‘ఒకప్పుడు పామును చూస్తే భయంతో పారిపోయేదాన్ని.. ఇప్పుడు ఎలాంటి పాములనైనా పట్టేస్తాను’
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా తుక్వాడకు చెందినన భావన పటేల్ పాములను పట్టడంలో నైపుణ్యం చూపిస్తారు. ఆమె ఇప్పటివరకు 13 వేలకు పైగా పాములు పట్టుకున్నారు.
పామును పట్టేందుకు రావాలని ఫోన్ వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె భద్రంగా పామును పట్టుకొని ఓ డబ్బాలో వేస్తారు.
సాధారణంగా ఈ పనిని పురుషులే చేస్తారు. ఆమె భర్త శైలేష్ పాములను పట్టుకోవడంపై శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత భావన కూడా ఈ పనిపై ఆసక్తి పెంచుకున్నారు. తన భర్త నుంచి ఆమె టెక్నిక్స్ నేర్చుకున్నారు.
భూమిపై ఉన్న ప్రతి జంతువుకు, పక్షికీ, ప్రాణికీ జీవించే హక్కు ఉంటుంది. వాటి పరిరక్షణకు మనుషులు సాయం చేయాలి. ఇదే ఉద్దేశంతో భావన నిరంతరం పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటే ధరలు తగ్గుతాయా
- పవన్ కల్యాణ్: జనసేనాని 'జన నేత' ఎందుకు కాలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎందుకు ఎదగడం లేదు?
- గుండె, కిడ్నీ మార్పిడికి ఇక వేచి చూడక్కర్లేదా? మనుషులకు పందుల అవయవాలు సెట్ అయినట్లేనా?
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



