ఆంధ్రప్రదేశ్‌లో సవరించిన పోలింగ్ శాతం 79.64

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు జరిగిన పోలింగ్ మున్నెన్నడూ లేని రీతిలో అర్థరాత్రి వరకూ జరగడమే కాదు, కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము దాకా కొనసాగింది. దాంతో, రాష్ట్రంలో పోలింగ్ శాతాలు మారుతూ వచ్చాయి.
గురువారం జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 76.69 శాతం పోలింగ్ నమోదైందని మొదట ప్రకటించిన ఎన్నికల సంఘం, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది. అంటే, 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి వోటింగ్ 1.23 శాతం పెరిగిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు 71.43 శాతంగా ఉన్న పోలింగ్, రాత్రి పోలింగ్ పూర్తయ్యే సమయానికి 5.26 శాతం పెరిగి 76.69 శాతానికి చేరుకుంది. ఇది 2014 సీమాంధ్ర ప్రాంత పోలింగ్ కన్నా 1.27 శాతం తక్కువ. 2014లో ఇక్కడ 77.96 శాతం పోలింగ్ నమోదైంది. చివరకు, శుక్రవారం తెల్లవారేటప్పటికి పోలింగ్ శాతం 79.64 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 85.93 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం నమోదైంది.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
జిల్లాల వారీగా...
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2,118 మంది అభ్యర్థలు, 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జిరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ నియోజకవర్గంలో అత్యధికంగా 68.25 శాతం, సికింద్రాబాద్‌లో అత్యల్పంగా 39.20 శాతం పోలింగ్ నమోదైంది. 185 మంది అభ్యర్థులు పోటీ చేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ 54.20 శాతానికే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి:
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




