దక్షిణ కొరియాలో ‘ఉత్తర కొరియా ఇవాంకా’
తమ దేశంలో పర్యటించాలంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్‌ని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించారు.
శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా కిమ్ సోదరి యో-జోంగ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.
సోల్ నగరంలోని అధ్యక్ష భవనంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగానే తన సోదరుడు కిమ్ స్వహస్తాలతో రాసిన ఆహ్వాన పత్రికను ఆమె దక్షిణ కొరియా అధ్యక్షుడికి అందజేశారు.
కిమ్ ఆహ్వానాన్ని మూన్ స్వాగతించారు. తమ సమావేశం తప్పకుండా జరగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు ఉత్తర కొరియా ముందుకురావాలని కూడా సూచించారు.
శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్తర కొరియా నుంచి వెళ్లిన ఉన్నత స్థాయి బృందానికి కిమ్ సోదరి నేతృత్వం వహిస్తున్నారు.
కొందరు ఆమెను 'ఉత్తర కొరియా ఇవాంకా'గా అభివర్ణిస్తారు.
సాధ్యమైనంత త్వరగా ప్యాంగ్యాంగ్ పర్యటనకు రావాలని తమ దేశాధ్యక్షుడిని కిమ్ సోదరి కోరినట్టు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

ఫొటో సోర్స్, NICHOLAS KAMM
అమెరికా ఎలా స్పందిస్తుంది?
ఉత్తర కొరియాతో చెలిమి చేయొద్దంటూ అమెరికా చేసిన హెచ్చరికల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.
శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా ఉత్తర కొరియా బుట్టలో దక్షిణ కొరియా పడిపోతోందంటూ అమెరికా నాయకత్వం హెచ్చరిస్తోంది.
ఇప్పుడు కిమ్ ఆహ్వానంతో దక్షిణ కొరియా పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి మాదిరిగా మారేలా కనిపిస్తోంది.
ఒకవేళ ఉత్తర కొరియాతో దక్షిణ కొరియా దగ్గరయితే, అమెరికాతో ఆ దేశానికి ఉన్న మిత్ర బంధంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరీ కిమ్ యో- జోంగ్?
1950-53 కొరియా యుద్ధం అనంతరం కిమ్ కుటుంబం నుంచి దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఈమెనే.
30 ఏళ్ల యో జోంగ్‌ను ఈమెను 'ఉత్తర కొరియా ఇవాంకా' అని దక్షిణ కొరియా మీడియా అభివర్ణిస్తోంది.
విదేశీ వ్యవహారాలపై ఉత్తర కొరియా తీసుకునే నిర్ణయాల్లో ఈమెదే కీలక పాత్ర.
తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారిక సమావేశాల్లోనూ ఎప్పుడూ ఈమె కనిపిస్తుంటారు.
ఇవి కూడా చూడండి:
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- 34 వేల కోట్లు.. కొల్లగొట్టారు
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- 'నాకు ‘ఖత్నా’ చేశారు.. నా కూతురికి అలా జరగనివ్వను!'
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










