మనుషుల్ని చంపి తింటున్న పులి.. మహారాష్ట్రలో గాలిస్తున్న వంద మందికి పైగా అధికారులు, సిబ్బంది

పులి
ఫొటో క్యాప్షన్, భారత్‌లో పులిని చంపితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అయితే, మనుషులను తినే పులిని చంపేందుకు అధికారులు ఆదేశాలు ఇవ్వవచ్చు.

మహారాష్ట్రలో ఒక ఆడపులి 13 మందిని చంపేసిందనే అనుమానాలున్నాయి. వంద మందికి పైగా అధికారులు, సిబ్బంది దాదాపు మూడు వారాలుగా ఈ పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు.

ఈ వ్యాఘ్రం ఆచూకీ కోసం రాష్ట్రంలోని పాండర్‌కవడా ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రెండు ఏనుగులను కూడా రంగంలోకి దించారు. షార్ప్ షూటర్లు సిద్ధంగా ఉన్నారు. పులి జాడ మాత్రం తెలియట్లేదు.

ఈ పులి 10 నెలల వయసున్నతన రెండు పిల్లలతో కలిసి 160 చదరపు కిలోమీటర్ల సువిశాల ప్రాంతంలో సంచరిస్తోంది.

మనుషులను చంపుకుతింటున్న ఈ పులిని వెంటనే చంపేయాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నగరాల్లోని జంతు హక్కుల కార్యకర్తలు- పులి వేట నిలిపివేతకు ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.

భారత్‌లో పులిని చంపితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అయితే, మనుషులను వేటాడి తినే పులిని చంపేందుకు అధికారులు ఆదేశాలు ఇవ్వవచ్చు.

ఏది ఏమైనా, పులిని సజీవంగా పట్టుకోవడానికే శాయశక్తులా ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర: మనుషులను చంపి తింటున్న పులి కోసం ముమ్మర గాలింపు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)