టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ, లేదా సిట్ విచారణకు అప్పగించాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాల్సిందిగా డబ్బు, పదవులు ఎరచూపి ప్రలోభపెడుతున్నారని.. ఓ ఫాంహౌస్‌పై పోలీసుల సోదాలో ముగ్గురు పట్టుబడ్డారన్న వార్త పెను సంచలనం సృష్టిస్తోంది.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను పార్టీ ఫిరాయించాల్సిందిగా ప్రలోభపెట్టటానికి ప్రయత్నించినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
అనేక నాటకీయ పరిణామాల తర్వాత , ఈ మొత్తం వ్యవహరాన్ని సీబీఐ, లేదా ప్రత్యేక విచారణ బృందం(సిట్) చేత విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం లేదంటూ బీజేపీ నేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు ద్వారా బీజేపీ ప్రతిస్టను దెబ్బతీయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దొరికిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు ఇప్పుడు ఏమయ్యాయి?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంటూ చెబుతున్న కేసులో పోలీసులకు దొరికిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు రూ. 400 కోట్లు ఇప్పుడు ఏమయ్యాయి? అని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
అది ప్రజల డబ్బే అయ్యి ఉంటుందని, ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు.
ఈ వ్యవహారంలో బీజేపీ పేరును తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. నిందితుల్లో బీజేపీ నాయకులు ఉన్నారా? నిందితులకూ బీజేపీకి సంబంధం ఏంటి? నలుగురు ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లు ఇస్తామని చెప్పింది ఎవరు? అసలు వాళ్లకు 400 కోట్ల స్థాయి, అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
ఈ నలుగురు ఎమ్మెల్యేల వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా? వీళ్లైమైనా ప్రజాబలం ఉన్న నాయకులా? వీళ్లు బీజేపీలో చేరితే బీజేపీకి ఏమైనా లాభం ఉందా? అని ప్రశ్నించారు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు దొరికాయని హడావుడి చేశారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారన్నారు.
తాము 2023 వరకూ వేచి చూస్తామని, తమకు తొందరేమీ లేదన్నారు.
నిందితుల్లో ఎవరూ బీజేపీ నాయకులు లేరని, వారు బీజేపీ ప్రతినిధులు కూడా కాదని చెప్పారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘మాకు కమిటీ ఉంది.. నేరుగా మాట్లాడుతుంది’
వేరే పార్టీల నుంచి బీజేపీలోకి నాయకులను చేర్చుకునేందుకు తమకు ఒక కమిటీయే ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు.
తమ పార్టీలో చేరాలనుకునే నాయకులతో ఈ కమిటీ నేరుగా మాట్లాడుతుందని చెప్పారు.
నందకుమార్ అనే వ్యక్తికీ తనకూ సంబంధం లేదని, ఏదైనా ఉంటే తామే స్వయంగా చేస్తామని, టీఆర్ఎస్ లాగా రాజీనామాలు చేయించకుండానే మంత్రిపదవులు కట్టబెట్టబోమని అన్నారు.
వేరే పార్టీల నాయకులతో మాట్లాడితే ఈటల రాజేందర్ మాత్రమే మాట్లాడతారని, వేరే వాళ్లు ఎవ్వరూ తమకోసం మాట్లాడాల్సిన పనిలేదన్నారు.
అందరి కాల్ లిస్టులూ బయటపెట్టాలి - బండి సంజయ్
ఈ కేసులో భాగమైన నిందితులు, ఎమ్మెల్యేలు, పోలీసులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మొబైల్ ఫోన్, ప్రగతి భవన్ ల్యాండ్ లైన్ ఫోన్ల కాల్ లిస్టు మొత్తం బయట పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని తాము వదిలిపెట్టబోమని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిందేని డిమాండ్ చేశారు.
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కింద మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో రాజేందర్ నగర్ ఏసీపీ నమోదు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
2022 అక్టోబర్ 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని పేర్కొన్నారు.
నందకుమార్, సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజీ స్వామిలను అరెస్ట్ చేశారు.
