సోమాలియాలో మారణహోమం: 358కి చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం ఒక రద్దీ కూడలిలోని హోటల్ వద్ద భారీ పేలుడు జరిగింది. దీంతో కనీసం 358 మంది మృతిచెందారు.
పేలుడు పదార్థాలు నింపిన లారీని పేల్చివేయడం భారీ ప్రాణనష్టానికి కారణమైంది.
ఈ ఘటనలో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.
పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంతవరకు తెలియలేదని వారు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters
'పేలుడు ధాటికి సఫారీ హోటల్ కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని 300 మంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు' అని సోమాలియాలోని బీబీసీ ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
సోమాలియా ప్రభుత్వంతో పోరాడుతున్న అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ తరచూ మొగదిషును లక్ష్యంగా చేసుకుంటుండడంతో ఇక్కడ హింస నిత్యకృత్యమైపోయింది. 2007లో అల్ షబాబ్ గ్రూప్ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాదం నేపథ్యంలో దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో మొహమ్మద్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)









