అమెరికా వర్సెస్ రష్యా: ‘అణు యుద్ధ నివారణ ఒప్పందం రద్దు నిర్ణయం’పై ఆందోళనలు.. పుతిన్‌తో భేటీ కానున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్

ఫొటో సోర్స్, RUSSIAN DEFENCE MINISTRY
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రష్యాతో చేసుకున్న ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్‌ఎఫ్) ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాన్ని రష్యా ఖండించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తే అణునిరాయుధీకరణ కోసం చేసిన ప్రయత్నం వృథా అవుతుందని సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖయిల్ గోర్బచెవ్ అన్నారు.
మరోవైపు ఐఎన్‌ఎఫ్ ఒప్పందాన్ని రష్యా చాలా ఏళ్లుగా ఉల్లంఘిస్తోందని ట్రంప్ అన్నారు.
ఈ వ్యవహారంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ నుంచి వివరణ కోరుతారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.
పుతిన్‌ను కలిసేందుకు బోల్టన్ సోమవారం రష్యా రాజధాని నగరం మాస్కో చేరుకున్నారు. ఈ ఒప్పందం నుంచి వైదలగాలని వాదిస్తున్న వారిలో బోల్టన్ ముఖ్యులని తెలుస్తోంది.
బోల్టన్ రష్యా పర్యటన ముందే ఖరారైనప్పటికీ.. ఆయన ఉన్నతాధికారులతో మాత్రమే భేటీ కావాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్‌ను కూడా ఆయన కలిసే అవకాశాలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఐఎన్‌ఎఫ్ ఒప్పందం ఏంటి?
భూతలం నుంచి ప్రయోగించే స్వల్ప, మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర, ఇతర క్షిపణుల ప్రయోగాలను నిషేధిస్తూ అమెరికా, రష్యాల మధ్య 1987లో ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం జరిగింది.
500 నుంచి 5,500 కిలోమీటర్ల (310- 3,400 మైళ్ల) శ్రేణిలో భూతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులపై ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నిషేధం విధిస్తోంది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో రష్యా, అమెరికాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
1945 నుంచి 1989 వరకు ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉండేవి. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరగుకుండా ఉండేందుకు ఈ ఒప్పందం సహాయపడింది.
అయితే, ఎస్ఎస్20 పేరుతో పిలిచే క్షిపణి వ్యవస్థను రష్యా.. యూరప్ సరిహద్దుల్లో మోహరించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
1991లో ఇరుదేశాలు తమ దగ్గరున్న 2,700 క్షిపణులను ధ్వంసం చేశాయి.
యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ ట్రీటీ నుంచి 2002లో అమెరికా వైదొలగడంతో ఐఎన్‌ఎఫ్ ఒప్పందం రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా లేదని 2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ట్రంప్ ఏం చెప్పారు?
''అణ్వాయుధ క్షిపణులను రష్యా తయారు చేయడాన్ని మేం అనుమతించం'' అని ట్రంప్ అన్నారు.
''బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి ఎందుకు వైదొలగలేదో నాకు తెలియదు'' అని నెవాడాలోని ఓ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు.
భూతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని 2014లో రష్యా పరీక్షించింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా... రష్యా తీరును విమర్శించారు. ఐఎన్‌ఎఫ్ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
అయితే, యూరోపియన్ యూనియన్ నుంచి ఒత్తిడి రావడంతో ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలగలేదు.
ట్రంప్ నిర్ణయాన్ని మొదట విమర్శించింది అమెరికా మిత్రదేశం జర్మనీనే. ''భవిష్యత్తులో నిరాయుధీకరణ ప్రయత్నాలను దెబ్బతీయడంతో పాటు, యూరప్‌పై పడే ప్రభావాన్ని గ్రహించాలని వాషింగ్టన్ వర్గాలను కోరుకుంటున్నా'' అని జర్మనీ విదేశాంగ మంత్రి హయికో మాస్ అన్నారు.
500 నుంచి 5,500 కిలోమీటర్ల (310- 3,400 మైళ్ల) శ్రేణిలో భూతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులపై ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నిషేధం విధిస్తోంది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో రష్యా, అమెరికాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
1945 నుంచి 1989 వరకు ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉండేవి. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరగుకుండా ఉండేందుకు ఈ ఒప్పందం సహాయపడింది.
