FSSAI: న్యూస్‌పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం.. జులై 1 నుంచి అమలు

ఫొటో సోర్స్, Getty Images
న్యూస్ పేపర్లలో చుట్టేసి ఇచ్చే ఇడ్లీ, దోశెలను తినేస్తున్నారా.. తోపుడుబండ్లపై దొరికే వేడివేడి సమోసాలను పేపర్ ప్లేట్‌లలో పెట్టుకొని తింటున్నారా.. అయితే జాగ్రత్త!
న్యూస్‌పేపర్లలో ప్యాక్ చేసిన ఆహారపదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ) హెచ్చరిస్తోంది.
ఆహార పదార్థాలను వార్తా పత్రికల్లో చుట్టేయడం, పార్సిల్ చేయడం మన దేశంలో సాధారణంగా కనిపిస్తుంది. ఆహార పదార్థాలు ఎంత శుచిగా ఉన్నా వాటిని న్యూస్ పేపర్లలో చుట్టడం వల్ల అవి నెమ్మదిగా విషతుల్యం అవతున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.
న్యూస్‌పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం విధిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొంది.

ఫొటో సోర్స్, fssai
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయానికి కారణం ఏంటి?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాల ప్రకారం దేశంలోని చిన్న హోటళ్లు, తోపుడు బండ్లలలో ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లలోనే చుట్టి ఇస్తున్నారు.
ఆహారపదార్థాలను న్యూస్‌పేపర్లలో చుట్టి ఇవ్వడం వల్ల వాటి తయారీకి వినియోగించే ఇంక్‌లు, డైలు ఆహార పదార్థాలకు అంటుకొనే ప్రమాదం ఉందని, వాటి కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ది నేషనల్ టెస్ట్ హౌజ్ (ఎన్‌టీహెచ్)లతో కలిసి రెండు సర్వేలు చేసినట్లు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది.
తమ సర్వేలో అసంఘటిత రంగంలోని హోటళ్లలోనే ఎక్కువగా న్యూస్ పేపర్లలో చుట్టి ఆహరపదార్థాలను అందిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
న్యూస్ పేపర్లను ఎలా ఉపయోగిస్తున్నారంటే..
ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడానికే కాకుండా వంటకాల నూనెను పీల్చడానికి కూడా న్యూస్ పేపర్లను వాడుతుంటారు. తిన్నతరవాత కొంతమంది చేతులు శుభ్రపర్చుకోడానికి కూడా వీటినే వినియోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూస్ పేపర్ ఇంక్‌లో ఏముంటాయి?
వార్తాపత్రికల ప్రింట్‌కు ఉపయోగించే ఇంక్ అంత సురక్షితమైంది కాదు. మన ఆహారపదార్థాలతో పాటు ఆ ఇంక్ కడపులోకి వెళితే అనేక అరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఈ ఇంక్‌లో అనేక జీవాణువులు ఉంటాయి. అవి క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతాయి. న్యూస్ పేపర్ ఇంక్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే నాఫ్తలమైన్, ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. హానికరమైన బెంజీడైన్, 4-ఆమైనో బైఫినైల్ రసాయనాలు కూడా ఈ ఇంక్‌లో ఉంటాయి.
కాగా, ఆహారపదార్థాలకు సంబంధించి న్యూస్ పేపర్ల వినియోగంపై తాము తీసుకొచ్చిన నూతన నిబంధనలు ఆహార భద్రతా ప్రమాణాలను ఇంకో మెట్టుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి పవన్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
- చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై దిగిన చైనా అంతరిక్ష వాహనం
- ఈ ‘పాత’ ప్రపంచం ఎంత పెద్దదో తెలుసా
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- #HerChoice: నేను సింగిల్.. పెళ్లి చేసుకోనంటే అందరూ తప్పుబట్టారు
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- ‘ప్రపంచ భాష ఇంగ్లిష్’కు రోజులు దగ్గరపడ్డాయా!
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- బన్నీ ఛౌ: భారత్‌లో దొరకని భారతీయ వంటకం
- ప్రపంచంలోనే అత్యధికంగా మాంసం తినే దేశం ఏది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








