వాట్సాప్: రేపటిలోగా బ్యాకప్ చేయకపోతే... మీ పాత బ్యాకప్ ప్యాకప్పే

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులా? వాట్సాప్ వాడుతున్నారా? అయితే, సాధ్యమైనంత తొందరగా మీ చాటింగ్‌ను బ్యాకప్ చేసుకుంటే మంచిది.
లేదంటే మీరు గతంలో తీసిన బ్యాకప్ అంతా నవంబర్ 12 తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని వాట్సాప్ తెలిపింది.
వీడియోలు, ఫొటోలు సహా వాట్సాప్ చాటింగ్ డేటాను బ్యాకప్ రూపంలో గూగుల్ డ్రైవ్ లేదా ఫోన్‌లోని మెమొరీ కార్డులో నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాకప్ తీసిన ప్రతిసారీ పాత బ్యాకప్ ఫైళ్లు అప్‌డేట్ అవుతుంటాయి.
అయితే, 12 నెలల్లో ఒక్కసారి కూడా బ్యాకప్ చేయకుంటే అంతకు ముందు చేసిన బ్యాకప్ అంతా గూగుల్ డ్రైవ్ స్టోరేజీ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని వాట్సాప్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అలా నష్టపోకుండా ఉండేందుకు 2018 నవంబర్ 12లోగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ చాటింగ్ బ్యాకప్‌లో సేవ్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. ఈ సమస్య యాపిల్ వినియోగదారులకు లేదని తెలిపింది.
"వాట్సాప్ చాటింగ్ డేటా బ్యాకప్‌ను గూగుల్ డ్రైవ్‌లో నిల్వ చేసుకోవచ్చు. దాంతో, మీరు ఆండ్రాయిడ్ ఫోన్ మార్చినా, లేదా కొత్తది తీసుకున్నా అందులోకి పాత చాటింగ్ డేటాను బదిలీ చేసుకునే వీలుంటుంది. అందుకే మీ చాటింగ్‌కు బ్యాకప్ తీసుకోండి" అని వాట్సాప్ సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాకప్ ఎలా తీయాలి?
1. వాట్సాప్ ఓపెన్ చేయాలి.
2. సెట్టింగ్స్ > చాట్ > బ్యాకప్
3. 'సేవ్ ఇన్ గూగుల్ డ్రైవ్' క్లిక్ చేయాలి. ఎన్ని రోజులకోసారి బ్యాకప్ తీయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.
4. మీకున్న గూగుల్ డ్రైవ్ ఖాతాల్లో దేనికి ఆ బ్యాకప్‌ను జతచేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.
5. ఏ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో(మొబైల్ డేటా లేదా వైఫై) ఉన్నప్పుడు బ్యాకప్ తీయాలో ఎంచుకోవాలి. మొబైల్ డేటాతో బ్యాకప్ తీస్తే, డేటా వినియోగం అధికంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. సాధ్యమైనంత మేరకు వైఫై ఉన్నప్పుడు బ్యాకప్ తీసుకుంటే మేలు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- అభిప్రాయం: కోర్టు తీర్పుల అమలు ఆచరణ సాధ్యం కాకపోతే పరిస్థితి ఏమిటి?
- వాట్సాప్‌లో ఈ మార్పులు వస్తున్నాయ్!
- లండన్: అంబేడ్కర్ నివసించిన ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- ఫేక్‌న్యూస్‌కు వ్యతిరేకంగా బీబీసీ సరికొత్త భారీ అంతర్జాతీయ కార్యక్రమం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








