ప్లాస్టిక్‌ - భూమి బంధం ముగిసిందా... అవి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్‌ - భూమి బంధం ముగిసిందా... అవి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది?

ప్లాస్టిక్ ఆవిష్కరణను శాస్త్ర, సాంకేతిక రంగం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకొనేవారు. ప్లాస్టిక్ మన జీవితాలను ఎంతగానో సులభతరం చేసింది. మన జీవితాలతో పెన వేసుకుపోయింది.

అయితే ప్లాస్టిక్ వినియోగం మితిమీరి పోవడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో భూమికి కీడు కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇది ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భూమి, ప్లాస్టిక్ విడిపోవాల్సి వస్తే వాటి మధ్య సంభాషణ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో నాటకీయంగా చూపించే ప్రయత్నం చేశాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)