అణుబాంబు వేయగల క్షిపణిని సబ్ మెరైన్ మీంచి ప్రయోగించిన ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS
సబ్‌మెరైన్ నుంచి సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా ధ్రువీకరించింది. మే నుంచి నిర్వహించిన స్వల్పశ్రేణి క్షిపణి పరీక్షలను గమనిస్తే ఇది గణనీయమైన పురోగతిగా చెప్పొచ్చు.
ఈ ప్రయోగాన్ని బుధవారం నిర్వహించారు. జపాన్ సముద్రం( తూర్పు సముద్రం)లోని నిర్దేశిత ప్రాంతంలో క్షిపణి పడిపోయింది. ఈ ప్రయోగంతో ఈ ఏడాది ఉత్తర కొరియా మొత్తంగా 11 క్షిపణిలను ప్రయోగించినట్లైంది.
అమెరికాతో అణు చర్చలు తిరిగి మొదలుపెడతామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉత్తర కొరియా ఈ ప్రయోగం నిర్వహించింది.
ఈ చర్యను వాషింగ్టన్, టోక్యో అధికారులు ఖండించారు.
సబ్ మెరైన్ నుంచి ఒక బాలిస్టిక్ క్షిపణి(ఎస్ఎల్ బీఎం)ని బుధవారం జపాన్ సముద్ర తీరంలో ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఒక చిత్రాన్ని కూడా విడుదల చేసింది.
పుక్‌గుక్సాంగ్-3 నుంచి విజయవంతంగా క్షిపణిని పరీక్షించిన వారిని దేశాధినేత కిమ్-జోంగ్-ఉన్ అభినందించారని కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది.
అయితే, ప్రయోగ సమయంలో కిమ్ అక్కడ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు.

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS
దేశ రక్షణను పెంపొందించేందుకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. ఈ ప్రయోగం వల్ల సరిహద్దు దేశాల భద్రతపై ఎలాంటి ప్రభావం పడదని పేర్కొంది.
ఈ ప్రయోగం అనంతరం దక్షిణ కొరియా స్పందిస్తూ సబ్‌మెరైన్ నుంచే క్షిపణిని పరీక్షించినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
దక్షిణ కొరియా అధికారుల ప్రకారం, ప్రయోగ క్షిపణి 450 కిలోమీటర్లు (280 మైళ్ళు) ప్రయాణించి సముద్రంలో కూలడానికి ముందు 910 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.
దీనికంటే ముందు ఉత్తరకొరియా పరీక్షించిన 10 క్షిపణులు స్వల్వ శ్రేణివి మాత్రమే.
ఉత్తర కొరియా గత కొద్దికాలంలో దీర్ఘ శ్రేణి క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి. 910 కిలోమీటర్ల ఎత్తులో ఈ క్షిపణి వెళ్లింది.
సబ్‌మెరైన్ ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా గణనీయమైన పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అణు చర్చలు ప్రారంభమవుతాయని ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఈ ప్రయోగం జరిగింది. దీనిబట్టి ఉత్తర కొరియా చర్చలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించవచ్చు.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ద్వారా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం ఆ దేశం ప్రయోగించిన క్షిపణి పరధి, సామర్థ్యంపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలను నిలిపివేయడానికి ముందే సబ్ మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను ప్యాంగ్యాంగ్ అభివృద్ధి చేస్తూ వస్తోంది.
ప్రయోగానికి కొన్ని గంటల ముందు, అమెరికాతో అణ్వాయుధీకరణ చర్చలు ఈ వారంలో తిరిగి ప్రారంభమవుతాయని ప్యాంగ్యాంగ్ వెల్లడించింది.
కొన్ని నెలల కిందట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , ఉత్తర కొరియా అధినేత కిమ్ మధ్య హనోయిలో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిపోయాయి.
ఇవి కూడా చదవండి
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- చైనా అభివృద్ధిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?
- మోదీ Vs. ఇమ్రాన్ ఖాన్: ఐరాస వేదికపై ఎవరిది విజయం
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








