అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ట్విటర్ అకౌంట్ హ్యాక్

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ట్విటర్ అకౌంట్ ఆదివారం హ్యాక్ అయ్యింది.

హ్యాకర్స్ ట్విటర్ అకౌంట్ పేరును 'ఎలన్ మస్క్' అని మార్చారని పార్టీ ప్రతినిధి చెప్పారు.

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఆయన నిరంతరం చర్చల్లో ఉంటారు.

తొమ్మిది రోజుల ముందే ఈ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, కానీ తర్వాత దానిని పునరుద్ధరించామని ఎంఐఎం పార్టీ ప్రతినిధి చెప్పారు. దీని గురించి ట్విటర్‌కు కూడా సమాచారం కూడా ఇచ్చామని, కానీ, ఇప్పుడు హ్యాకర్స్ పార్టీ అకౌంట్‌ను మరోసారి హ్యాక్ చేశారని తెలిపారు.

అసదుద్దీన్ పార్టీ ఎంఐఎం ట్విటర్ హ్యాక్

ఫొటో సోర్స్, TWITTER

సోమవారం దీని గురించి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పార్టీ చెప్పింది. ఈ అకౌంట్‌కు 6.78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ అకౌంట్ నుంచి ఇప్పుడు కొత్త ట్వీట్స్ ఏవీ చేయలేదని ఏఐఎంఐఎం చెప్పింది.

ఇటీవల ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆయన పార్టీ ఓంప్రకాష్ రాజ్‌భర్ పార్టీతో కలిసి పొత్తుకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)