వీరు కవలలు, కానీ తండ్రులు వేరు, ఎలా సాధ్యం?

పిల్లలతో తండ్రులు సైమన్, గ్రేయమ్

అలెగ్జాండ్రా, కాల్డర్ ఇద్దరూ కవలలు. వీరిలో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి. కానీ వీరిద్దరికీ తండ్రులు మాత్రం వేరు.

ఈ కవలల వయసు 19నెలలు. అలెగ్జాండ్రా సైమన్ కూతురు. ఆమె సోదరుడు కాల్డర్.. గ్రేయమ్ కొడుకు. కానీ.. ఈ కవలలకు వేర్వేరు తండ్రులు ఉండటం ఎలా సాధ్యం?

రెండు జంటలు, మూడు దేశాలు, ఇద్దరు పిల్లలు

సైమన్స్, గ్రేయమ్ ఇద్దరూ ఇంగ్లండ్ పౌరులు. తండ్రులు కావాలనుకున్నపుడు ఈ దంపతులకు ఓ సవాలు ఎదురయ్యింది. రెండు జంటలు ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలను పొందేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా రెండు పిండాలను ఒకే మహిళ గర్భంలో ప్రవేశపెట్టారు.

ఐవీఎఫ్ కోసం ఒక డోనర్(సరొగేట్ మదర్)ను వెతకాల్సి వచ్చింది. కానీ ఐవీఎఫ్ కోసం వీరు ఆశ్రయించిన ఏజెన్సీ.. రెండు పిండాలనూ ఒకే మహిళ గర్భంలో ఒకేసారి ప్రవేశపెట్టొచ్చని చెప్పింది. కానీ ఈ విషయంలో సహాయం కోసం ఇద్దరూ విదేశాలకు వెళ్లారు.

''అమెరికాలో ఓ మహిళ ఇందుకు ముందుకు వచ్చింది. ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ మొత్తం లాస్ వెగాస్‌లో జరిగింది'' అని ఇద్దరు తండ్రులు బీబీసీతో అన్నారు.

సదరు మహిళ గర్భంలో అండాన్ని రెండుగా విడదీసి, అందులో ఒక భాగాన్ని సైమన్స్ వీర్యంతో, రెండో భాగాన్ని గ్రేయమ్ వీర్యంతో ఫలదీకరణ చేశారు. తర్వాత ఈ రెండు పిండాలను ఆ మహిళ గర్భంలో ప్రవేశపెట్టారు.

మెగ్ స్టోన్‌తో సైమన్, గ్రేయమ్

ఆ తల్లిది కెనెడా

సైమన్, గ్రేయమ్ పిల్లలకు కెనెడాకు చెందిన మెగ్ స్టోన్ సరొగేట్ మదర్‌గా వ్యవహరించారు. ఇద్దరు పిల్లలు మెగ్ స్టోన్ గర్భంలో కలిసి పెరిగారు.

''కెనెడాలోని చట్టాలు ఇంగ్లండ్‌లో మాదిరే ఉంటాయి. ఈ చట్టాలను రూపొందించిన విధానం మాకు ఇష్టం. అందుకే మేం కెనెడాను ఎన్నుకున్నాం. దీన్ని వ్యాపారంలా కాకుండా, ఇతరులకు సహాయం చేసినట్లు భావిస్తారు'' అని తండ్రులిద్దరూ అన్నారు.

ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తర్వాత ఇద్దరూ యూకే వచ్చేసి, కెనెడా నుంచి ఫోన్ కాల్ కోసం వేచి చూశారు. చివరికి ఇద్దరు పిల్లలు పుట్టారంటూ ఫోన్ వచ్చింది.

''ఆ రోజు చాలా ఉద్వేగానికి లోనయ్యాం. మాకు చాలా ఆనందమేసింది'' అని గ్రేయమ్ అన్నారు.

పిల్లలు పుట్టడానికి ఆరు వారాల ముందు కూడా ఇద్దరూ కెనెడాకు వెళ్లి, మెగ్ స్టోన్‌ను కలిసొచ్చారు. ఆ పిల్లలు కానీ, ఇద్దరు తండ్రులు కానీ మెగ్ స్టోన్‌తో ఎలాంటి బంధాన్ని కొనసాగించలేరు.

మళ్లీ పిల్లలు కావాలని ప్రయత్నిస్తారా.. అంటే, ‘లేదు లేదు..’ అంటూ సైమన్ నవ్వేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)