నియోకోవ్ వేరియంట్: ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారా.. ఏంటీ ప్రచారం.. ఇందులో నిజమెంత?

వీడియో క్యాప్షన్, నియోకోవ్ వేరియంట్: ముగ్గురిలో ఒకరు చనిపోతారా.. ఏంటీ ప్రచారం.. ఇందులో నిజమెంత?

'నియోకోవ్' కరోనావైరస్ పూర్తి స్వభావం గురించి తెలుసుకోవాలంటే దానిపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

దక్షిణాఫ్రికాకు చెందిన గబ్బిలాలలో ఈ కొత్త కరోనా వైరస్ 'నియోకోవ్'ను చైనా పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతానికైతే ఈ వైరస్ జంతువుల్లోనే వేగంగా వ్యాపిస్తోంది.

భవిష్యత్‌లో ఈ వైరస్ మానవులకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు.

సాధారణ జలుబు దగ్గర నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారి తీసే విభిన్న వైరస్‌ల సమూహంలో కరోనా వైరస్‌లు ఒక భాగం.

''ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, అయితే ఇది మానవులకు ప్రమాదకరమా? కాదా? అనే విషయం తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం'' అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

''మానవుల్లో పుట్టుకొస్తోన్న 75 శాతం కంటే ఎక్కువ అంటురోగాలకు ప్రధాన మూలం జంతువులే. ఇందులో ముఖ్యంగా అడవి జంతువుల పాత్ర మరింత ఎక్కువ. సాధారణంగా కరోనా వైరస్ తరచుగా జంతువుల్లో కనిపిస్తుంది. గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉంటుంది. అనేక వైరస్‌లకు గబ్బిలాలు ఆవాసాలుగా ఉంటాయి'' అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)