టేల్స్ సోరెస్: క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన మోడల్

బ్రెజిల్ మోడల్ టేల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 26 ఏళ్ల టేల్స్‌ సోరెస్ క్యాట్ వాక్ చేస్తూ కిందపడిపోయి చనిపోయారు

బ్రెజిల్‌లో ఓ మేల్ (పురుష) మోడల్ క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలి చనిపోయారు. సౌ పాలో నగరంలో తాజాగా నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

బ్రెజిల్‌కు చెందిన 26 ఏళ్ల టేల్స్‌ సోరెస్ ర్యాంప్‌ మీద పడిపోగానే హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ప్రకారం, ర్యాంపు చివరి వరకూ వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో టేల్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

అయితే, అలా పడిపోవడం కూడా షో‌లో భాగమే అని వీక్షకులు తొలుత భావించారు. కానీ, సహాయక సిబ్బంది వచ్చి అతన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించడంతో అందరూ నిర్ఘాంతపోయారు.

మోడల్ మృ‌తిని ఫ్యాషన్ షో నిర్వహణ సంస్థ కూడా ధ్రువీకరించింది. కానీ, ఆ ఘటన ఎలా జరిగిందన్న పూర్తి వివరాలను వెల్లడించలేదు.

"టేల్స్ మృతి చెందడంపట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ విషాద సమయంలో అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటాం" అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

ఈ ఘటనకు కొన్ని గంటల ముందు ఫ్యాషన్ షో గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో టేల్స్ ఒక పోస్ట్ పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)