BBC 100 మంది మహిళలు: ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖులు... వీరిలో నలుగురు భారతీయులు

బీబీసీ 100 మంది మహిళామణులు

ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబితాను బీబీసీ విడుదల చేసింది.

ప్రస్తుత సంక్షుభిత సమయంలో సామాజిక మార్పునకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళల గురించి ఈ ఏడాది '100 మంది మహిళామణులు' వివరిస్తుంది.

ఫిన్‌లాండ్‌లో మొత్తంగా మహిళలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సన్నా మారిన్, అవతార్ - మార్వెల్ చిత్రాల నటి మిషెల్లి యెవో, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సీన్ పరిశోధక బృందానికి నాయకత్వం వహిస్తున్న సారా గిల్బర్ట్ వంటి వారు ఈ ఏడాది జాబితాలో ఉన్నారు.

ఈ అసాధారణ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఇతరుల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. 100 మంది మహిళామణుల జాబితాలో ఒక పేరును వారికి నివాళిగా ఖాళీగా ఉంచాం.

బీబీసి 2020 100 మంది మహిళలు

  • వెలుగులోకి రాని మహిళ

    ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకువస్తున్నది

    జాబితాలోని మొదటి స్థానం ఈ అసాధారణ సంవత్సరంలో వారి పనిని గుర్తించడం కోసం ఇతరులకి సహాయపడటానికి త్యాగాలు చేసిన అసంఖ్యాక మహిళల కోసం, , ప్రపంచంలో మార్పు తీసుకువస్తూ తమ ప్రాణం కోల్పోయిన వారి కోసం కేటాయించబడింది.

    ప్రపంచవ్యాప్తంగా తాము చేసిన పనుల ద్వారా తమ వంతు పాత్ర పోషించిన వారందరి పేర్లు బీబీసి 100 మంది మహిళామణల జాబితాలో చేర్చటం కుదరని పని. అయితే 2020 సంవత్సరంలో మీ మీద ప్రభావం చూపించిన మహిళల పేర్లు ఇక్కడ చేర్చటానికి దీనిని రూపొందించటం జరిగింది.

  • లోజా అబెరా గినోర్

    ఇథియోపియా ఫుట్ బాల్ క్రీడాకారిణి 

    లోజా అబెరా గినోర్ దక్షిణ ఇథియోపియా లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆమె ఇథియోపియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హవాస్సా సిటీ ఎస్సీ తరఫున రెండు సీజన్లలో ఆడారు. ఆ సమయంలో వాళ్ళ క్లబ్ తరపున ఆమె అత్యధిక గోల్స్ చేశారు.

    ఆమె ఇప్పుడు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి. అలాగే ఇథియోపియన్ జాతీయ మహిళా జట్టులో సభ్యురాలు.

    > ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.

  • హౌడా అబౌజ్

    మొరాకోరాపర్khtek.17

    హౌడా అబౌజ్ అలియాస్ ఖ్టెక్. ఈమె మొరాకో దేశానికి చెందిన ఒక రాప్ సింగర్. తనదైన ప్రత్యేకమైన శైలిలో భావగీతాలకు ఈమె ప్రసిద్ది .

    ఈవిడ మహిళల హక్కులు,లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. పురుషాధిక్యతతో నిండిన మొరాకో సంగీత పరిశ్రమలో మార్పు తీసుకురావటానికి హౌడా తన సంగీతాన్ని ఒక సాధనంగా భావిస్తున్నారు.

    > పోరాడుతూనే ఉండండి, ఎదిరిస్తూనే ఉండండి, కళని సృష్టిస్తూనే ఉండండి. ఎప్పుడూ వెనక్కి తగ్గకండి. మన పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. ప్రపంచానికి కావలసింది మనమే: మహిళా శక్తి.

  • క్రిస్టినా అడానే

    నెదర్లాండ్స్ ప్రచారకర్తchristina.adane

    బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని వేసిన పిటిషన్ వెనక ఉన్నది క్రిస్టినానే. దీనికి ఫుట్ బాల్ ఆటగాడు మార్కస్ రాష్ఫోర్డ్ మద్దతు తన మద్దతు ప్రకటించారు.

    క్రిస్టినా ఆహార పరిశ్రమలో ఉన్న అన్యాయాలపై పోరాడుతున్న బైట్ బ్యాక్ 2030 అనే ఉద్యమం యువ విభాగపు సహ ఉపాధ్యక్షులు. బ్రిటన్లో ఏ ఒక్క చిన్నారి ఆకలితో ఉండకూడదు అనేది క్రిస్టినా అభిలాష.

    > మీ విషయంలో కానీ మీ నమ్మకాల విషయంలో కానీ ఎప్పుడూ రాజీ పడకండి. గుంపులో గోవింద లాగా ఉండటం ద్వారా ఏ స్త్రీ కూడా ఇంత వరకు మార్పు తీసుకురాలేదు.

  • ఎవోన్ అకీ-సాయర్

    సియరా లియోన్ ‌మేయర్

    మేయర్ యెవన్ అకీ-సాయర్ తన మూడేళ్ల ట్రాన్స్ఫార్మ్ ఫ్రీటౌన్ ప్రణాళిక ద్వారా ఎక్కువగా గుర్తింపు పొందారు. ఈ పథకం 11 రంగాలను లక్ష్యంగా చేసుకున్నారు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఉపాధి అవకాశాలను సృష్టించడం వీటిలో కీలకం. ప్రపంచవ్యాప్తంగా వరదలు, అడవుల్లో చెలరేగే కార్చిచ్చు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ అకీ-సాయర్ రెండు సంవత్సరాలలో పది లక్షల చెట్లను నాటే ఉద్యమంలో పాల్గొనడానికి ఫ్రీ టౌన్ వాసుల్లో ప్రేరణ కలిగించారు.

    #FreetownTheTreeTown ప్రచారం జనవరి 2020లో ఎటువంటి వనరులు లేకుండా ప్రారంభమైంది. అయితే అక్టోబర్ నాటికి ఈ ప్రచారంలో భాగంగా 4 లక్షల 50 వేల మొక్కలు నాటడం జరిగింది. మిగిలిన మొక్కలను వచ్చే వర్షాకాలంలో నాటనున్నారు. వరదలు, భూమి కోత, నీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో చెట్ల పాత్ర చాలా ముఖ్యమైనది

    > మనకు అసంతృప్తి,నిరాశ కలగవచ్చు. అయితే వాటిని ప్రతికూలతులగా భావించాల్సిన అవసరం లేదు. మనం చూడాలి అని అనుకుంటున్న మార్పుని తీసుకురావడం ద్వారా మన అసంతృప్తిని సానుకూలంగా మార్చుకోవచ్చు.

  • రీనా అక్తెర్

    బంగ్లాదేశ్మాజీ సెక్స్ వర్కర్

    కోవిడ్ -19 సమయంలో, ఢాకా లో కస్టమర్లు లేక తమని తాము పోషించుకోలేని సెక్స్ వర్కర్లకు రీనా మరియు ఆమె బృందం బియ్యం, కూరగాయలు, గుడ్లు మరియు మాంసం తో ప్రతి వారం నాలుగు వందల మందికి ఆహార సౌకర్యం కల్పించారు .

    > ప్రజలు మా వృత్తిని నీచంగా చూస్తారు, కాని మేము మమ్మల్ని మేము పోషించుకోవడానికి ఈ పని చేస్తాము. ఈ వృత్తిలో మహిళలు ఆకలితో అలమటించకుండా ఉండడానికి, వారి పిల్లలు ఈ పని చెయ్యవలసిన అవసరం లేకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను.

  • సారా అల్-అమిరి

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యాధునిక సాంకేతిక శాఖా మంత్రి

    సారా అల్ అమిరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యాధునిక సాంకేతిక శాఖా మంత్రి. దానితో పాటు ఎమిరేట్స్ అంతరిక్ష సంస్థ అధిపతి కూడా. దీనికి ముందు, ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ మిషన్ సైంటిఫిక్ హెడ్ మరియు డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నారు .

    ఎమిరేట్స్ మార్స్ మిషన్ అరబ్ దేశాలలో మొట్టమొదటి అంతర్గ్రహ మిషన్. 'హోప్' (అరబిక్ భాషలో అమల్) అని పేరుతో పిలిచే ఈ ఆర్బిటర్ అంగారక గ్రహం మీద ఫిబ్రవరి 2021 నాటికి దిగి అక్కడ వివరాలు సేకరిస్తుంది.

    > కరోనా వైరస్ అకస్మాత్తుగా ప్రపంచం మొత్తాన్ని స్తంభింపచేసింది .ఈ పరిస్థితులలో మనం ఏంటో మనం తెలుసుకుంటూ వ్యక్తులుగా ఎదగాలి. ఈ బలహీనమైన ప్రపంచం సుస్థిరతని కాపాడాలంటే మనమందరం కలిసి సమష్టిగా ప్రయత్నాలు చేస్తూ ఎదగాలి.

  • వాద్ అల్ -కతీబ్

    సిరియా దర్శకులు

    వాద్ అల్-కటేబ్ సిరియా దేశానికి చెందిన సామాజిక కార్యకర్త, పాత్రికేయులు, వివిధ పురస్కారాలు అందుకున్న దర్శకులు. అలెప్పో నుండి ఆమె అందించిన వార్తా నివేదికల ద్వారా అనేక పురస్కారాలు (ఎమ్మీతో సహా) అందుకున్నారు. 2020 లో ఆమె మొదటి చలన చిత్రం 'ఫర్ సామ' కి ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో బాఫ్టా అవార్డును గెలుచుకుంది.అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో అకాడమీ అవార్డులకి నామినేట్ అయ్యింది.

