బ్లడీ సండే: బ్రిటన్ చరిత్రలోనే అదో చీకటి రోజు

47 ఏళ్ల క్రితం ఆ ఘటన జరిగింది. అది బ్రిటన్ చరిత్రలోనే ఓ చీకటి రోజు. "బ్లడీ సండే"గా ఆ రోజు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. బాధితుల కుటుంబాలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
ఉత్తర ఐర్లండ్‌లో 1972లో ఓ ఆదివారం నాడు 13 మందిని చంపేశారు. లండన్‌డెరీ నగరంలో ఓ ప్రదర్శన నిర్వహిస్తున్న క్యాథలిక్కులపై... బ్రిటన్ సైనికులు కాల్పులు జరిపారు.
1960లో ప్రారంభమైన ఉత్తర ఐర్లండ్ ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉన్న రోజులవి. ఈ ఆందోళనలు 30 ఏళ్లపాటు కొనసాగాయి. అప్పట్లో రూపొందించిన ఓ చట్టానికి వ్యతిరేకంగా లండన్‌డెరీలో నిరసనలు జరిగాయి. ఎందుకు అని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా ఎందరినో అరెస్ట్ చేశారు.
సైన్యం చెబుతున్న దాని ప్రకారం... 21మంది సైనికులు 108 రౌండ్లు కాల్పులు జరిపారు.
ఇప్పుడు 47 ఏళ్ల తర్వాత, ఆ సైనికుల్లో ఒకరిపై కేసు నమోదైంది. రెండు సుదీర్ఘ విచారణల అనంతరం ఇది సాధ్యమైంది. సైనికులపై ఆరోపణలను 1972లో సైన్యం, బ్రిటన్ అధికారులు కూడా కొట్టిపడేశారు.
దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో, 1998లో మరో ఎంక్వైరీ ప్రారంభమైంది. ఇది 8ఏళ్లు కొనసాగింది.
2010లో అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఈ ఘటనపై క్షమాపణలు కోరారు.
బాధ్యులకు శిక్ష పడాలని బాధితుల బంధువులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు.
17మంది మాజీ సైనికులు, మిలిటెంట్లుగా భావిస్తున్న మరో ఇద్దరిపై ఆరోపణలున్నాయి. అయితే, అందుబాటులో ఉన్న సాక్ష్యాలతో కేవలం ఒక్కరినే విచారించే అవకాశం ఉందని.. ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి.
- "మెజారిటీ ప్రజలకు మేలు జరగకపోతే వారే తిరుగుబాటు చేస్తారు"
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- 82 శాతం సంపద ఒక్క శాతం కుబేరుల చేతిలో!
- ‘అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’
- టీడీపీ తొలి జాబితా: అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు వీరే
- వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే అని అనుమానిస్తున్న పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









