వీడియో: ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా?

వీడియో క్యాప్షన్, పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా

ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారిపోతుందని ఓ విశ్వాసం ఉంది. ఇది నిజమేనా?

ఇలాంటి విశ్వాసాలకు కొన్ని సందర్భాలు బలం చేకూరుస్తున్నాయి.

2009 లోక్‌సభ ఎన్నికల కంటే, 2014 ఎన్నికల్లో పోలింగ్ 6.7 శాతం పెరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఓడిపోయింది.

అంతేకాదు ఆ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లను కోల్పోయింది.

కానీ, ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వాలు మారిపోతాయనే విశ్వాసం నిరాధారమని తెలుస్తోంది.

పోలింగ్ శాతానికి, ఫలితాలకు సంబంధం లేదని గణాంకాలు చెబుతున్నాయి.

పోలింగ్ శాతం పెరిగిన కొన్ని ఎన్నికల్లో అధికార పార్టీ గెలవగా, తక్కువగా నమోదైనప్పుడు ఓడిన సందర్భాలూ ఉన్నాయి.

రాష్ట్రాల ఎన్నికలకూ ఇదే వర్తిస్తుంది.

నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాగే భిన్న ఫలితాలు కనిపించాయి.

కాబట్టి పోలింగ్ శాతాన్నిబట్టి ఫలితాలను ముందే ఊహించలేం.

1951 తర్వాత జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే.. 9 ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఇందులో అధికార పార్టీ ఆరుసార్లు గెలవగా, ప్రతిపక్షం మూడుసార్లు గెలిచింది.

పోలింగ్ శాతం తక్కువగా నమోదైన మిగతా ఆరు ఎన్నికల్లో.. అధికార పార్టీ మూడుసార్లు గెలిచి.. ఇంకో మూడుసార్లు ఓడింది.

కాబట్టి పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందని చెప్పలేం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)