    2016 లో అలెప్పో నుండి విస్థాపనకి గురయ్యిన వాద్ ఇప్పుడు తన భర్త, ఇద్దరు కుమార్తెలతో లండన్లో నివసిస్తున్నారు. అక్కడ ఈవిడ ఛానల్ 4 న్యూస్‌లో పనిచేస్తున్నారు. అలాగే యాక్షన్ ఫర్ సామ అనే ప్రచార ఉద్యమం నడుపుతున్నారు.

    >మనం ఎప్పుడైతే ఆశని కోల్పోతామో అప్పుడు మాత్రమే ఓడిపోతాం. మహిళలకి- ఎక్కడి వారైనా సరే- నేను చెప్పేది ఒకటే: మీరు నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి, కలలు కనే సాహసం కలిగి ఉండండి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఆశావాహ దృక్పధాన్ని కోల్పోవద్దు.

  • అడ్రియానా అల్బిని

    ఇటలీపాథాలజిస్ట్

    అడ్రియానా అల్బిని ఐఆర్సిసిఎస్ మల్టీమెడికా మరియు మల్టీమెడికా ఫౌండేషన్ వారి యాంజియోజెనిసిస్ ప్రయోగశాలలో వాస్కులర్ బయాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.ఆమె ఇటలీలోని మిలన్-బయోకోచా విశ్వవిద్యాలయంలో జనరల్ పాథాలజీ ప్రొఫెసర్ కూడా. అలాగే యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో మాజీ విజిటింగ్ సైంటిస్ట్ .

    అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ బోర్డుకి ఎన్నికైన మొట్టమొదటి ఇటాలియన్ అడ్రియానా. మహిళల ఆరోగ్యం మీద నేషనల్ అబ్సర్వేటరీ ఫౌండేషన్లో ఉన్న అత్యున్నత మహిళా శాస్త్రవేత్తల క్లబ్ కి అధ్యక్షులుగా కూడా పని చేస్తున్న ఆమె మహిళా శాస్త్రవేత్తలని ప్రోత్సహించే పనిలో నిమగ్నులై ఉన్నారు. అలాగే అడ్రియానా ఫెన్సింగ్ క్రీడాకారిణి కూడా. 2018లో జరిగిన వెటరన్స్ ప్రపంచ పోటీలలో ఫెన్సింగ్ క్రీడలో కాంస్య పతకాన్ని గెలుపొందారు. అలాగే 2015లో జరిగిన ఐరోపా వెటరన్స్ ఫెన్సింగ్ పోటీలలో వెండి పతకాన్ని గెలుచుకున్నారు.

    > పరిశోధకులు ఒక మార్గాన్ని అనుసరించి తమ వృత్తిని ప్రారంభిస్తారు; ఇక చేసేది ఇంకేమి లేదు అని అందరూ అనుకున్నప్పుడు శాస్త్రవేత్తలు కొత్త మార్గాలని ఆవిష్కరిస్తారు. ఒకే సమయంలో వివిధ రకాల పనులని చెయ్యగలిగే నైపుణ్యం మహిళా శాస్త్రవేత్తల సొత్తు. ఈ నైపుణ్యాన్ని వాడుకుని ఎవరూ చూడని కొత్త మార్గాలని మహిళా శాస్త్రవేత్తలు కనుగొనాలి.

  • ఉబా అలీ

    సోమాలిలాండ్ఎఫ్ జి ఎమ్ ఎడ్యుకేటర్

    ఉబా అలీ సొలేస్ ఫర్ సొమాలీలాండ్ అనే సంస్థ సహవ్యవస్థాపకురాలు. ఈ ఫౌండేషన్ సొమాలీలాండ్ లో వివిధ సమాజాల్లో ఉన్న మహిళలలో సున్తీ దురాచారాన్ని (FGM-ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్) విద్య, స్వయం నిర్ణయాధికార శక్తి చేకూర్చడం ద్వారా నిర్మూలించడానికి పనిచేస్తున్నారు.

    ఉబా ఆలీ బీరూట్లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. లెబనాన్ లో వలస కార్మికుల హక్కుల కోసం కూడా పని చేస్తున్నారు.

    > 2020 సంవత్సరంలో ప్రపంచం చాలా మారిపోయింది. ఈ రోజు మొత్తం ప్రపంచంలోని మహిళలు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. చాలా మంది మహిళలు గృహ హింస, అత్యాచారం, ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ లాంటి నేరాలకు బాధితులు అవుతున్నారు . స్త్రీలను ఏకం చేయడం ద్వారా తమకు జరగాల్సిన న్యాయం కోసం డిమాండ్ చేయవచ్చు !

  • నిస్రీన్ అల్వాన్

    ఇరాక్ / బ్రిటన్ప్రజారోగ్య నిపుణురాలు

    నిస్రీన్ బ్రిటన్లో ఒక ప్రజారోగ్య వైద్యురాలు, విద్యావేత్త, మహిళలు, పిల్లల ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

    కోవిడ్ -19 సమయంలో, దేశాలలోని మరణాలకు సంబంధించిన అవగాహన మాత్రమే కాకుండా, వైరస్ కారణంగా సంక్రమించే దీర్ఘకాలిక అనారోగ్యం గురించి కూడా అవగాహన పెంపొందించారు. దీర్ఘకాలిక కోవిడ్ ఉన్న బాధితులకి అలసట, తలనొప్పి, ఊపిరి ఆడకపోవటం లాంటి లక్షణాలు ఉంటాయి.

    > ఈ సంవత్సరంలో నేను మూడు పనులు ఎక్కువ చేశాను: మనసులో ఉన్నది మాట్లాడడం, దేనికైతే భయపడతానో అదే చేయడం, నన్ను నేను క్షమించుకోవడం, అలాగే ఇంకో మూడు పనులు చేయడం తగ్గించాను: జనాలు నా గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడం, నన్ను నేను నిందించుకోవడం, ఆత్మన్యూనతతో బాధపడటం.

  • ఎలిజబెత్ అని ఓనవ్

    బ్రిటన్నర్స్

    ప్రొఫెసర్ డేమ్ ఎలిజబెత్ అని ఓనవ్ వెస్ట్ లండన్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ విభాగంలో గౌరవ ప్రొఫెసర్. అలాగే బ్రిటన్ సికెల్ సెల్ సొసైటీ పోషకురాలు కూడా.

    ఈవిడ సికిల్ సెల్, తలస్సేమియా విభాగంలో పేరుపొందిన నర్సు. మేరీ సీకోల్ అనే బ్రిటిష్-జమైకా నర్స్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ప్రచారం చేశారు. కోవిడ్- 19 ప్రభావం బ్రిటన్ లోని నల్ల జాతి, ఆసియా సంతతి, మైనారిటీ జాతుల ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

    మీతో సహా చాలా మంది మహిళలు ప్రపంచంలో పోషిస్తున్న ప్రగతిశీల పాత్రని తక్కువ అంచనా వెయ్యకండి.

  • నదీన్ అష్రఫ్

    ఈజిప్టుప్రచారకర్తactuallynadeen

    నదీన్ ఒక తత్వశాస్త్ర విద్యార్థిని. మార్పు కోసం సోషల్ మీడియా వాడకాన్ని ఒక సాధనంగా భావిస్తారు . సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం పట్ల మక్కువ ఎక్కువ.

    నదీన్ అస్సాల్ట్ పోలీస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్థాపకురాలు. ఈ అకౌంట్ లో ఈజిప్ట్ లో లైంగిక హింసకి గురయ్యిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలని పంచుకోవచ్చు. నదీన్ ఇప్పుడు లైంగిక హింసకి వ్యతిరేకంగా సామాజిక మార్పు కోసం జరుగుతున్న స్త్రీవాద ఉద్యమంలో ప్రముఖమైన వారు.

    > నేను మార్పు కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహిళల మధ్య పెరిగాను; నేను వారి గొంతులను ప్రపంచానికి వినిపించే స్థితిలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మీరు నమ్మే పని చెయ్యడానికి ఏ రోజైనా సరైన రోజే.

  • ఎరికా బేకర్

    జెర్మనీ ఇంజినీర్

    గిట్ హబ్ లో ఎరికా డైరక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్. టెక్నాలజీ రంగంలో పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె ప్రయాణం మొదలయ్యింది. మొదట అలాస్క విశ్వవిద్యాలయానికి టెక్నాలజీ సహాయకారిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తరువాత గూగుల్ కి మారారు.

    2015లో స్లాక్ సంస్థలో చేరారు తరువాత 2017లో పాట్రియోన్ సంస్థలో చేరారు. అటు పిమ్మట మైక్రోసాఫ్ట్, దాని తరువాత గిట్ హబ్. అటిపికా, హ్యాక్ ది హుడ్, కోడ్.ఆర్గ్, డైవర్సిటీ కౌన్సిల్, ది బార్బీ గ్లోబల్ అడ్వైసరీ బోర్డ్, గర్ల్ డెవలప్ ఇట్ సంస్థల సలహాదారుల బోర్డ్ లో ఉన్నారు. బ్లాక్ గర్ల్స్ కోడ్ కి టెక్నాలజీ మెంటర్ గా ఉన్నారు. ఈవిడ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఓక్లాండ్ లో ఉంటున్నారు.

