You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కృత్రిమ కాళ్లతో నడిచే చిన్నారి మోడల్.. "ఈ పాపను చూస్తే జాలిపడరు, అద్భుతం అంటారు"
పుట్టుకతోనే వైకల్యం. కాలి ఎముకలను అరుదైన వ్యాధి కబళించింది. 18 నెలల వయసుకే రెండు కాళ్లనూ కోల్పోయింది. అయితే, కొండంత ఆత్మస్థైర్యం తనకు అండగా నిలిచింది. కృత్రిమ కాళ్లతో నడుస్తూ మోడల్‌గా రాణించేలా ముందుకు నడిపించింది. ఇది తొమ్మిదేళ్ల డెయిసీ మే దిమిత్రి స్ఫూర్తిగాథ.
ప్రఖ్యాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ షోతోపాటు పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ మెరవబోతున్న రెండు కాళ్లూలేని తొలి చిన్నారిగా డెయిసీ చరిత్ర సృష్టించబోతోంది.
డెయిసీ స్వస్థలం బ్రిటన్‌లోని బర్మింగ్హమ్. పుట్టుకతోనే తనకు ఫిబ్యులర్ హెమిమెలియా సోకింది. ఈ వ్యాధి వల్ల కాలి ఎముకలో కొంత భాగం లేదా పూర్తిగా కనుమరుగవుతుంది. 50 వేల మందిలో ఒకరిని మాత్రమే ఇలాంటి లోపం చుట్టుముడుతుంది.
18 నెలలు వచ్చేసరికి డెయిసీ లోపం మరింత తీవ్రమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు అలెక్స్, క్లెయిర్ దిమిత్రి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మోకాలిపై వరకూ రెండు కాళ్లూ తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్‌కు వారు అంగీకరించారు. దీంతో కృత్రిమ కాళ్లే డెయిసీకి శరణ్యమయ్యాయి.
వైక్యలం ఏనాడూ డెయిసీకి అవరోధం కాలేదు. చదువుతోపాటు జిమ్నాస్టిక్స్‌లోనూ తను ప్రావీణ్యం సాధించింది. అంతేకాదు, ఎనిమిదేళ్ల వయసులోనే రివర్ ఐలాండ్ బ్రాండ్‌కు మోడలింగ్‌తో ఫ్యాషన్ ప్రపంచంలోకీ అడుగుపెట్టింది.
ప్రస్తుతం బ్రిటన్‌లోని దిగ్గజ వస్ర్త విక్రయ సంస్థ బోడెన్‌కు మోడల్‌గానూ పనిచేస్తుంది. నైకీ, మ్యాటలాన్ లాంటి బ్రాండ్లనూ తను ప్రమోట్ చేసింది.
ఈ నెల 8న డెయిసీ మోడలింగ్ కెరియర్‌లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించబోతోంది. ప్రఖ్యాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తను తళుకులీనబోతోంది. ఇక్కడ ర్యాంప్‌పై వాక్ చేయబోతున్న రెండు కాళ్లూలేని తొలి చిన్నారి డెయిసీ అని ఇప్పటికే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ప్రకటించింది.
మరోవైపు ప్రఖ్యాత పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ డెయిసీ మెరవబోతోంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌పై సెప్టెంబరు 27న ఈ షో జరగబోతోంది. చిన్నారుల ఫ్యాషన్ బ్రాండ్ 'లూలూ ఎట్ జిజి'ను తను ప్రమోట్ చేయబోతోంది.
లండన్‌లోని ఓ ఫ్యాషన్ షోలో డెయిసీని 'లూలూ ఎట్ జిజి' ఫౌండర్ ఎని హెజెడస్ బ్యూరన్ చూశారు. ఆత్మవిశ్వాసంతో డెయిసీ వేస్తున్న అడుగులను చూసి ఆమె మంత్రముగ్ధురాలయ్యారు.
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో డెయిసీ మెరవబోతుందనే వార్తలే డెయిసీకి పారిస్ అవకాశాన్ని తెచ్చిపెట్టాయని ఆమె తండ్రి అలెక్స్ అన్నారు.
"ఇవి ఎంత పెద్ద అవకాశాలో డెయిసీకి చెబుతుంటే, 'డాడ్, ఇట్స్ కూల్' అంది. ఇంకా సాధన చేయాలనుకుంటున్నావా అని అడిగితే, 'ఇవి నాకు కొత్తమీ కాదు' అని బదులిచ్చింది" అని ఆయన చెప్పారు.
'షోలో ర్యాంప్ వ్యాక్ చేసేందుకు అవసరమైన కృషి ఇప్పటికే తను మొదలుపెట్టింది. ఆమెను చూసేవాళ్లు జాలిపడరు. 'అద్భుతం, ఆమెలా నేనూ అవ్వాలి' అనుకుంటారు. తనలో ఎంతో ఉత్సాహం ఉంది" అని అలెక్స్ వివరించారు.
"చేసే పనిని డెయిసీ అమితంగా ప్రేమిస్తుంది. ప్రపంచానికి తను కనువిప్పు కలిగించబోతోంది. మేం ఎంతో గర్వపడుతున్నాం" అని బ్యూరన్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- “పిల్లల్ని కనడం తప్పనిసరి కాదు.. అది నా ఇష్టం”
- 15 ఏళ్లకే మెనోపాజ్: ’ఇక నాకు పిల్లలు పుట్టరు'
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు
- మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ తెరలకు అతుక్కుపోతుంటే ఏం చేయాలి
- ‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- తమ ప్రత్యేక అధికారాలను రద్దు చేసిన పాక్ తీరుపై గిల్గిత్ బల్తిస్తాన్ వాసులు ఏమంటున్నారు..
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై, హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ
- నా హిందీని బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే... రహస్యాన్ని వెల్లడించిన మోదీ
- లైంగిక వేధింపులకు గురైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)