ఉత్తరప్రదేశ్‌లో ‘లవ్ జిహాద్’ చట్టం కింద మొట్టమొదటి కేసు నమోదు - Newsreel

లవ్ జిహాద్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'లవ్ జిహాద్‌'గా చెబుతున్న ఘటనలకు సంబంధించి "లా అగైనెస్ట్ రిలిజియస్ కన్వర్షన్ ప్రొహిబిషన్ యాక్ట్-2020" ఆర్డినెన్స్ తీసుకొచ్చి 24 గంటలైనా గడవకముందే, ఆ చట్టం కింద ఉత్తరప్రదేశ్ బరేలీలో మొదటి కేసు నమోదైంది.

బరేలీ జిల్లాలోని దేవరనియాలో టీకారామ్ అనే వ్యక్తి గ్రామంలోని ఒక యువకుడు తన కుమార్తెను వలలో వేసుకుని మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లఖ్‌నవూలోని బీబీసీ సహచర విలేఖరి సమీరాత్మజ్ మిశ్రా చెప్పారు.

దీనిని బరేలీ పోలీసు అధికారులు కూడా ధ్రువీకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"నిందితుడు బాలికను లేపుకుని వెళ్లాడు. ఇంతకు ముందే అతడిపై కేసు నమోదైంది. మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఒత్తిడి తెస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త ఆర్డినెన్స్ కింద అతడిపై కేసు నమోదు చేశాం. అబ్బాయి పరారీలో ఉన్నాడు. కానీ, త్వరలోనే అతడిని అరెస్టు చేస్తాం" అని బరేలీ రూరల్ ఎస్పీ డాక్టర్ సంసార్ సింగ్ చెప్పారు.

line

జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఈసారి హైదరాబాద్ మేయర్ పదవి బీజేపీదే: అమిత్ షా

అమిత్ షా

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు చేశారు

హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీకి అపార మద్దతు తెలిపిన హైదరాబాదీలకు ధన్యవాదాలు తెలిపారని ఏఎన్ఐ పేర్కొంది.

"బీజేపీ ఈ ఎన్నికల్లో తన ఉనికిని, స్థానాలను పెంచుకోడనికే పోరాడడం లేదని.. హైదరాబాద్ మేయర్ మా పార్టీ నుంచే అవుతాడని రోడ్ షో తర్వాత నాకు నమ్మకం ఏర్పడింది" అని అమిత్ షా చెప్పారు.

"హైదరాబాద్‌కు ఐటీ హబ్ కాగలిగే సామర్థ్యం ఉంది. దానికి నిధులు కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చినా మౌలిక సదుపాయాలను మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రస్తుత కార్పొరేషన్ దానికి అతిపెద్ద అడ్డంకిగా మారింది" అని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.

నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు తాము విముక్తి కల్పిస్తామని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలతో ఒక కొత్త ఆధునిక నగర నిర్మాణానికి కృషి చేస్తామ"ని అమిత్ షా అన్నారు. వారసత్వ రాజకీయాల నుంచి కూడా నగరానికి విముక్తి కల్పిస్తామన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

హైదరాబాద్‌లో రోహింజ్యాలు అక్రమంగా ఉంటే, హోంమంత్రి ఏం చేస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారని ఏఎన్ఐ చెప్పింది.

‘‘నేను చర్యలు తీసుకున్నప్పుడు పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తారు. గట్టిగట్టిగా అరుస్తారు. బంగ్లాదేశీ, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని నాకు రాసివ్వమనండి. తర్వాత నేను చర్యలు తీసుకుంటానని వాళ్లకు చెప్పండి’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

‘‘ఎన్నికల్లో మాట్లాడడం వల్ల ఏం జరగదు, వాళ్లను వెళ్లగొట్టడానికి పార్లమెంటులో చర్చ జరిగినపుడు, ఎవరు వారి పక్షాన మాట్లాడారో, దేశ ప్రజలకు తెలుసు, అందరూ టీవీల్లో లైవ్ చూశారు" అని అమిత్ షా మాట్లాడిన వీడియో కూడా ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

line

వందేళ్ల కిందట మాయమైన అరుదైన మొక్క.. మళ్లీ ప్రత్యక్షం

గ్రాస్-పాలీ

ఫొటో సోర్స్, ROB PEACOCK

గులాబీ రంగు పూలు పూసే ఈ మొక్కను గ్రాస్-పాలీ అంటారు. ఇది నార్త్ ఫోక్‌లోని ఒక పాడుబడ్డ చెరువు దగ్గర పెరుగుతున్నట్టు గుర్తించారు.