    > ఈ సంవత్సరం ప్రపంచం చాలా మారింది. స్వార్ధం లేకుండా ఉండటం అంటే ఏంటో, సేవ ప్రాముఖ్యత, బంధాల విలువ తెలుసుకుంటున్నాము. ప్రపంచంలో అందరికీ సమానమైన చోటు లేకుండా పోయింది అనే వాస్తవాన్ని తెలుసుకున్నాము. న్యాయం, స్వేఛ్చ కోసం, సమానత్వం కోసం మహిళలు తమ శక్తియుక్తులన్నీ పెట్టాలని నేను సలహా ఇస్తున్నాను.

  • డయానా బరాన్

    బ్రిటన్ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల అండర్ సెక్రటరీ

    బరాన్ బ్రిటన్ పౌర సమాజం మంత్రిగా 2019లో బాధ్యతలు స్వీకరించారు. పౌర సమాజం కార్యాలయం రూపొందించే విధానాలకి బరాన్ బాధ్యురాలు. గృహ హింసని అరికట్టడానికి ఏర్పడిన సేఫ్ లైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, అలాగే ఆ సంస్థ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి. అలాగే ఇంతకమునుపు న్యూ ఫిలాంత్రఫీ అనే సంస్థలో విరాళాల అభివృద్ధి విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఐరోపాలో 1993లో మొట్టమొదటి హెడ్జ్ ఫండ్ స్థాపించారు. దానికి ముందు ఆస్తుల/పెట్టుబడుల నిర్వహణ రంగంలో పని చేశారు.

    బార్రాన్ ఇంతకుమునుపురాయల్ ఫౌండేషన్ అండ్ కామిక్ రిలీఫ్ అనే సంస్థ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. అలాగే హెన్రీ స్మిత్ ఛారిటీ సంస్థ చైర్ఉమన్ గా కూడా పని చేశారు. అలాగే ఈవిడ 2007లో బీకన్ ఆఫ్ ఇంగ్లాండ్ పురస్కార గ్రహీత. గృహహింస మీద చేసిన కృషికి గాను 2011లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఎంపిక చేశారు.

    > “మీరు చెప్పినదాన్ని ప్రజలు మరచిపోతారు, మీరు చేసినదాన్ని ప్రజలు మరచిపోతారు, కాని మీరు వాళ్ళని ఏ విధమైన అనుభూతికి గురిచేశారో అనే విషయాన్ని మాత్రం ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు"

  • బిల్కిస్

    భారతదేశం ఉద్యమ నేత

    భారతదేశంలో తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళల బృందంలో 82 ఏళ్ళ బిల్కిస్ ఒకరు.

    దేశ రాజధానిలోని ముస్లింలు ఎక్కువగా ఉండే షాహీన్ బాగ్ ప్రాంతంలో-పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి ప్రతినిధి బిల్కిస్. భారతీయ పాత్రికేయులు, రచయిత రాణా అయ్యుబ్ బిల్కిస్ ను" అణగారిన ప్రజల గొంతుక"గా అభివర్ణించారు.

    > మహిళలు తమ ఇళ్ల నుండి బయటికి వెళ్ళడానికి, అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించడానికి స్వయం నిర్ణయాధికార శక్తిని కలిగుండాలి. వారు తమ తమ ఇళ్ల నుండి బయటకి రాకపోతే తమ బలాన్ని ఎలా చూపించగలరు?

  • సిండీ బిషప్

    థాయిలాండ్ ఐక్యరాజసమితి మహిళా రాయబారి/మోడల్ cindysirinya

    సిండీ సిరిన్య బిషప్ మోడల్, నటి, టి వి హోస్ట్. మహిళలపై హింసకి అంతం పలకాలని చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వామి. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఐక్యరాజసమితి ఉమెన్ రాయబారిగా ఈ ఏడాది ఆమెను నియమించారు. విద్య ద్వారా, ప్రభుత్వ సహాయంతో లింగ సమానతని పెంపొందించటాన్ని ప్రోత్సహించడం ఈ రాయబారిగా ఆమె పని. థాయ్ నూతన సంవత్సర వేడుకలలో లైంగిక దాడులకి గురి కాకుండా అంటే "సెక్సీ"గా కనిపించే దుస్తులు వేసుకోవద్దు అని థాయిలాండ్ అధికారులు మహిళలకి చెప్పిన తర్వాత సిండీ #డోంట్ టెల్ మి హౌ టు డ్రస్ అనే ఉద్యమాన్ని 2018లో మొదలుపెట్టారు.

    డ్రాగన్ ఫ్లై 360అనే సంస్థకి ఈమె నాలెడ్జ్ డైరక్టర్ కూడా. ఆసియాలో లింగ సమానత్వం కోసం పనిచేస్తున్న ప్రాంతీయ సంస్థ ఇది. అలాగే భద్రత, హక్కులు, గౌరవనీయమైన బంధాల గురించి బాలల పుస్తకాలు కూడా రాస్తున్నారు.

    > ఈ సంవత్సరం ప్రపంచం చాలా మారింది. మార్పుతో ప్రగతికి అవకాశాలు వస్తాయి. అందరూ సమాన ఆత్మగౌరవంతో, స్వేఛ్చతో బతికగాలగాలి. రాబోయే తరం యువతకి మనం ఆదర్శంగా ఉండాలి.

  • మాకిన్లీ బట్సన్

    ఆస్ట్రేలియా శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త

    మెకిన్లీ బట్సన్ తన 7 ఏట నుండి నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమెకి 20 సంవత్సరాలు. రొమ్ము క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్స ద్వారా ఫలితాలను మెరుగుపరిచే పరికరాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సురక్షితమైన తాగునీటిని అందించే సాధనాలతో సహా అనేక ఉత్పత్తులను ఆమె ఆవిష్కరించారు.

    ఆమె యువ ఆస్ట్రేలియన్లకు స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్‌గా మారింది. వారు వైజ్ఞానిక, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత శాస్త్రాల ద్వారా సమాజానికి ఎలా తిరిగి ఇవ్వగలరో తెలియచేస్తున్నది.

    > మార్పును తీసుకురాగలిగే మన సామర్థ్యానికి ఏదీ అడ్డంకి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి స్త్రీని తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలని నేను అడుగుతున్నాను “నేను కాకపోతే మరెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ”

  • ఎవెలినా కాబ్రేరా

    అర్జెంటీనాఫుట్‌బాల్ కోచ్, మేనేజర్evelinacabrera23

    ఎవెలినా దుర్భర పరిస్థితులలో పుట్టారు. అయితే ఆ పరిస్థితులు ఫుట్ బాల్ కోచ్ గా, మేనేజర్ గా ఎదగడానికి ఏ విధంగా అడ్డంకి కాలేకపోయాయి. ఆమె 27 సంవత్సరాల వయసులో అర్జెంటీనా మహిళా ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను స్థాపించారు.

    ఆమె అనేక జట్లను ఏర్పాటు చేశారు. (వాటిలో ఒకటి అంధ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ జట్టు), ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. అలాగే క్రీడలు, విద్య ద్వారా దుర్భర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు, బాలికలకు సహాయం చేశారు. అర్జెంటీనాలో తొలితరం మహిళా ఫుట్‌బాల్ మేనేజర్లలో ఒకరైన ఆమె తన ఆత్మకథను ప్రచురించారు. అందులో సమానత్వం కోసం తను చేసిన పోరాటాన్ని వివరించారు.

    > మన లింగం,మన పుట్టుక మన భవిష్యత్తును నిర్ణయించకూడదు. ఇది కష్టాలతో కూడుకున్నమార్గమే. అయితే సామూహిక పోరాటం ద్వారా మనం సమానత్వాన్ని సాధించగలుగుతాం.

  • వెండీ బీట్రిజ్ కైష్పాల్ జాకో

    ఎల్ సల్వడార్వికలాంగుల హక్కుల కార్యకర్తwendy_caishpal

    వెండీ కైష్పాల్ వాణిజ్య వేత్త , సామాజిక కార్యకర్త, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులు. అంతేకాకుండా వికలాంగుల, సాయుధ పోరాటంలో ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు.

    కైష్పాల్ ఉమెన్స్ ఇన్స్టిట్యూట్ ఆన్ లీడర్షిప్ అండ్ డిసెబిలిటీ అండ్ ఇంటర్నేషనల్ మొబిలిటీ యుఎస్ఏలో ఎల్ సాల్వడార్ దేశ ప్రతినిధి. అలాగే వికాలంగుల హక్కుల పరిరక్షణ, ప్రచారం కోసం పని చేసే అహుఆచపాన్ సిన్ బర్రేరాస్ (అహుఆచపాన్ వితౌట్ బారియెర్స్) అనే ఒక సంస్థను కూడా స్థాపించారు.

    > మనం చేసే పనులను, మనం చేసే విధానాన్ని మనం ప్రేమించాలి. సమాజాన్ని మార్చగల సాధనంగా మనం ఉందాం: మనం పని చేద్దాము, పోరాడుదాం, మార్పుని తీసుకువద్దాం. అందరు మార్పు కోసం పోరాడితే మన ప్రపంచాన్ని ఎంతో కొంత మెరుగుపరచొచ్చు.

  • కరోలినా కాస్ట్రో

    అర్జెంటీనాయూనియన్ నాయకురాలు

    కరోలినా కెస్ట్రో అర్జెంటీనా ఇండస్ట్రీ ఫెడరేషన్ (యుఐఎ) 130 సంవత్సరాల చరిత్రలో పాలక మండలిలో చోటు సంపాదించిన మొదటి మహిళ. ప్రజాబాహుళ్య చర్చ రెండు ధృవాల వైపు చీలిపోయిన అర్జెంటీనా సమాజంలో పార్టీలకతీతంగా లింగ సమానత్వాన్ని పెంపొందించటంలో కరోలీనా పాత్ర చాలా ముఖ్యమైనది.

