కడప: ఈ ఆకుపై కూర్చుంటే పడవలో ఉన్నట్లుంటుంది

వీడియో క్యాప్షన్, అమెజాన్ అడవుల్లో ఉండే అతి పెద్ద ఆకు ఇప్పుడు కడపలో

ఆకు అంటే గట్టిగా గాలొస్తే ఎగిరిపోతుంది. కానీ ఈ ఆకులపై 60 కిలోల బరువు పెట్టినా కూడా నీటిలో తేలుతూనే ఉంటాయి. అందుకే వీటిని జెయింట్ లిల్లీ అని పిలుస్తారు. విక్టోరియా అమెజోనికా అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ ఆకులు అమెజాన్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కడపలోని యోగి వేమన యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్‌లో ఉన్న ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అమెజాన్ వాటర్ లిల్లీ.. అమెజాన్ వాటర్-ప్లాటర్.. జెయింట్ వాటర్ లిల్లీ.. రాయల్ వాటర్ లిల్లీ.. ఇలా వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

నీటిలో బతికే ఈ మొక్క విశాలమైన ఆకులతో ప్రసిద్ధి చెందింది. దీనిని నాటిని మూడు నెలలకే రెండున్నర మీటర్ల వరకూ విస్తరిస్తుంది.

దిగువ భాగంలోని స్పాంజి తరహా సిరల ద్వారా ఈ ఆకులకు బలం వస్తుంది. ఆకుల చుట్టూ అంచులు ఉంటాయి. అడుగుభాగంలోని కాండం దృఢంగా కనిపిస్తుంది. ఆకు మీద బరువు నిలబడడానికి అదే కారణమని నిపుణులు చెబుతారు.

‘ప్రపంచంలోనే నీళ్లలో పెరిగే అది పెద్ద ఆకు ఇది కోల్ కతా నుంచి రెండు ప్లాంట్లు తీసుకొచ్చాం. 2019 నుంచి 100కి పైగా మొక్కలున్నాయి. వాటికి సరిపడా చోటు లేక కొన్ని మాత్రమే ఉంచాం. 60 కిలోల వరకూ బరువు నిలబడుతుంది. నాలుగైదు మీటర్ల కాండం ఉంటుంది. ఆకు బరువు 30,40 కిలోల వరకూ ఉంటుంది’ అని యోగి వేమన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)