ఈ మొక్కల గింజలు బురదలో లోతుకు చేరుకున్నాయని, తాజాగా ఆ చెరువును పునరుద్ధరించడంతో వీటికి పునర్జన్మ వచ్చిందని చెబుతున్నారు.

తగిన సంరక్షణ చర్యలు తీసుకుంటే, ఎప్పుడో అంతరించిపోయిన అరుదైన మొక్కలను తిరిగి తీసుకురావచ్చని దీనితో నిరూపితమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిటన్ అంతటా విధించిన మొదటి లాక్‌డౌన్ ముగిసిన తర్వాత హేడన్‌ సమీపంలో ఉన్న ఈ చెరువు వెళ్లిన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌ ప్రొఫెసర్ కార్ల్ సాయర్‌కు ఈ అరుదైన మొక్కను కనుగొన్నారు.

ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని ఆ మొక్కను ఆయన వెంటనే ఫొటో తీసి, దానిని స్థానిక వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ జో పారమంటెర్‌కు పంపించారు. ఆమె దానిని బ్రిటన్‌లో అత్యంత అరుదైన మొక్క గ్రాస్-పాలీగా గుర్తించారు.

గ్రాస్-పాలీ

ఫొటో సోర్స్, TIM PANKHURST

అందమైన మొక్క

ఆ మొక్క నిజంగా చాలా అందంగా ఉంది అని ప్రొఫెసర్ సాయర్ చెప్పారు.

"మాకు ఆ చెరువులో ఇలాంటి కొన్ని మొక్కలే కనిపించాయి. ఇప్పుడు మాకు అది ఉందని తెలిసింది కాబట్టి, వీటిని సాగు చేసి వాటి సంఖ్యను మరింత పెంచుతాం" అన్నారు.

ఈ మొక్క పొటో చూడగానే డాక్టర్ జో పారమెంటెర్ ఆశ్చర్యపోయారు.

"ఇది నార్‌ఫోక్‌లో ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఇది నిజంగా అద్భుతం. ఫొటో చూడగానే, అది ఏ మొక్కో నాకు తెలిసిపోయింది" అన్నారు.

నార్‌ఫోక్‌లోని రికార్డుల్లో గ్రాస్-పాలీ మొక్క కనిపించినట్లు చివరగా వందేళ్లకు ముందు ధ్రువీకరించారు. బ్రిటన్‌లో ఇది బురదలు, నీటి కుంటల చుట్టూ అక్కడక్కడా ఉన్నట్లు గుర్తించారు.

హేడన్‌లో ఈ మొక్క గింజలు బురదలో ఒక టైమ్ కాప్స్యూల్‌లా ఉండిపోయాయి. ఈ చెరువును పునరుద్ధరించడానికి తవ్వినపుడు మట్టి కదిలి, ఎండ కూడా పడడంతో ఆ గింజలు మొలకెత్తాయి.

"అక్కడ ఆక్సిజన్ లేదు, చాలా చీకటిగా ఉంది, విత్తనాల సంరక్షణకు అది చక్కగా అనువుగా ఉందని" సాయెర్ అన్నారు.

ఇప్పుడు ఈ మొక్కను గుర్తించడంతో అంతరించిపోయాయి అనుకునే మొక్కలకు మెరుగైన సంరక్షణతో తిరిగి ప్రాణం పోయవచ్చని నిరూపించింది.