    క్యాస్ట్రో కార్ల విడిభాగాలు ఉత్పత్తిచేసే ఒక కుటుంబానికి చెందిన మూడవ తరం కుటుంబ పెద్ద. సగటు మార్కెట్ రేటు కంటే ఎక్కువ జీతానికి మహిళలను తన పరిశ్రమలో నియమించడం ద్వారా అప్పటి వరకు ఉన్న సాంప్రదాయాన్ని తుడిచివేశారు. వ్యాపారం, కళలు, రాజకీయాలు మరియు విజ్ఞాన శాస్త్రంలో రాణించిన 18 మంది అర్జెంటీనా మహిళల సంభాషణలతో ఇటీవలే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం పేరు 'వి బ్రొక్ ది గ్లాస్'.

    > సమానత్వం అనేది ఏదో అసాధారణమైన మనుషులు ప్రయత్నిస్తే సాధించేది కాదు. స్త్రీ-పురుష సంబంధం లేకుండా మనలోని ప్రతి ఒక్కరు ప్రతి రోజు మనం తీసుకునే ప్రతి చిన్న, చిన్న నిర్ణయాల ద్వారా సాధించేది.

  • ఆగ్నెస్ చౌ

    హాంగ్ కాంగ్ ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్త chowtingagnes

    23 ఏళ్ల ఆగ్నెస్ చౌ హాంగ్ కాంగ్ లో ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త. 2014లో అక్కడ జరిగిన అంబ్రెల్లా ఉద్యమంలో ముఖ్య భూమిక నిర్వహించారు. ఈ సంవత్సరం చైనా హాంగ్ కాంగ్ లో కొత్తగా అమలులోకి తెచ్చిన వివాదాస్పద భద్రత చట్టం క్రింద అరెస్ట్ చేసిన కొద్దిమంది కార్యకర్తలలో ఆమె కూడా ఒకరు. "విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారు" అన్నది ఆమెపై ఆరోపణ.

    తనకి జామీనైతే లభించింది. అయితే తన అరెస్ట తర్వాత తనకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పదిహేనేళ్ళ వయసు నుంచే రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండేవారు. తన కుటుంబాన్ని, దేశాన్ని కాపాడాటానికి యుద్ధం చేసిన చైనీస్ యోధురాలు పేరు మీద ఆగ్నెస్ మద్దతుదారులు ఆమెను 'ములాన్' అని పిలుస్తుంటారు.

    > ఒక మహిళా నాయకురాలు ఉన్నంత మాత్రాన మహిళల హక్కులకి ఊతం లభిస్తుంది అనేమి లేదు. మనకు వ్యవస్థలో మార్పు, అలాగే నిజమైన ప్రజాస్వామ్యం కావాలి .

  • పాట్రిస్సే కల్లర్స్

    యుఎస్మానవ హక్కుల కార్యకర్త

    లాస్ ఏంజెలెస్ కి చెందిన పాట్రిస్ కల్లర్స్ కళాకారిణి, సామాజిక కార్యకర్త, ప్రసిద్ధ ఉపన్యాసకురాలు. ఈవిడ బ్లాక్ లైవ్స్ మేటర్ గ్లోబల్ నెట్వర్క్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. అలాగే లాస్ ఏంజెలెస్ కి చెందిన క్షేత్రస్థాయి సంస్థ డిగ్నిటీ అండ్ పవర్ నౌ స్థాపకురాలు.

    ప్యాట్రిసియా ప్రస్తుతం అరిజోనాలోని ప్రెస్కోట్ కళాశాలలో ఫ్యాకల్టీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ కళాశాలలో తాను స్వయంగా రూపొందించిన నూతాన సామాజిక, పర్యావరణ ఆధారిత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రాంకు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

    > మీ బలాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. మీకు మీ ఆనందాన్ని సృష్టించుకోండి. మార్పుకోసం నిలబడండి మీ కోసం మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చే మహిళల కోసం కూడా .

  • సిట్సి డేంగ్ రేంబ్గా

    జింబాబ్వేరచయిత, చిత్ర దర్శకులు

    సిట్సీ విమర్శకుల ప్రశంసలు పొందిన రచయిత, దర్శకులు,సాంస్కృతిక కార్యకర్త. ఆమె జింబాబ్వే క్లాసిక్‌గా పరిగణించబడే పురస్కారాలు గెలుచుకున్న పుస్తకాలను రాశారు. ఆమె సినిమాలు సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఆమె హరారేలో నివసిస్తున్నారు. స్థానిక మహిళా ఆఫ్రికన్ చలన చిత్ర దర్శకులతో పనిచేస్తున్నారు.

    ఈ ఏడాది జింబాబ్వేలో జరిగిన పౌర నిరసనల్లో పాల్గొన్నందుకు అదుపులోకి తీసుకున్న వారిలో సిట్సీ కూడా ఉన్నారు, నిరసనకారులు ప్రభుత్వంపై అవినీతి, గాడి తప్పిన పాలనకి సంబంధించిన ఆరోపణలు చేశారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రవేశపెట్టిన నిబంధనలను ఉల్లఘించారు, అలాగే హింసకి ప్రేరేపించారు అనే అభియోగాల మీద అరెస్ట్ అయిన ఆమె జామీనుపై విడుదలయ్యారు.తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సిట్సీ ఖండించారు. ఆమెపై పెట్టిన కేసులని ఉపసంహరించుకోవాలని ఆమె తోటి రచయితలు డిమాండ్ చేస్తున్నారు.

    > మార్పుకు భయపడవద్దు. మీకు ఉపయోగపడే విధంగా మార్చుకోండి .

  • షని ధండా

    బ్రిటన్ వికలాంగుల హక్కుల కార్యకర్త

    షని ధండా వివిధ పురస్కారాలు గెలుచుకున్న వికలాంగుల హక్కుల కార్యకర్త, అలాగే సోషల్ ఎంటర్ప్రెన్యూయెర్. బ్రిటన్ లో బాగా ప్రభావవంతమైన వికలాంగులలో ఈవిడ ఒకరు. డైవర్సబిలిటీ కార్డ్ ఇనిషీయేటివ్, ఏషియన్ ఉమన్ ఫెస్టివల్, ఏషియన్ డిజెబిలిటీ నెట్వర్క్ స్థాపకురాలు. నేటికీ వాటికి నాయకత్వం వహిస్తున్నారు.

    ఈ మూడు సంస్థలు కూడా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న సమూహాలని స్వీయ నిర్ణయాధికార శక్తులుగా తయారుచెయ్యటం అనే ఒక ఉమ్మడి ఆశయంతో పనిచేస్తున్నాయి

    > ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. అందరికీ సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు ని నిర్మించడం మనందరి బాధ్యత.

  • నవోమి డిక్సన్

    బ్రిటన్ముఖ్య కార్యనిర్వహణాధికారి

    గృహ హింసకు గురైన యూదు మహిళలు మరియు పిల్లలకు అండగా నిలబడడానికి నవోమి తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగే గృహ హింసని నేడు కానీ భవిష్యత్తులో కానీ బయటపెట్టడానికి, నివారించడానికి అవసరమైన సాధనాలు సమకూర్చుకునే విధంగా యూదు సమాజానికి శిక్షణ ఇస్తున్నారు.

    జ్యూయిష్ విమెన్స్ ఎయిడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న నవోమి అన్ని మతాలకి చెందిన మహిళలతో పనిచేస్తారు. మత పెద్దలకి, ఆ సమాజం పెద్దలకి శిక్షణ ఇస్తుంటారు. ఆవిడ ఆశయం మహిళల మీద, ఆడ పిల్లల మీద హింసని ఇక ఏ మాత్రం ఉపెక్షించని సమాజం.

    > 2020 లో ప్రపంచం చాలా మారిపోయింది. ఇతరులకి సహాయం చేసే విధంగా మన అంతః శక్తిని మనం నిర్మించుకోవడం నేర్చుకున్నాము 

  • కరెన్ డోల్వా

    నార్వేఇన్నోవేటర్

    కరెన్ డోల్వా అక్టోబర్ 2015 లో ఓస్లోలో స్థాపించబడ్డ 'నో ఐసోలేషన్' సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి, సహ వ్యవస్థాపకురాలు. వార్మ్ టెక్నాలజీ ద్వారా ప్రజలని ఒక చోటకి చేర్చటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.

    ఈ రోజు వరకు, సంస్థ రెండు ఉత్పత్తులను తయారుచేసింది. మొదటిది AV1, టెలీప్రేసేన్స్ అవతార్ ఇది. ఇది ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కౌమారదశకు చెందిన వాళ్ళకోసం రూపొందించబడింది. ఇంకోటి KOMP. ప్రత్యేకంగా వృద్ధులు వాడటం కోసం అభివృద్ధి చేయబడిన సింగిల్ బటన్ సమాచార సాధనం ఇది.

    > కోవిడ్ -19 సాకుతో మనం పోరాటాన్ని ఆపలేము. అందరికన్నా దుర్భరులు అయినా వారికే ఇటువంటి సమయాలలో కస్టాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం దీని ద్వారా మనకి అవగతం అవ్వాలి. మార్పు కోసం, రిస్క్ లో ఉన్నవారిని రక్షించటం కోసం మనం ఈ సమయాన్ని వాడాలి.

  • ఇల్వాడ్ ఎల్మాన్

    సోమాలియాపీస్ యాక్టివిస్ట్

    ఇల్వాడ్ ఎల్మాన్ సోమాలియాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రక్రియలో ముందువరసలో ఉన్న యువ మహిళా నాయకురాలు. అలాగే సంఘర్షణని ఆపటంలో, సంఘర్షణ తరువాత సత్సంబంధాల పునరుద్ధరణ కోసం పని చెయ్యటంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు.

    కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఆమె సోమాలియాలో మొదటి రేపిస్ట్ క్రైసిస్ కేంద్రాన్ని స్థాపించారు. గత దశాబ్దంలో యుద్ఘం కారణంగా ప్రభావితమైన వారందరికీ - ముఖ్యంగా మహిళలు, బాలికలు - సహకారం అందించడం ద్వారా శాంతిని నిర్మించడంలో కీలక భూమిక పోషించారు.

    > ఈ మహమ్మారి ప్రపంచానికి ఒక చిన్న పాఠాన్నినేర్పింది. మిగతావారు వైఫల్యం చెందిన చోట మహిళలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ముందువరసలో ఉండటాన్ని మనం చూశాము. నాయకత్వం స్థానాల్లో మహిళలు అనేది ఇక ఏ మాత్రం ద్వితీయ ప్రాధాన్యత కాదు. అది ఇప్పుడు ఒక ప్రాథమిక అవసరం.

  • జియాంగ్ యున్-క్యోంగ్

    దక్షిణ కొరియాకెడిసిఎ కమీషనర్

    డాక్టర్ జియాంగ్ యున్-క్యోంగ్‌ వైరస్ వేటగత్తె గా పేరుపొందారు. కోవిడ్ -19 వైరస్ ని ఎదుర్కునే విషయంలో దక్షిణ కొరియాని ముందుండి నడిపించారు.

    కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కెడిసిఎ) ప్రస్తుత కమిషనర్‌గా - ఇంతకుముందు దాని మొదటి మహిళా చీఫ్‌గా పనిచేసిన ఆమె- రోజువారీ కోవిడ్ ప్రెస్ బ్రీఫింగ్ విషయంలో తన పారదర్శక పనితీరుతో అందరినీ ఆకర్షించారు.

    > కరోనాని ఎదుర్కోవటంలో తమని తాము అంకితం చేసుకున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి అవసరమైన సామర్ధ్యాలని పటిష్టం చేయడం ద్వారా ఈ ప్రపంచం మరింత సురక్షితంగా ఉండేదానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను.

  • ఫాంగ్ ఫాంగ్

    చైనారచయిత

    ఫాంగ్ ఫాంగ్ అసలు పేరు వాంగ్ ఫాంగ్. తన చైనీస్ రచనలకు కాను పురస్కారాలు పొందారు. ఫాంగ్ 100 కు పైగా పుస్తకాలు రాశారు. కోరోనావైరస్ మొదట వ్యాప్తి చెందటం మొదలయ్యిన వుహాన్ లో జరుగుతున్నా సంఘటనలని ఆవిడ డాక్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఆవిడ డైరీ కోట్ల మంది చైనీయులకి వుహాన్ పట్టణంలో ఏమి జరుగుతున్నది అనే విషయాన్ని గురించి అవగాహన కలిపించింది. వుహాన్ పట్టణం గురించి, అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి చైనీయులకి తెలిసింది చాలా తక్కువ. ఈవిడ డైరీ ఆ లోటుని తీర్చింది. ఈ రోజువారి జీవితంలో సవాళ్ళు దగ్గర నుండి బలవంతపు ఐసోలేషన్ కారణంగా శరీరంపై పడే ప్రభావం వరకు అనేక విషయాలను సృజించారు తన డైరీలో

    డైరీని ఆంగ్లంలోకి అనువదించబడి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంతో వుహాన్ లో జరుగుతున్న సంఘటనలని డాక్యుమెంట్ చేసినందుకు ఈవిడ మీద ఆన్లైన్ దాడి మొదలయ్యింది. ఈవిడ డైరీ చాలా మంది చైనీయులకి కోపం తెప్పించింది. దేశద్రోహి అన్న ముద్ర కూడా వేశారు

    > మీ సొంత అస్థిత్వం కలిగి ఉండండి.

  • సోమయ ఫరూకి

    ఆఫ్ఘనిస్తాన్రోబోటిక్స్ అభివృద్ధి చేస్తున్న జట్టు నాయకురాలు 

    అఫ్ఘనిస్తాన్ లో తోలి కోవిడ్ కేసు తన ప్రాంతమైన హెరాత్ లో నమోదయినప్పుడు సోమయ అలాగే తన మిత్రులు- అందరూ మహిళలే- కలిసి నడుపితున్న"ఆఫ్ఘన్ డ్రీమర్స్" రోబోటిక్స్ జట్టు కోవిడ్ రోగులకి వైద్యం అందించేదానికి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే వెంటిలేటర్ ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు.

    సోమయ, తన బృందం తాము అభివృద్ధి చేసిన డిజైన్ ని ప్రజారోగ్య మంత్రిత్ర్వ శాఖకి చూపించటానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ డిజైన్ ఆమోదం పొందితే కనుక మారుమూల ఆసుపత్రులలో ఈ వెంటిలేటర్స్ ని వాడటానికి అవకాశం ఉంటుంది. సోమయ 2002లో జన్మించారు. ఈవిడ ఎన్నో పురస్కారాలు గెలుపొందారు. అమెరికాలో విజ్ఞాన-సాంకేతికతకి ఇచ్చే ఫస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ లో కరేజియస్ అచీవ్మెంట్ కేటగరీలో వెండి పతకం పొందారు. వరల్డ్ సమ్మిట్ ఏఐ లో బెనిఫిటింగ్ హ్యుమానిటీ ఇన్ ఏఐ పురస్కారం పొందారు. రా సైన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జానెట్ ఇవీ-డ్యూన్సింగ్ పర్మిషన్ టు డ్రీం పురస్కారం పొందారు. ఐరోపాలోని అతి పెద్ద రోబోటిక్స్ సమావేశమైన ఎస్టోనియాలో జరిగిన రోబోటెక్స్ లో ఎంటర్ప్రెన్యూయెర్ ఛాలెంజ్ లో పురస్కారం పొందారు.

    ఈ రోజు మనం మన అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏమి నేర్పిస్తున్నాము అనే దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిల్లలందరికీ తమ తమ కలలని సాకారం చేసుకోవడానికి విద్య లోనూ, సామర్ధ్యాలలోనూ సమాన అవకాశాలు ఉండాలి.

  • ఎలీన్ ఫ్లిన్

    రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్సెనేటర్

    ఐరిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన సీనాడ్ ఐరెన్‌కి ఎన్నికైన ఐరిష్ ట్రావెలర్స్ సమాజానికి చెందిన మొదటి మహిళగా ఈ సంవత్సరం ఎలీన్ ఫ్లిన్ చరిత్ర సృష్టించారు.

    ఐరిష్ ట్రావెలర్స్ మరియు ఇతర అట్టడుగు వర్గాలకు తోడ్పడటానికి తన పదవి వాడుతున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో ద్వేషపూరిత నేరాలని శిక్షించే చట్టం తీసుకురావాలని తన కోరిక.

    > ఒకరినొకరు చూసుకోండి, ఒకరికొకరు చేయి అందివ్వండి,మరొక స్త్రీని క్రిందికి నెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. వేరొకరి కొవ్వొత్తిని ఆర్పివేయ్యడం ద్వారా వల్ల మీ కొవ్వొత్తి ప్రకాశవంతంగా వెలగదు. మనం కలిసి మెలసి ఏకతాటిపై నిలబడ్డప్పుడే మన వెలుగులు ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతం చేయగలవు.

  • జేన్ ఫోండా

    యుఎస్ నటి

    రెండు సార్లు అకాడెమీ పురస్కారం అందుకున్న ఘనత జేన్ ఫ్లోండాది . క్లూట్, కమింగ్ హోం, ఆన్ గోల్డెన్ పాండ్, 9 టు 5 చిత్రాల ద్వారా ఆవిడ బాగా పేరు పొందారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో వస్తున్నా గ్రేస్, ఫ్రాంకీ సిరీస్ లలో నటిస్తున్నారు.

    గత యాభై సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా ఎన్నో విషయాల మీద ఆమె తన గళం వినిపిస్తున్నారు. మహిళల హక్కులు, టిప్పుల మీద జీవించే కార్మికులకి న్యాయమైన జీతాలు ఇవ్వాలని పోరాడుతున్నారు. ఈ మధ్య కాలంలో గ్రీన్ పీస్ యుఎస్ఏ సంస్థ మొదలుపెట్టిన ఫైర్ డ్రిల్ ఫ్రైడేస్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఇందులో పర్యావరణ సంక్షోభం గురించి అవగాహన కలిపించటానికి వారం వారం కార్యక్రమాలు చేపడతారు.

    > సైన్స్ లెక్కేసినదానికంటే ప్రపంచం చాలా తొందరగా వేడెక్కుతున్నది. మానవాళి తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇప్పుడు కావాల్సింది సమష్టి కృషి. మహిళలు దీనిని బాగా అర్థం చేసుకుంటారు. మనమంతా ఒకరిమీద ఒకరు ఆధారపడి జీవిస్తున్నామని మహిళలు బాగా అర్థం చేసుకుంటారు. పర్యావరణ సంక్షోభం ప్రభావం వాళ్ళ మీదనే ఎక్కువ., ఇప్పుడు దానికి జవాబు కూడా వాళ్ళే ఇస్తారు. ఈ పని చెయ్యటానికి మనమందారం సన్నద్దమవుదాము.

