You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్
పాకిస్తాన్‌లో కనిపించకుండా పోయిన ఒక టీనేజీ యువకుడు.. లాహోర్‌లోని ఒక జూలో సింహాల ఎన్‌క్లోజర్‌లో అస్థిపంజరంలా కనిపించాడు.
ముహమ్మద్ బిలాల్ (17) కంచె దాటి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా వెళ్లాడు, అతడి మరణానికి కారణమేమిటి అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే.. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిలాల్ చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వారం ఆరంభంలో జూ కార్యాలయాలపై దాడులు జరిగాయి.
ప్రభుత్వ మద్దతుతో నడిచే లాహోర్ సఫారీని 1982లో స్థాపించారు. ఇది పాక్‌లో అతి పెద్దదైన, అత్యంత ప్రాచీనమైన పార్కు.
యువకుడిని వెదకటానికి సాయం చేయాలని కోరుతూ సమీప గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు మంగళవారం రాత్రి తమ దగ్గరకు వచ్చారని డైరెక్టర్ చౌదరీ షాఫ్ఖాత్ బీబీసీకి చెప్పారు.
''అప్పటికే చాలా రాత్రి అయిందని, సఫారీలో చీకట్లో గాలింపు చేపట్టటం ప్రమాదకరం కావచ్చునని మేం వారికి చెప్పాం'' అని తెలిపారు.
జూ ఉద్యోగులు బుధవారం ఉదయం గాలింపు చేపట్టినపుడు.. రక్తపు మడుగులో పుర్రె, కొన్ని ఎముకలు, దుస్తుల ముక్కలు కనిపించాయి. అవి అదృశ్యమైన బాలుడి దుస్తులుగా బంధువులు గుర్తించారు.
ఆ బాలుడు పశువుల మేత కోసం గడ్డి కోయటానికి మంగళవారం మధ్యాహ్నం ఇల్లు వదిలి వెళ్లాడని అతడి బంధువులు తమకు చెప్పినట్లు అధికారులు తెలిపారు.
మరణానికి కారణం తెలుసుకోవటానికి బిలాల్ అస్తికలను పరీక్షలకు పంపించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- దిల్లీ హింస: అశోక్ నగర్లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు? - గ్రౌండ్ రిపోర్ట్
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్
- దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)