లతా మంగేష్కర్‌కు నచ్చిన సింగర్ ఎవరు? ఏ భాషలో పాడడం కష్టంగా భావించారు

వీడియో క్యాప్షన్, లత మంగేష్కర్‌కు నచ్చిన సింగర్ ఎవరు? ఏ భాషలో పాడడం కష్టంగా భావించారు

లతా మంగేష్కర్‌ 90వ పుట్టిన రోజు సందర్భంగా బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు.

90 ఏళ్లు వచ్చినా తనకు వృద్ధాప్యం వచ్చినట్లుగా భావించనని.. ఇప్పటికీ పాతికేళ్ల యువతిగానే ఫీలవుతానని చెప్పారు.

తన మధుర గానంలో ఎలాంటి రహస్యం లేదని.. అంతా తన తల్లిదండ్రుల ఆశీర్వాదం అని లత చెప్పారు.

హేమచంద్ర ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, మదన్, సలీల్ చౌధురి, జయదేవ్, శంకర్ జైకిషన్ వంటి సంగీతకారులు తనకు ఇష్టమన్నారు.

ఈతరంలో సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్, సోనూ నిగమ్ వంటివారు బాగా పాడుతున్నారని ఆమె చెప్పారు.

అన్ని భాషల్లో పాడడం తనకు ఇష్టమేనని, అయితే.. తమిళంలో పాడేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించేందని చెప్పారు. ఒకసారి రష్యన్‌లో పాడాల్సి వచ్చిందని... అది కూడా కష్టమనిపించిందని చెప్పారు. అయితే, తన పాట రష్యన్‌లకు బాగా నచ్చిందన్నారు.

పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)