  • కిరణ్ గాంధీ

    యుఎస్గాయని

    మేడం గాంధీ పేరు మీద ప్రదర్శనలు ఇచ్చే కిరణ్ గాంధీ గాయని, సంగీత విద్వాంసురాలు, కళాకారిణి, సామాజిక కార్యకర్త. లింగ వివక్షను రూపు మాపడం దానిని ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావటం ఆవిడ లక్ష్యం. ఎం.ఐ.ఏ, థీవరీ కార్పోరేషన్ లాంటి బ్యాండ్ల తో అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు.

    ఋతుస్రావం గురించి ప్రజలలో ఉన్న దురభిప్రాయాలను తొలగించటానికి రక్తం కారుతూ ఉన్న ఋతుస్రావం సమయంలో లండన్ మారథాన్ లో పాల్గొన్నారు.

    > కోవిడ్ కారణంగా మనలో చాలా మంది ఇంటి నుండి పని చేసే విధంగా మన పని విధానాన్ని మార్చుకున్నాము. దీని కారణంగా పిల్లల పెంపకం అంటే ఒక సానుకూల దృక్పధం ఏర్పడింది. వ్యవస్థలని మనకి అనుకూలంగా మార్చుకుని మన శ్రేయెస్సు కోసం పని చేసేలా మార్చుకునే శక్తి మనకుండాలి.

  • లారెన్ గార్డనర్

    యుఎస్శాస్త్రవేత్త

    లారెన్ గార్డనర్ జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అలాగే సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సహ-డైరెక్టర్.

    కోరోనా వైరస్ కేసుల సంఖ్యని ట్రాక్ చెయ్యడానికి నిర్మించిన ట్రాకర్ ని అభివృద్ధి చేసిన బృందానికి గార్డనర్ నాయకత్వం వహించారు. ఈ ట్రాకర్ ప్రభుత్వాలకి, అంటువ్యాధుల మీద పరిశోధన చేసే పరిశోధకులకి, మీడియాకి అందరికీ ఉపయోగపడింది 

    > ఒకరి అనుమతి కోసం వేచి ఉండకండి. మీ పనిని మీరు ప్రారంభించండి 

  • అలిసియా గార్జా

    యుఎస్మానవ హక్కుల కార్యకర్త

    అలిసియా గాజా సామాజిక కార్యకర్త, రాజకీయ వ్యూహకర్త, "ది పర్పస్ ఆఫ్ పవర్: హౌ వి కం తుగెథర్ వెన్ వుయ్ ఫాల్ అపార్ట్" పుస్తక రచయిత.

    ఈవిడ బ్లాక్ ఫ్యూచర్స్ ల్యాబ్, బ్లాక్ టు ది ఫ్యూచర్ యాక్షన్ ఫండ్ కి నాయకత్వం వహిస్తున్నారు: బ్లాక్ లైవ్స్ మ్యాటర్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ గ్లోబల్ నెట్వర్క్ సహ-స్థాపకురాలు; నేషనల్ డమస్టిక్ వర్కర్స్ అలయన్స్ లో స్ట్రాటజీ అండ్ పార్టనర్షిప్ డైరక్టర్; సూపర్మెజారిటీ సహా-స్థాపకురాలు; లేడీ డోంట్ టేక్ నో పోడ్కాస్ట్ నిర్వాహకురాలు.

    > మీ పాదాలు భూమి మీద, తల నింగిలో, కళ్ళు కోరుకుంటున్న విషయం మీద ఉండాలి.

  • ఇమాన్ గలేబ్ అల్-హమ్లీ

    యెమెన్మైక్రోగ్రిడ్ మేనేజర్

    సౌర శక్తి మైక్రోగ్రిడ్ లను ఏర్పాటు చేసిన పది మంది మహిళల బృందానికి ఇమాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మైక్రోగ్రిడ్ ద్వారా శుభ్రమైన, పర్యావరణంపై తక్కువ ప్రబావం ఉన్న విద్యుత్తుని అందచేస్తున్నారు. ఇది యెమెన్ అంతరుధ్యం జరుగుతున్న యుద్ధ క్షేత్రం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.

    యెమెన్ లో విద్యుత్తు గ్రిడ్ లేని ప్రాంతాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు ఏర్పాటు చేసిన మూడు మైక్రోగ్రిడ్లలో ఇది ఒకటి. పూర్తిగా మహిళలే నడిపే గ్రిడ్ ఇదొక్కటే. మొదట్లో పురుషులు చెయ్యాల్సిన పని మహిళలు చేస్తున్నందుకు ఈ బృందాన్ని అందరూ హేళన చేశారు. అయితే దీని తరువాత వీరు తమ సమాజం నుండి ప్రశంసలు పొందారు. దానితో పాటే సుస్థిరమైన ఆదాయం కూడా పొందుతూ తమ నైపుణ్యాలని మెరుగుపరుచుకున్నారు.

    > మీ కలలని సాకారం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ, దారిలో వచ్చే కష్టాలని తట్టుకుంటూ మీ కలలని సాకారం చేసుకోండి. ఇదే నేను యెమెన్‌లోని అమ్మాయిలందరికీ ఇచ్చే సందేశం-

  • సారా గిల్బర్ట్

    యుకెశాస్త్రవేత్త

    చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జన్యు నిర్మాణాన్ని ప్రచురించిన వెంటనే సారా మరియు ఆమె బృందం ఆక్సఫర్డ్ లో వాక్సిన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు వాళ్ళు కోవిడ్- 19కి వ్యాక్సిన్ తయారుచేశారు. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మూడవ స్టేజి క్లినికల్ ట్రైల్స్ దశలో ఉంది.

    మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ వైరాలజీ, వ్యాక్సినాలజీలలో శిక్షణ పొందిన సారా 2014 నుండి కొత్తగా ప్రబలతున్న వ్యాదులకి వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.

    > ఈ సంవత్సరాన్ని గట్టెక్కడానికి అవసరమైన మనోబలం మనకుంది. వేటి మీదైతే మనం దృష్టి పెట్టాలో వాటి మీద దృష్టి పెట్టడం ఇప్పుడు ఎంతో అవసరం. అవేంటంటే ఆరోగ్యం, విద్య, ఇతరులతో సత్సంబంధాలు.

  • మాగీ గోబ్రాన్

    ఈజిప్ట్కాప్టిక్ సన్యాసినిstephenschildrenus

    మామా మాగీ గోబ్రాన్ తన జీవితాన్ని ఈజిప్టు సమాజంలోని అట్టడుగు పిల్లల జీవితాలని మార్చటం కోసం అంకితం చేశారు. తన సౌకర్యవంతమైన జీవితాన్ని, అద్భుతమైన విద్యా వృత్తిని విడిచి పెట్టి తన వనరులని, శక్తిని పిల్లలని గమనించతానికి, వారి పాదాలు శుభ్రం చెయ్యడానికి, వారి కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళు ఎంతో ముఖ్యమైన వాళ్ళు అని చెప్పడానికి కేటాయిస్తున్నారు.

    1989 నుండి మామా మాగీ,ఆమె బృందం లక్షల మంది పిల్లల జీవితాలని మార్చారు. వారికి మానసిక ఉత్తేజం, విద్య, ఆరోగ్య సదుపాయాలు, వీటన్నిటికంటే ముఖ్యంగా వారికంటూ ఒక ఆత్మగౌరవ జీవితం అందిస్తూ పిల్లల జీవితాలని మారుస్తున్నారు.

    > మీతో మీరు సమన్వయం సాధించగలిగితే భూమ్యాకాశాలతో కూడా సాధించగలరు.

  • రెబెకా గ్యుమి

    టాంజానియాన్యాయవాది

    రెబెక్కా గ్యుమి సికానా ఇనీషియేటివ్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, కార్యనిర్వహణాధికారి. ఈ సంస్థ బాలికల హక్కుల కోసం పని చేస్తున్నది. లింగ సమానత్వం కోసం పాటుపడుతున్నారు ఈమె. యువతతో మమేకం కావడం, మహిళా ఉద్యమాలని నిర్మించటం, జాతీయ, క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంలో రెబెక్కాకి విశేష అనుభవం ఉంది.

    2019 సంవత్సరంలో టాంజానియా అప్పీల్ కోర్టులో సికానా ఇనీషియేటివ్ ఒక ముఖ్యమైన కేసు గెలిచారు. పెళ్ళి వయసు పద్దెనిమిది సంవత్సరాలకి పెంచడం ద్వారా బాల్య వివాహాలని ఆ దేశంలో నిషేధించేలా చేశారు

    > ప్రయాణం కష్టసాధ్యమైనా కూడా ఆ కష్టసాధ్యమైన ప్రయాణం కొనసాగుతుంది. పోరాడటానికి కట్టుబడి ఉందాము. ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాము. లింగ సమానత్వం సాధించేవరకు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాము.

  • డెటా హెడ్మన్

    జమైకాడార్ట్స్ ఛాంపియన్

    డెటా 22 సంవత్సరాలు పాటు బ్రిటిష్ పోస్టల్ సర్వీస్ అయిన రాయల్ మెయిల్ లో ఇరవై రెండు సంవత్సరాల పాటు రాత్రి షిఫ్టులో పని చేశారు.ఈవిడ 215 డార్ట్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఈ క్రీడలో ఇది రెండవ అత్యధిక సంఖ్య. ఈవిడకన్నా ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నది ఫిల్ టేలర్ ఒక్కరే. ఈవిడ 341 ఫైనల్స్ లో పాల్గొన్నారు. డార్ట్ క్రీడా చరిత్రలో ఇన్ని ఫైనల్స్ లో పాల్గొన్నది ఈవిడ ఒక్కరే. 1973లో ఈవిడ ఇంగ్లాండ్ కి వచ్చారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ డార్ట్స్ జట్టు కెప్టెన్ గా ఉన్నారు

    హార్ట్ ఆఫ్ డార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ రాయబారి ఈవిడ. ఆలాగే ఇంగ్లాండ్ దేశపు యూత్ డార్ట్స్ రాయబారి కూడా. వరల్డ్ డార్ట్స్ ఫెడరేషన్ బోర్డు సభ్యులు కూడా. ప్రపంచ ర్యాంకులలో పదకొండు సార్లు మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ మహిళా జట్టులో ఎక్కువ సార్లు క్రీడలో పాల్గొన్న వారిలో ఈవిడ రెండవ స్థానంలో ఉన్నారు.

