ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్: 27 బంతుల్లోనే ఆస్ట్రేలియా కథ ముగించిన టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images
భారత్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మూడో టెస్టులో అయిదో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే విజయానికి కావాల్సిన రెండు వికెట్లు తీసి సిరీస్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత్ ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.
అయిదో రోజు ఆట ప్రారంభానికి ముందు వర్షం పడటంతో కొద్దిసేపు నిలిపివేశారు. ఆట ప్రారంభమైన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ ఎక్కువసేపు కొనసాగలేదు. క్రీజ్‌లో ఉన్న క్యుమిన్స్‌ను బుమ్రా పెవిలియన్ పంపగా,
లియాన్ వికెట్ తీసిన ఇషాంత్ శర్మ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
కేవలం 27 బంతుల్లోనే అయిదో రోజు ఆట ముగియడంతో భారత్ 137 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, EPA
నాలుగో రోజే నిర్ణయం అయిపోయింది
అంతకు ముందు నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ పట్టు బిగించారు.
టీ విరామ సమయానికే ఆసీస్ ప్రధాన బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చడంతో భారత్ బౌలర్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు.
దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ బౌలర్లకు తలొంచక తప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగో రోజు ఆటన 54/5 ఓవర్ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన కోహ్లి సేన మరో 52 పరుగుల జోడించి 106/8 వద్ద డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా ముందు 399 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు కొద్దిసేపట్లోనే ఓపెనర్లు అరోన్ ఫించ్, మార్కస్ హరీస్‌ల వికెట్లు కోల్పోయింది.
ఫించ్‌ను జడేజా ఔట్ చేయగా, హరీస్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున ఉంది. అయిదో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత బౌలర్లు మిగతా పని పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియా మహిళలకు అడుగడుగునా ‘పోర్న్ కెమెరా’ గండం
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- సంక్రాంతి పండుగ కోసం వెయిటింగ్.. కోడి పందేలకు కత్తులు రెఢీ.. కోళ్లు రెఢీ
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