గోస్ట్ పాండ్

ఫొటో సోర్స్, CARL SAYER

గోస్ట్ పాండ్స్

శతాబ్దాల క్రితం నార్‌ఫోక్‌లో వేల చెరువులు ఉండేవి. కానీ వాటిలో చాలావాటిని పట్టించుకోకుండా వదిలేశారు. దాంతో వాటికి 'గోస్ట్ పాండ్స్' అనే పేరు వచ్చింది.

నార్‌ఫోక్‌లో ఉన్న మిగతా ఎన్నో మొక్కల జాతులను ఇప్పటికీ పట్టించుకోవడం లేదని యూసీఎల్ పరిశోధకులు హెలెన్ గ్రీవ్స్ చెప్పారు.

"చెరువులను పునరుద్ధరించడం వల్ల మరిన్ని మొక్కలు వెలుగులోకి వస్తాయా? అయినా ఈ మొక్కను గుర్తించడం అనేది మా నార్‌ఫోక్ పాండ్స్ ప్రాజెక్టుకు ఒక ఊహించని ఫోకస్ ఇచ్చింది" అన్నారు.

ఎన్నో అసాధారణ మొక్కలను కనుగొన్న ఇది ఒక అద్భుతమైన ఏడాది అని డాక్టర్ పారమెంటర్ చెప్పారు. కరోనా మహమ్మారి కూడా దానికి పాక్షికంగా కారణమైందని ఆమె భావిస్తున్నారు.

line

ఇథియోపియా: ప్రాంతీయ రాజధాని మెకెల్‌ను స్వాధీనం చేసుకున్నాం - ప్రధాని ప్రకటన

టీగ్రే సంక్షోభం

ఫొటో సోర్స్, AFP

ఉత్తర టీగ్రే ప్రాంతీయ రాజధానిని ప్రభుత్వ సైనిక దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు ఇథియోపియా ప్రధానమంత్రి అబి అహ్మద్ తెలిపారు.

టీగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్)పై దాడిని ముమ్మరం చెయ్యడానికి సైనిక బలగాలు మెకెల్‌లోకి ప్రవేశించాయి.

మెకెల్‌లోని ఇథియోపియా సైన్యం నార్తన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌పై ప్రాంతీయ పార్టీ అయిన టీపీఎల్ఎఫ్ దాడి చేసిందని ఆరోపిస్తూ ప్రధాని అబి అహ్మద్ ఈ నెల ప్రారంభంలో టీపీఎల్ఎఫ్‌కు వ్యతిరేకంగా ఒక ఆపరేషన్ ప్రకటించారు. అప్పటినుంచీ మెకెల్‌లో ఘర్షణలు నెలకొన్నాయి.

ఈ ఘర్షణల్లో వందలాదిమంది చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

"మా స్వయం నిర్ణయాధికార హక్కును కాపాడుకునేందుకు, దురాక్రమణలను అడ్డుకునేందుకు మేము చివరిదాకా పోరాడతాం" అని టీపీఎల్ఎఫ్ నాయకుడు డెబ్రెట్సీన్ గేబ్రీమైఖల్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.

ఈ ప్రాంతం పూర్తిగా ఆర్మీ నియంత్రణలోనికి వచ్చిందని, మిలటరీ ఆపరేషన్‌లో ఇది చివరి అంకమని అబి ట్వీట్ చేశారు.

టీపీఎల్ఎఫ్ నిర్బంధంలో ఉన్న వేలాదిమంది సైనికులను ఆర్మీ విడిపించిందని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఈ ఆపరేషన్ నిర్వహించామని అబి స్పష్టం చేశారు.

"ఇప్పటివరకూ వినాశనానికి గురైన ప్రాంతాన్ని పునర్నిర్మించి, ఇక్కడినుంచీ భయపడి పారిపోయిన ఈ ప్రాంతవాసులను తిరిగి రప్పించడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం" అని అబి తెలిపారు.

అయితే, ఇథియోపియా ఆర్మీ మెకెల్‌లో ఘర్షణలకు దిగితే యుద్ధ నేరాలు పెచ్చు మీరే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

టీగ్రే ప్రాంతంలో మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ రద్దు చెయ్యడంతో ఈ ఘర్షణల పూర్తి వివరాలు తెలియలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)