భారత్ ఎన్నికల్లో జోక్యాన్ని ఆపేస్తాం : జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters
భారత్‌లో జరిగే ఎన్నికల్లో జోక్యాన్ని ఆపేస్తున్నామని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఫేస్‌బుక్ భారత్‌లో, బ్రెజిల్లో, అమెరికాలో నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఫేస్‌బుక్ జోక్యాన్ని ఆపేయాలని నిర్ణయించాం.. అని సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు.
అంతకు ముందు జుకర్‌బర్గ్ వ్యక్తిగత డేటా విషయంలో ఫేస్‌బుక్ తప్పులు చేసింది.. అని అంగీకరించారు.
ఈ తప్పుల వల్ల కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వనియోగమైందని పలు సంస్థలు ఇప్పటికే పేర్కొంటున్నాయి.
రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఈ ఫేస్‌బుక్ డేటాను దుర్వినియోగం చేశారని తాజాగా ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ ఈ ఆరోపణలపై స్పందించారు. తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ‘విశ్వాసానికి విఘాతం’ జరిగింది అని పేర్కొన్నారు. తర్వాత ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై క్షమాపణలు కోరారు.
ఇకపై తాము ఖాతాదారుల డేటాకు మరింత రక్షణ కల్పిస్తామని.. ఇతర యాప్స్ దీన్ని విశ్లేషించకుండా చేస్తామని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.
‘మీ డేటాను కాపాడటం మా బాధ్యత. అది చేయలేనపుడు మీకు సేవలు అందించలేం.’ అని స్పష్టం చేశారు.
మరి ఫేస్‌బుక్ ఏం చేయనుంది?
యూజర్ల డేటాను విశ్లేషించే.. తస్కరించే యాప్స్‌పై నిఘా పెంచుతారు.
ఏ యాప్ అయినా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే దానిపై పరిశోధన చేస్తారు.
ఫేస్‌బుక్ పరిశోధన, ఆడిట్‌కు అంగీకరించని డెవెలపర్స్‌ను ఎఫ్‌బీలో నిషేధిస్తారు.
ఏ యాప్ అయినా ఫేస్‌బుక్ డేటాను దుర్వనియోగం చేస్తే.. వాటిని నిషేధించడంతో పాటు ఆ సమాచారాన్ని అందరికీ వెల్లడిస్తారు.
పూర్తి డేటాను యాక్సెస్ చేయకుండా డెవెలపర్లను అడ్డుకుంటారు. యూజర్ డేటా యాక్సెస్‌ను తొలగిస్తారు.
ఈ వార్తకు సంబంధించిన మరిన్ని కథనాలు..
- అసలీ వివాదం ఏంటి? భారత్‌లో ప్రభావమేంటి?
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- మీ డేటాతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చా?
- బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









