సీఈఎస్ 2020: కాన్సెప్ట్ కార్లు.. ఎగిరే వాహనాలు... స్మార్ట్ బైకులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ బరాన్యుక్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
కాన్సెప్ట్ కార్లు, ఎగిరే వాహనాలు, స్మార్ట్ బైకులు... ఇలా అనేక రకాల వినూత్న వాహనాలను అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ టెక్నాలజీ షోలో ప్రదర్శిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ తర్వాత అత్యంత స్మార్ట్ కార్లను తీసుకురావడంపై దిగ్గజ సంస్థలు కొన్నేళ్లుగా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.


డ్రైవర్ రహిత కార్ల కోసం అత్యాధునిక సెన్సర్లను అభివృద్ధి చేస్తున్నారు. అలా అధునాతన ఫీచర్లతో రూపొందించిన అనేక వినూత్న వాహనాల ప్రదర్శనకు సీఈఎస్ వేదికైంది.

ఫొటో సోర్స్, Reuters
బగ్గీ లాంటి కాన్సెప్ట్ కారును హోండా ప్రదర్శిస్తోంది. ప్రదర్శనను చూసేందుకు వచ్చిన వీక్షకులు ఈ బగ్గీ కారులో కూర్చునేందుకు కూడా హోండా అనుమతిస్తోంది.
సాధారణ కార్లలో యాక్సిలరేటర్ పెడల్స్ ఉంటాయి. కానీ, ఇందులో ఉండవు. డిస్క్ మాదిరిగా ఉండే స్టీరింగ్‌ను లాగడం, నెట్టడం ద్వారా కారు వేగాన్ని నియంత్రించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
సెంట్రోవెంటి మాడ్యులర్ కాన్సెప్ట్ కారును ఫియట్ ఆటోమొబైల్స్ సంస్థ ప్రదర్శిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఆడీ తయారు చేసిన స్వయంచోదిత కాన్సెప్ట్ కారు. ఇందులో డ్రైవర్ సీటు దగ్గర డెస్క్ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కాన్సెప్ట్ కార్లతో పాటు కొన్ని ఇతర నూతన మోడళ్ల కార్లను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్ ఈ జీటీ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. దీనిని ఈ ఏడాది ఆఖరులోగా మార్కెట్‌లోకి తీసుకురానుంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 402 కిలోమీటర్లు తిరగొచ్చు. అమెరికాలో దీని ధర 60,500 డాలర్లు (రూ.43,26,506) ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని సంస్థలు అకస్మాత్తుగా తమ వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు పెట్టాయి.
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ దిగ్గజం సోనీ తన సొంత కాన్సెప్ట్ కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కారు పేరు విషన్ ఎస్.
ఈ కారు లోపలి భాగాన్ని సరికొత్త ఎంటర్‌టెయిన్మెంట్ టెక్నాలజీ ఫీచర్లతో తీర్చిదిద్దింది సోనీ.

ఫొటో సోర్స్, EPA
చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ బైటాన్ తన ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. భవిష్యత్తులో 'కార్లు డేటాతో నడుస్తాయి, ఇంధనంతో మాత్రమే కాదు' అనే ఆలోచనతో ఈ కారును రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఈ కారు పేరు ఎం-బైట్. ఈ ఏడాది ఆఖరు కల్లా మార్కెట్‌లోకి రానుంది.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ వాహన తయారీ దిగ్గజం టయోటా తన ఎల్‌క్యూ లెవెల్ 4 కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచింది. డ్రైవర్ లేకుండానే నడిచేలా దీనిని రూపొందించారు.
యూఐ అనే తన సొంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్‌ను టయోటా ఈ కారులో అమర్చింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images
కార్లతో పాటు గాలిలో ఎగిరే వాహనాలు కూడా సీఈఎస్‌లో సందర్శకులను భలే ఆకట్టుకుంటున్నాయి.
అందులో ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వాహనం హుందాయ్ రూపొందించిన S-A1 అనే ఫ్లయింగ్ కాన్సెప్ట్ వాహనం. ఇది విద్యుత్‌తో నడుస్తుంది.
ట్యాక్సీ బుకింగ్ సంస్థ ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, భవిష్యత్తులో ఉబర్ కోసం ఫ్లయింగ్ ట్యాక్సీలను తయారు చేస్తామని హుందాయ్ ప్రకటించింది.
గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ ఎగిరే వాహనాన్ని తయారు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది సైబిక్ స్మార్ట్ బైక్స్ సంస్థ తయారు చేసిన ఫోల్డబుల్ ఈ-బైక్. దీనికి అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అమర్చారు.
ప్రయాణం సమయంలో అవసరమైన సమాచారాన్ని దీన్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఏ మార్గంలో వెళ్లాలి? ట్రాఫిక్ ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? వంటి సమాచారాన్ని దీనిని అడిగి తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
- 'ఆర్థిక వ్యవస్థపై విమర్శలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు'
- ఓలా, ఉబెర్ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- PUBG ఆడుకోవడానికి అడ్డుపడుతున్నాడని తండ్రిని చంపిన కొడుకు
- టాటా స్టీల్ కంపెనీలో ఉత్పత్తి తగ్గితే ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









