కొండచిలువను దత్తత తీసుకున్న విశాఖ యువతి
పాము కనిపిస్తే చాలా మంది పారిపోతారు. కానీ విశాఖకు చెందిన ఒక యువతి ఏకంగా పామునే దత్తత తీసుకున్నారు. మరొక పెద్దాయన ఏనుగును అడాప్ట్ చేసుకున్నారు... కాకపోతే ఈ ప్రాణులన్నీ విశాఖపట్నం జూలో ఉంటాయి. విశాఖ జూలోని జంతువులను నగరవాసులు దత్తత తీసుకోవడం ఇటీవల పెరుగుతోంది. చాలా మంది పాములను చూసి భయపడుతుంటారు కానీ అవి కూడా ఈ పర్యావరణంలో భాగమేనని, వాటిని కాపాడాలనే ఉద్దేశంతోనే పామును అడాప్ట్ చేస్తుకున్నానని చెబుతున్నారు భువనేశ్వరి.జూలో జంతువులు కొంత కాలం పాటు మనవి అని చెప్పుకోవడం చాలా బాగుంటుందని అంటున్నారు ఆదినారాయణ. ఆయన పని చేస్తున్న కళాశాల విద్యార్థులతో కలిసి 10 రకాల జంతువులను ఏడాది కాలానికి ఆయన దత్తత తీసుకున్నారు. ఇవి కూడా చదవండి:
- రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్లో ఏం జరిగింది?
- ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ
- విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ చాంబర్ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు... 99 రూపాయల హంగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