    > నేను మహిళలందరికీ ఒకటే మాట చెబుతాను: మీ కలలను సాకారం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోను వాటిని వదిలెయ్యొద్దు. వయసు, లింగం, జాతి ఇవేమీ వాటిని సాకారం చేసుకోవడానికి అడ్డంకి కాకూడదు. ఈ భూమి మీద ఒక సారే ఉంటారు మీరు. అప్పుడే చెయ్యగలిగినంత చేసెయ్యండి.

  • ముయెసెర్ అబ్దులహెద్ హెన్డన్

    ఘులీజ (చైనాలోని యినింగ్ ప్రాంతం) నుండి బహిష్కరింపబడ్డ వీగర్ రచయిత

    ముయెసెర్ అబ్దులహెద్- తన కలం పేరు హెన్డన్- మెడిసిన్ చదువుతున్నప్పటి నుండి కవిగా, రచయితగా పేరుగాంచారు. తను పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ పూర్తి చేసే సమయానికి రచన మీదనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2013లో టర్కీకి తను నివాసాన్ని మార్చాక హెన్డన్ అయ్హాన్ ఎడ్యుకేషన్ అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ వీఘర్ ప్రవాసులకి వీఘుర్ భాషలో శిక్షణ ఇస్తున్నారు . ప్రస్తుతం ఆమె ఇస్తాంబుల్ లో నివసిస్తున్నారు.

    హెన్డన్ ఇటీవల రచనలలో తన మాతృభూమిలో నెలకొన్న సంక్షోభాల మీద బాగా దృష్టి కేంద్రీకరించారు. తన తొలి నవల ఖ్యేర్-ఖోష్, ఖుయాష్ ( సూర్యుడికి వీడ్కోలు అని అర్థం) ఉయిఘుర్ ప్రాంతంలో డిటెన్షన్ క్యాంపుల ఆధారంగా రాసిన ఫిక్షన్ నవల.

    > దేశానికి పిల్లలే ఆశారేఖలు. ఈ ఆశలని నిజం చెయ్యగలిగేది విద్యే.

  • ఉయేదు ఇక్పే-ఎటిం

    నైజీరియా చిత్ర దర్శకులు

    ఉయేదు ఇక్పే-ఎటిం స్త్రీవాద చిత్ర దర్శకులు, ఎల్జీబీటీ కార్యకర్త. నైజీరియాలో అణగారిన వర్గాల జీవితాల గురించి అందరికీ తెలియచేయడాన్ని తన జీవితాశయయంగా పెట్టుకున్నారు.

    తను తీసిన 'ఇఫే' చిత్రంలో (యొరుబా భాషలో ప్రేమ అని అర్థం) నైజీరియాలో ఇద్దరు మహిళా స్వలింగ సంపర్కుల కథని చెప్పారు. నైజీరియా దేశంలో స్వలింగ సంపర్కుల పట్ల ఉన్న హీనభావం, వ్యతిరేక పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఎలా నెగ్గుకొచ్చారు అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించగానే రాజ్య సెన్సార్ కత్తెర్లకి పనిపడింది. దీనికి కారణం నైజీరియా దేశంలో నేటికీ స్వలింగ సంపర్కం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతే.

    > మహిళలు మీ ప్రస్థానాన్ని కొనసాగించండి. అలాగే గొంతెత్తే అవకాశం లేకుండా ఉండిపోయిన వారి కథలు చెబుతూనే ఉండండి.

  • మిహో ఇమాడా

    జపాన్ సకే (జపాన్ లో ఒకరకమైన మద్యం)మాస్టర్ బ్రీవర్

    సకే మద్యాన్ని బ్రూవ్ చెయ్యటం శతాబ్దాలుగా కేవలం పురుషుల పనిగా ఉండేది. జపాన్ లోని బ్రూవరీలలోకి మహిళలు అడుగుపెట్టడం శతాబ్దాలుగా నిషిద్ధంగా ఉండేది.

    తన కుటుంబంలో ఉండే ఓ వ్యక్తి(పురుషుడు) మాస్టర్ బ్రూవర్ పని నుండి విరమణ తీసుకున్నాక మిహో తానే మాస్టర్ బ్రూవర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు జపాన్ లో అతి కొద్ది మంది మహిళా సకే మాస్టర్ బ్రూవర్లలో మిహో ఒకరు. ప్రస్తుతం దేశంలో ఒక ఇరవై వరకు సకే బ్రూవరీలని మహిళలు నడుపుతున్నారు.

    > మీ జీవితం మొత్తం దానికి అంకితం చెయ్యాలి అనుకున్న ఉద్యోగం మీకు లభిస్తే దానిలో పూర్తిగా నిమగ్నమైపోండి. మీరు ఎంచుకున్న వృత్తి పట్ల మీరు గౌరవంగా, నిజాయితీగా ఉంటే మీ లక్ష్యాలను చేరుకుంటారు.

  • ఇసైవని

    ఇండియా సంగీత విద్వాంసులు isaivaniisaiv

    ఇసైవని ఇండియాకి చెందిన విశిష్టమైన గాయకులు. గాన సంగీతం తమిళనాడు రాష్ట్రంలో ఉత్తర చెన్నైలో కార్మికవర్గ ప్రాంతం నుండి వచ్చింది. ఇసైవని చాలా సంవత్సరాలుగా పూర్తిగా మగ ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వస్తున్నారు.

    పేరుపొందిన పురుష గాయకులతో ఒకే వేదిక మీద పాడటమే ఒక గొప్ప విషయం. ఇసైవెని సాంప్రదాయపు అడ్డుగోడలని తొలగించారు. దీనితో ఇతర యువ గాయనీలకి ఇది ఒక స్పూర్తిగా ఉంది.

    > 2020లో ప్రపంచం చాలా మారిపోయింది. అయితే మహిళలకి ప్రపంచం రోజూ మారుతూనే ఉంది. మహిళలు సిద్ధాంతాలని మారుస్తున్నారు, పురుషాధిక్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు. రాబోయే తరాలలో ఇది నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది.

  • మానసి జోషీ

    ఇండియా అథ్లెట్

    ఇండియాకి చెందిన మానసి జోషీ వికలాంగ అథ్లెట్. ప్రస్తుతం వికాలంగుల బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్. జూన్ 2020లో తనని ఎస్ఎల్ 3 సింగిల్స్ విభాగంలో రెండవ ర్యాంకర్ గా వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటించింది. మానసి ఇంజనీర్ కూడా. అలాగే మార్పు తీసుకువస్తున్న వనిత.

    వైకల్యాన్ని, వికలాంగ క్రీడలని ఇండియాలో అర్థం చేసుకుంటున్న విధానాన్ని మార్చాలని అని మానసి కోరుకుంటున్నారు. మొన్నీ మధ్యే టైం మ్యాగజైన్ మానసిని "నెక్స్ట్ జెనరేషన్ లీడర్" గా గుర్తించింది. వికలాంగుల హక్కుల కోసం పనిచేస్తున్న వనితగా తనని టైం మ్యాగజైన్ ఆసియా ఎడిషన్ కవర్ పై చిత్రించారు.

    > ఈ సంవత్సరం మహిళలకి అనేక విధాలుగా సవాళ్ళుతో కూడుకున్న సంవత్సరం. క్లిష్ట పరిస్థితుల్లో మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అన్ని అవకాశాలని అన్వేషించండి. మీకంటూ కొంత సమయం ప్రతి రోజు కేటాయించుకోండి.

  • నదీనే కాదన్

    ఫ్రాన్స్ రచయిత/చిత్రకారిణి

    తనకి ఎనిమిది సంవత్సరాల వయసు నుండే సిరియాకి చెందిన నదీనే కాదన్ కథలు రాస్తున్నారు, కథలని బొమ్మల రూపంలో చెబుతున్నారు. తను పెరుగుతున్నప్పుడు చదివిన పుస్తకాలలో పిల్లలని చిత్రీకరించిన విధానం నచ్చక పిల్లలందరికి తమని తాము కథలలో చూసుకునే విధంగా రాయాలని చెప్పి సంకల్పించి ఇప్పుడు ఆ పని చేస్తున్నారు.

    తన సాంస్కృతిక వారసత్వం నుంచీ ప్రేరణ పొంది, అరబ్ ప్రపంచంలో చదివే అలవాటు పెంపొందించాలి అనే కోరికతో కథలు రాయటం మొదలుపెట్టారు. తన కథలలో మధ్యాసియాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిలల్లు, సంఘర్షణలో చిక్కుకున్న పిల్లల జీవితాలని ఇతివృత్తంగా తీసుకుంటున్నారు.

