కోవిడ్ 19: భారత్ కోసం ప్రార్థించిన పాకిస్తాన్ ట్విటర్ - ఏఐ పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీత పాండే
- హోదా, బీబీసీ న్యూస్
చారిత్రకంగా వైరి దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న పగుళ్లతో కూడిన సంబంధాలు ఇటీవల సోషల్ మీడియా వేదికలపైకి చేరాయి.
కానీ, భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన ఏప్రిల్ నెలలో మాత్రం ఇందుకు భిన్నంగా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు #ఇండియా నీడ్స్ ఆక్సిజన్, #పాకిస్తాన్ స్టాండ్స్ విత్ ఇండియా అనే హ్యాష్‌టాగ్‌లతో పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయి.
అయితే, మద్దత్తునిచ్చే హ్యాష్‌ట్యాగ్‌లు ఎప్పుడూ పాజిటివ్ ట్వీట్‌లే కానక్కరలేదని విశ్లేషకులు అంటున్నారు. నెటిజన్‌లు ఆ ట్వీట్లను ట్రోలింగ్ చేయడం నుంచి క్రికెట్, బాలీవుడ్ స్టార్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే వరకూ వాడుకుంటారు.
ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు పాకిస్తాన్ నుంచి పోస్టు చేసిన వేలాది ట్వీట్లను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులు అధ్యయనం చేశారు. వీటిలో ఎక్కువగా పాజిటివ్ ట్వీట్లే ఉన్నట్టు గుర్తించారు.
అమెరికాలోని కార్నెజీ మెలన్ విశ్వవిద్యాలయం (సీఎంయూ)కు చెందిన ఆషికుర్ ఖుదాబుక్ష్ నేతృత్వంలోని పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ టూల్స్ వాడి 'దయ, సానుభూతి, సంఘీభావం' ను ప్రదర్శించిన ట్వీట్లను గుర్తించారు.
పరిశోధనలో భాగంగా, బాగా ట్రెండ్ అవుతున్న #IndiaNeedsOxygen, #PakistanStandsWithIndia, #IndiaSaySorryToKashmir మూడు హ్యాష్ ట్యాగ్‌ల తో కూడిన 3 లక్షల ట్వీట్లను సేకరించారు. వీటిలో 55,712 ట్వీట్లు పాకిస్తాన్ నుంచి, 46,651 ట్వీట్లు భారత్ నుంచి మిగిలినవి ఇతర దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. చివరి హ్యాష్ ట్యాగ్ భారత్, పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న వైరాన్ని సూచిస్తోంది.
ఇవే ట్వీట్ల నుంచి పదాలను తీసుకుని, సానుకూల కామెంట్లను గుర్తించే 'హోప్ స్పీచ్ క్లాసిఫైయర్'టూల్‌లో రన్ చేశారు. ట్వీట్లలో 'పగ, ప్రార్థనలు, సానుభూతి, బాధ, సంఘీభావం' తదితర పదాలు ఉన్నాయో లేదో గుర్తించడానికి నమూనాలను ఉపయోగించారు.
మద్దతు తెలిపే హ్యాష్ ట్యాగ్‌లు పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచే వచ్చినట్టు గుర్తించారు.మద్దతు లేని ట్వీట్‌లకంటే వీటికే లైకులు, రీట్వీట్‌లు ఎక్కువగా వచ్చాయని అధ్యయనంలో తేలింది.
"భావోద్వేగాలను వ్యక్తీకరించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఒకేలా ఉంటారు. యాదృచ్ఛికంగా సెర్చ్ చేస్తే, 44 శాతానికి పైగా సానుకూల ట్వీట్లు ఎక్కువగా కనిపిస్తాయి. మా పరిశోధనలో 83 శాతం సమయం సానుకూల ట్వీట్లే కనిపించాయి" అని ఖుదాబక్ష్ చెప్పారు.
ఏప్రిల్ చివరిలో, మే ప్రారంభంలో కరోనా మహమ్మారి ధాటికి బెడ్‌లు, ఆక్సిజన్ కొరతతో భారత్‌లో అధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో సరిహద్దులకు అవతల నుంచి కూడా పెద్ద ఎత్తున భారత్‌కు మద్దతు పెరిగింది.
పాకిస్తాన్‌లో కూడా కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడం కూడా ఈ పరిణామాలకు కారణం కావొచ్చని లాహోర్‌లో చరిత్ర ప్రొఫెసర్ ఆరిఫా జెహ్రా చెప్పారు.
"ఇక్కడ కూడా పరిస్థితి దారుణంగా ఉంది. మా ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. మా శత్రువు పరిస్థితి కూడా ఇలానే ఉంది. మా సరిహద్దులు చాలా దగ్గరగా ఉండటంతో, ఏం జరిగినా మేము కూడా దానికి ప్రభావితం అవుతాం. సానుకూల సందేశాలను చూడటం ఒక మంచి అనుభూతినిచ్చింది. మనం ఇంకా మనుషులమేననే గొప్ప భరోసా వచ్చింది. ఒక మహమ్మారి సరిహద్దులను భౌగోళికంగా లేదా సైద్ధాంతికంగా గుర్తించలేదు. కారు మబ్బులు మీ పై కమ్ముకున్నప్పుడు, మంచి జరగాలనే ప్రార్థనలు చేస్తే ఎటువంటి హాని జరగదు. ఈ సందర్భంలో పాకిస్తాన్ ట్విట్టర్ యూజర్లు చేసింది ఇదే" అని జెహ్రా అన్నారు.
పాకిస్తాన్ ట్విట్టర్ యూజర్లు చేసిన పోస్టుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
"ఓ దేవుడా భారత ప్రజలపైన దయ చూపించు. మా ప్రార్థనలు, సానుభూతి మీపై ఉంటాయి. మనం పొరుగు వారం మాత్రమే శత్రువులం కాదు" అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

