ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది? 2014 పోలింగ్ శాతం కంటే 2019లో తగ్గిందా? పెరిగిందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 79.64 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014వ సంవత్సరంతో పోల్చితే ఈసారి ఓటింగ్ 1.68 శాతం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటాక కూడా ప్రజలు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో తుది పోలింగ్ శాతం వెల్లడించేందుకు ఎన్నికల సంఘానికి ఆలస్యమైంది.
రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉండగా, 3,13,33,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 58.19 శాతం మాత్రమే నమోదైంది.
కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ నగరాల్లోనూ 70 శాతంలోపే ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈ నగరాల్లో పోలింగ్ అదే స్థాయిలో ఉంది.
రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో 89.82 శాతం పోలింగ్ నమోదైంది.
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. అలాగే, 2014లో ఆయా నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాలు కూడా ఈ పట్టికలో చూడొచ్చు.
పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా? ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఇలా జరిగింది
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









