం తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ నిర్ణయం పట్ల జంతు పరిరక్షణ సంస్థ హెచ్‌ఎస్‌ఐ హర్షం వ్యక్తం చేసింది. షెన్‌జెన్ అధికారులను అభినందించింది.
"చైనాలో ఏటా కోటి కుక్కలను, 40 లక్షల పిల్లులను చంపేస్తున్నారు. ఈ క్రూరమైన వ్యాపారానికి ముగింపు పలికే ప్రయత్నాలలో షెన్‌జెన్ నగర అధికారులు గొప్ప ముందడుగు వేశారు" అని చైనాలోని హెచ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ పీటర్ లీ అన్నారు
అయితే, ఒకవైపు వన్యప్రాణుల మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూనే, మరోవైపు కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేసేందుకు ఎలుగుబంటి పైత్యరసం వినియోగించడాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించింది.
ప్రాణంతో ఉన్న ఎలుగుబంట్లను బంధించి వాటి నుంచి పైత్య రసాన్ని సేకరిస్తారు. చాలా కాలంగా సంప్రదాయ చైనా ఔషధాలలో దానిని వాడుతున్నారు.
ఆ రసాన్ని ఉర్సోడీఆక్సీకోలిక్ ఆమ్లం అంటారు. దానిని పిత్తాశయంలో ఏర్పడే రాళ్లను కరిగించేందుకు, కాలేయ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు. కానీ, కరోనావైరస్ రోగులకు ఇది పనిచేస్తున్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
వన్యప్రాణులను హింసిస్తూ, వాటి నుంచి పైత్య రసాన్ని తీయడం క్రూరమైన చర్య అని యానిమల్స్ ఏషియా ఫౌండేషన్ అంటోంది.
"వన్యప్రాణుల నుంచి కోవిడ్-19 వైరస్ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎలుగుబంటి పైత్య రసం లాంటి వన్యప్రాణి ఉత్పత్తులపై మనం ఆధారపడటం మంచిది కాదు’’ అని యానిమల్స్ ఆసియా ఫౌండేషన్ ప్రతినిధి బ్రియాన్ డాలీ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.
వన్యప్రాణుల మార్కెట్
కరోనావైరస్ విజృంభించిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాలను, వినియోగాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది.
వుహాన్ నగరంలో వన్యప్రాణులను, మాంసాన్ని అమ్మే మార్కెట్ కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువు అని, అక్కడి నుంచి ఆ వైరస్ మనుషులకు సంక్రమించి ఉంటుందని అధికారులు భావించారు.
దాంతో, వన్యప్రాణులను, వాటి మాంసాన్ని విక్రయించే మార్కెట్లపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా కరోనావైరస్ పాజిటివ్ నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 47,000 మందికి పైగా మరణించారు.
చైనాలో 81,589 మందికి ఈ వైరస్ సోకగా, 3,318 మంది చనిపోయారని ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ వైరస్ ఎక్కడ పుట్టింది? అది మానవులకు ఎలా వ్యాపించింది? అన్న విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే? ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి?
- సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్
- కరోనావైరస్: కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తూ చనిపోయిన డెలివరీ మ్యాన్ చివరిసారి ఏం చెప్పాడు?
- లాక్డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?
- కేసీఆర్ చెప్పినా ఆగని వలసలు
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)