"మనం పొరుగు వారం, శత్రువులం కాదు. మనం సరిజోడులం, ప్రత్యర్థులం కాదు. మనకు సరిహద్దులున్నాయి, కానీ మన హృదయాలకు కాదు" అంటూ మరొకరు పోస్ట్ పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

"మా పక్కనే ఉన్న భారత్‌లో ఈ పరిస్థితులు చూడటం హృదయ విదారకం. పాకిస్తాన్ నుంచి ప్రేమ, ప్రార్థనలు పంపండి. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడటానికి ఆ దేవుడు మానవాళికి సహాయం చేస్తాడు. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి" అని మరొకరు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

"సానుకూల సందేశాలను గుర్తించి, అందరికీ తెలిసేలా చేయడం ద్వారా దేశాలు, సమాజాల మధ్య సంబంధాలు మెరుగుపడటమే కాకుండా ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఒక దేశం మహమ్మారి లాంటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆశలను సజీవంగా ఉంచే మాటలే ఓ దివ్య ఔషధంలా పని చేస్తాయి. ఇలాంటి సమయంలో ప్రతికూలతను చిట్ట చివరగా చూడాలి.
ఎక్కువ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నెగటివ్ కంటెంట్‌ను అనుసరిస్తే దానికి ప్రభావితమవుతారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మా పద్దతి ద్వేషపూరిత సంభాషణలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది" అని ఖుదాబక్ష్ అన్నారు.
"యుద్ధ సమయాల్లో లేదా ఆరోగ్య సంక్షోభం వంటి ప్రతికూల పరిస్థితుల్లో నెగటివ్ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి బదులు, సానుకూల అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమైన విధానం. ఇలా చేయడం వల్ల గీతకు అవతలి వైపు ఉన్నవారు కూడా మానవత్వం ఉన్న మనుషులే అనే నమ్మకాన్ని కలిగిస్తుంది"'అని ఖుదాబక్ష్ పేర్కొన్నారు.
కానీ, దీనికి వ్యతిరేకంగా, సానుభూతిని ప్రదర్శించే కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి టెక్నాలజీ ని వాడుకుంటే ఏమి జరుగుతుంది?
"సానుభూతితో కూడిన కంటెంట్ ను సెన్సార్ చేయడానికి టెక్నాలజీని వాడవచ్చు. అందుకే, ఇలాంటి విధానాలను అవలంబించడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సమగ్రమైన విధానాన్ని అభివృద్ధి చేయడమే మా విధి" .
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