''సెప్టెంబర్ 26వ తేదీన దిల్లీకి చెందిన సతీశ్ శర్మ, హైదరాబాద్ నందకుమార్ ఇద్దరూ టచ్ లోకి వచ్చారు. టీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరితే. రూ.100 కోట్లు డబ్బు, కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు, పెద్ద పదవులు ఇస్తాం. చేరకపోతే సీబీఐ, ఈడీ కేసులు పెడతాం అన్నారు. అది అనైతిక చర్య కాబట్టి నేను డీల్ లోకి వెళ్లలేదు. కానీ, అక్టోబర్ 26వ తేదీన మళ్లీ కాంటాక్ట్ చేశారు. ఫామ్ హౌస్‌కు వస్తే చర్చిద్దామని, ఇతర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వస్తే వారికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తామన్నారు. వారు టీఆర్ఎస్‌లోనే ఉండి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టాలని, టీఆర్ఎస్‌ను అస్థిరపరచాలని చెప్పారు'' అని ఈ ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
బుధవారం సాయంత్రం నాటకీయ పరిణామాలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అందించిన సమాచారంతో హైదరాబాద్ నగర శివారులోని ఒక ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియాకు తెలిపారు.
''ముగ్గురు వ్యక్తులు వచ్చి తమను ప్రలోభ పెడుతున్నారని, డబ్బు ఇవ్వజూపారని, కాంట్రాక్టులు, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయించాలని ప్రలోభ పెట్టినట్లు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు
ఆ సమాచారం ఆధారంగా ఈ రోజు (రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో) ఫామ్ హౌస్ మీద రెయిడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇందులో ప్రధానంగా రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, ఈయన ప్రస్తుతం ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉంటారు. ఈయన దిల్లీలో ఉంటారు. ఈయనే ఇక్కడ వీళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కనపడుతోంది. ఆయనతోని సింహయాజి అని తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా వచ్చారు.
వీరిద్దరినీ ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే నందకుమార్ సన్నాఫ్ శంకరప్ప ఇక్కడకు తెచ్చి వీళ్లను ప్రలోభాలు పెట్టి, సంప్రదింపులు చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ మీద మేం ఈ రోజు ఈ రెయిడ్ నిర్వహించాం'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
''దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ చేసి, ఎలాంటి ప్రలోభాలు పెడుతున్నారు అన్నదానిపై పూర్తి సమాచారం వెల్లడిస్తాం'' అని సీపీ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను తిప్పికొడతాం: ప్రభుత్వ విప్
''మా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు గతంలో జరిగాయి. ఇప్పుడూ జరిగాయి'' అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ''గతంలో చంద్రబాబు నాయుడు ఆ పని చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రలోభాల కోసం ఎంత సొమ్ము ఉపయోగించిందో నాకు సమాచారం లేదు. కానీ, బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి కుట్రలను తిప్పికొడతాం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసే కుట్రలను బీజేపీ ఆపాలి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
‘‘ఓడిపోతామన్న భయంతో కేసీఆర్ డ్రామాలు’’
మునుగోడులో బీజేపీ విజయానికి కేసీఆర్ స్వయంగా స్కెచ్ వేసినట్లుగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇటీవల దిల్లీ వెళ్లిన కేసీఆర్ , అక్కడ ఈ స్వామిజీతో సమావేశమయ్యారని, అక్కడే ఈ కుట్రకు తెర తీశారని సంజయ్ ఆరోపించారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఈ డ్రామాకు కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్ కేసీఆరేనని, పోలీసుల ఆధ్వర్యంలో మరో కొత్త డ్రామా ఆడారని సంజయ్ అన్నారు.
మునుగోడులో ఓడిపోతామన్న భయంతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. తమకు ఎమ్మెల్యేల అవసరం ఏముందని ఆయన టీవీ9 వార్తా చానల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UGC
ఆ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరంగానీ, వారితో ఉపయోగంగానీ తమకు లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎవరితో విచారణ జరిపించడానికైనా సిద్ధమని పేర్కొన్నారు.
''సీబీఐ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకైనా సిద్ధం'' అని చెప్పారు. అసలు బీజేపీ తరఫున మాట్లాడటానికి స్వామిజీలెవరని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇచ్చినట్లు కేసీఆర్ డ్రామాలు సృష్టిస్తున్నారని బీజేపీ నేత డి.కె.అరుణ ఆరోపించారు. ''కేసీఆర్‌కు చిల్లర రాజకీయాలు చేయడం అలవాటు. పోలీసులు రెయిడ్ చేసిన ఫామ్ హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేదే. అక్కడికి వాళ్లకు తెలియకుండా స్వామీజీలు ఎలా వచ్చారో తెలియదా?'' అని ఆమె విమర్శించారు. కేసీఆర్ నిజయాయితీ పరుడైతే యాదాద్రి దేవుడి దగ్గర ప్రమాణం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే
- 'డర్టీ బాంబ్' అంటే ఏంటి? దీనిని యుక్రెయిన్ ఉపయోగిస్తుందా? రష్యా ఆరోపణలు ఎందుకు?
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













