You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్... జైలు నుంచి విడుదలవుతారా? -Newsreel
పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది.
జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో లాలూ యాదవ్‌కు జైలు నుంచి బయటకు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది.
లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దుమ్కా ట్రెజరీగా ప్రాచుర్యం పొందిన కేసులో దోషిగా నిర్ధరించింది. గతంలో దుమ్కా నగర ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి.
ప్రస్తుతం అనారోగ్యంతో దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో మూడింట్లో ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఇప్పుడు దుమ్కా కేసులో కూడా బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగినట్లయింది.
జైలు జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆయన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోనే గడిపారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న లాలూనూ గత జనవరి నెలలో దిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- లండన్: అంబేడ్కర్ నివసించిన ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- కొందరికి పీరియడ్స్ సమయంలో కంటి నుంచి కూడా రక్తం వస్తుంది ఎందుకు
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- ‘ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)