ఈ ఒప్పందాన్ని రష్యా ఎలా ఉల్లంఘించింది?
భూతలం నుంచి ప్రయోగించే మధ్యంతర క్షిపణి నొవటర్ 9ఎమ్729ను రష్యా అభివృద్ధి చేసి ఒప్పందాన్ని ఉల్లఘించిందని అమెరికా చెబుతోంది.
సంప్రదాయ సైనిక దళాలకు ఈ ఆయుధాలను రష్యా ప్రత్యామ్నాయంగా చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ప్రతిస్పందన ఏమిటి?
''ఒప్పందం నుంచి వైదొలగడం ప్రమాదకరమైన అడుగు. అంతర్జాతీయ సమాజం దీన్ని గ్రహించడమే కాదు తీవ్రంగా ఖండిస్తోంది'' అని రష్యా విదేశాంగ సహాయ మంత్రి సెర్జీ రయాబ్కోవ్ అన్నారు.
''అంతర్జాతీయ భద్రత, అణు యుద్ధ నివారణకు ఈ ఒప్పందం చాలా కీలకమైంది'' అని టాస్ వార్తా సంస్థతో చెప్పారు.
''అమెరికా ఇలాగే క్రూరంగా ప్రవర్తిస్తే మాకు వేరే దారి లేదు. ప్రతీకార చర్యలు చేపట్టడానికి వెనకాడం. కానీ, ఆ పరిస్థితి రాకూడదనే అనుకుంటున్నాం'' అని ఆర్ఐఏ నొవొస్టీ వార్తా ఏజెన్సీతో అన్నారు.
'ఆయుధ నియంత్రణకు విఘాతం'
ఐఎన్‌ఎఫ్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ క్షిపణి వ్యవస్థను రష్యా అభివృద్ధి పరుస్తోందనే ఆందోళన ట్రంప్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని బీబీసీ ప్రతినిధి జొనాథన్ మార్కస్ అన్నారు.
ఒప్పందం నుంచి వైదొలగాలనే ట్రంప్ నిర్ణయం ఆయుధ నియంత్రణ కోసం చేసే ప్రయత్నానికి గొడ్డలిపెట్టులాంటిదని పేర్కొన్నారు.
''ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోడానికి ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ద్వైపాక్షిక ఒప్పందం. దీనివల్ల ఇరు దేశాలు స్వల్ప, మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఇలాంటి క్షిపణులను అభివృద్ధి చేసి, మోహరించేందుకు చైనాకు స్వేచ్ఛ ఉంది. బీజింగ్‌పై ఆధిపత్యం సాధించడంలో ఈ ఒప్పందం అమెరికాకు అడ్డంకిగా మారుతోందని ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులు భావిస్తుండొచ్చు'' అని జొనాథన్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
గోర్బచెవ్ హెచ్చరిక
ట్రంప్ నిర్ణయాన్ని మొదట విమర్శించింది అమెరికా మిత్రదేశం జర్మనీనే. ''భవిష్యత్తులో నిరాయుధీకరణ ప్రయత్నాలను దెబ్బతీయడంతో పాటు, యూరప్‌పై పడే ప్రభావాన్ని గ్రహించాలని వాషింగ్టన్ వర్గాలను కోరుకుంటున్నా'' అని జర్మనీ విదేశాంగ మంత్రి హయికో మాస్ అన్నారు.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రష్యాతో చేసుకున్న ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్‌ఎఫ్) ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తే అణునిరాయుధీకరణ కోసం చేసిన ప్రయత్నం వృథా అవుతుందని సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖయిల్ గోర్బచెవ్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
మిఖయిల్ గోర్బచెవ్ ఎవరు?
- సోవియట్ యూనియన్ అఖరి జనరల్ సెక్రటరీ మిఖయిల్ గోర్బచెవ్.
- 1985లో సోవియట్ యూనియన్ జనరల్‌గా గోర్బచెవ్ నియమితులయ్యారు. ఆయన హయాంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసేలా అమెరికాతో అణు నిరాయుధీకరణ ఒప్పందం చేసుకున్నారు.
- 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంకాగానే తన పదవికి రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