    > అది సంఘర్షణ కానివ్వండి కోవిడ్ కానివ్వండి మహిళలే శాంతిని స్థాపించే వారుగా, నాయకులుగా ఉంటున్నారు. అలా ఉన్నా కూడా వ్యవస్థలు అన్నీ కూడా మాకు వ్యతిరేకంగానే ఉన్నట్టు ఉన్నాయి. ఆ వ్యవస్థలని మాకు అనుకూలంగా చేసుకోవటానికి చేస్తున్నదే ఈ పోరాటం

  • ములెంగా కప్వేప్వే

    జాంబియా కళాకారిణి, క్యూరేటర్

    ములెంగా కప్వేప్వే జాంబియా విమెన్స్ హిస్టరీ మ్యూజియం సహ-స్థాపకురాలు. జాంబియా దేశాభివృద్ధిలో ఆ దేశపు మహిళల భాగస్వామ్యాన్నిఅందరికీ తెలియచేస్తున్నందుకు 2020లో ఈ మ్యూజియం ప్రశంసలు అందుకుంది. జాంబియా రాజధాని లుసాకాలో పిల్లల కోసం గ్రంథాలయాలు కూడా ఈవిడ నిర్మించారు.

    2004 నుండి 2017 వరకు ఈవిడ నేషనల్ ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ జాంబియా చైర్ పర్సన్ గా ఉన్నారు. నృత్యం, సంగీతం, రచన, సంస్కృతి విషయాల మీద పని చేస్తున్న అనేక సంస్థలకి పోషకురాలిగా కూడా ఉన్నారు.

    > మార్పుని మీ అవకాశంగా మార్చుకోండి.

  • జెమీమా కరియుకి

    కెన్యా వైద్యురాలు

    డాక్టర్ జెమీమా కరియుకి ప్రసూతి, బాలల ఆరోగ్యానికి సంబంధించి ప్రివెంటివ్ మెడిసిన్ పై మక్కువ ఎక్కువ. 2007 ఎన్నికల తరువాత చోటుచేసుకున్న హింసకి సమాధానంగా ఈవిడ పీస్ క్లబ్ స్థాపించారు. అలాగే పబ్లిక్ హెల్త్ క్లబ్ కూడా స్థాపించారు. ఈ పబ్లిక్ హెల్త్ క్లబ్ సెర్వికల్ క్యాన్సర్ నివారణ గురించి పని చేస్తోంది.

    ప్రసూతి సంబంధ వైద్య విద్యార్ధిరాలిగా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గిపోవటం గమనించారు. అదే సమయంలో కోవిడ్ సమయంలో ముఖ్యంగా కర్ఫ్యూ సమయంలో సంక్లిష్ట పరిస్థితుల సంఖ్య పెరగటం కూడా గమనించారు. పరిమిత రవాణ సౌకర్యం కారణంగా వైద్య సదుపాయలకి దూరం అవుతున్నారు అనే విషయం గమనించి ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మహిళలని తమ ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి లైసెన్స్డ్ వాహనాలు ఏర్పాటు చెయ్యడం. దీని ఫలితమే వీల్స్ ఫర్ లైఫ్ అని ఉచిత అంబులెన్స్ సదుపాయం.

    > ఈ కోవిడ్ సమయంలో మీరు ఒంటరి కాదు. ఇది అందరి మీద ప్రభావం చూపించింది. అయితే మీరు ఒంటరి అనే భావన మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. దానినే మీ అవకాశంగా మలుచుకోవటానికి వెనకడుగు వెయ్యొద్దు. ఇంకెవరో అవసరానికి మీరే జవాబు అవ్వొచ్చు.

  • గుల్సం కవ్

    టర్కీ సామాజిక న్యాయ కార్యకర్త

    గుల్సం కవ్ టర్కిష్ వైద్యురాలు, విద్యా వేత్త, వుయ్ విల్ స్టాప్ ఫెమిసైడ్ సహ-స్థాపకురాలు. గత సంవత్సర కాలంలో ఫేమిసైడ్ రేట్ ఎక్కువ ఉండటం, ఇస్తాంబుల్ కన్వెన్షన్ ( గృహ హింస బాధితులకి రక్షణ కలిపించే ఒక న్యాయ సాధన) ని తొలగించాలా అనే చర్చ టర్కీలో తీవ్ర విమర్శకు దారితీసింది.

    టర్కీలో లింగ ఆధారిత హింస గురించి అవగాహన పెంపొందించదానికి గుల్సం తెరిపి లేకుండా పనిచేశారు. అలాగే ఫెమిసైడ్ కి తమ బంధువులని కోల్పోయిన వారి తరుపున పని చేశారు

    > ఈ రోజు ప్రతిఘటిస్తున్న మహిళలు సంనత్వాన్ని, స్వేచ్ఛని కోరుకుంటున్నారు. ఈ కోవిడ్ మహిళలు అనుభవిస్తున్నఅసమానతని వెలుగులోకి తెచ్చింది. మార్పు కోసం పోరాడటం తప ఇంకొక మార్గం లేదు అని కూడా తెలియచెప్పింది.

  • జాకీ కే

    బ్రిటన్ కవి

    జాకీ కే స్కాటిష్ కవి, నాటకరచయిత, నవలా రచయిత. తన ఆత్మకథ 'రెడ్ డస్ట్ రోడ్' లో తను తనకి జన్మనిచ్చిన తల్లితండ్రులని వెతకటం గురించిన వివరాలు పేర్కొన్నారు. ఈ ఆత్మకథ తనని దత్తతకి తీసుకున్న తెల్ల జాతి తల్లితండ్రులకి ప్రేమలేఖ అని తెలిపారు. 2016లో తనని స్కాట్స్ మకర్ గా గుర్తించారు. అంటే స్కాట్లాండ్ జాతీయ కవి అని.

    జాకీ కే స్కాట్లాండ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆమెను సాహిత్యానికి చేసిన సేవకి కాను 2020లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గా ఎంపిక చేశారు

    > మనం ఎన్నడూ ఆశని కోల్పోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం చోటుచేసుకున్న నిరసనలు భవిష్యత్తు గురించి ఒక వింతైన ఆశని నాలో రేకెత్తించాయి.

  • సల్సబీల ఖైరున్నీసా

    ఇండోనేషియా పర్యావరణ కార్యకర్త jaga_rimba

    ఇండోనేషియాకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని సల్సబీల ప్రతి శుక్రవారం అడవుల నరికివేతకి వ్యతిరేకంగా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు తమ పాఠశాల నిర్వహించే ధర్నాకు నాయకత్వం వహిస్తున్నారు.

    పదిహేనేళ్ళు వయసులో యువత నాయకత్వం వహిస్తున్న 'జగ రింబా' అనే ఉద్యమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.అటవీ సంరక్షణతో పాటు కినిపన్ అడవులలో- ఇది చివరగా మిగిలి ఉన్నసతతహరితారణ్యం కోసం- అలాగే తమ నివాసాలు కోల్పోతున్న ఆదీవాసీల హక్కుల కోసం కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.

    > మనమందరం కూడా లాభం కోసం మాత్రమే పనిచేసే ఈ పితృస్వామ్య-పెట్టుబడిదారీ వ్యవస్థ క్రింద ఉన్నామనే సామూహిక చైతన్యాన్ని ఈ కోరోనావైరస్ మనకి కలిగించింది. ఒకరికొకరు సంఘీభావంగా ఉంటూ ఒక న్యాయమైన, పర్యావరణ అనుకూలమైన వ్యవస్థని అందరం కలిసికట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఇది.

  • మహిరా ఖాన్

    పాకిస్తాన్నటి mahirahkhan

    మహిరా ఖాన్ సాధారణ నటి కాదు. లైంగిక హింసకు వ్యతిరేకంగా తన గళం వినిపిసస్తున్నారు, చర్మ సౌందర్య క్రీముల ప్రకటనలలో నటించడానికి నిరాకరించారు, జాత్యాహంకార వ్యతిరేక పోరాటాలకి తన మద్దతు ప్రకటిస్తున్నారు. తన సొంత దేశమైన పాకిస్థాన్ లో సామాజిక అంతరాలని తన చిత్రాల ద్వారా మార్చాలని కూడా తన కోరిక.

    యునైటెడ్ నేషన్స్ హై కమీషన్ ఫర్ రెఫ్యూజీస్ కి మహిరా రాయబారి. దీని ద్వారా ఈవిడ పాకిస్థాన్ లో ఉన్న ఆఫ్ఘాన్ కాందిశీకుల వెతల గురించి అందరికీ అవగాహన కలిపిస్తున్నారు. 2006లో ఎంటివి వీడియో జాకీగా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి ఈవిడ అందరికీ ప్రీతిపాత్రురాలు. అలాగే మహిరా తన పదకొండేళ్ళ బాబుని ప్రేమగా చూసుకునే తల్లి కూడా.

    > మార్పుకి దోహదపడే విషయాల గురించి ఎప్పుడూ గళమెత్తుతూనే ఉండండి.

  • అన్జేలిక్ కిడ్జో

    బెనిన్ సంగీత విద్వాంసులు

    నాలుగు సార్లు గ్రామీ పురస్కారం గెలుచుకున్న అన్జేలిక్ కిడ్జో నేడు ప్రపంచ ప్రసిద్ధ్హి గాంచిన సంగీత విద్వాంసులలో ఒకరు. తను చిన్నప్పుడు బెనిన్ లో పెరిగినప్పుడు అక్కడ నేర్చుకున్న పశ్చిమ ఆఫ్రికా సంగీతాన్ని అమెరికన్ ఆర్&బి, ఫంక్, జాజ్ లతో మేళవించారు. ఆలాగే లాటిన్ అమెరికా, ఐరోపా సంగీత సాంప్రదాయ ప్రభావం కూడా ఉన్నది.

    ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఆఫ్రికా ప్రవాసుల గురించి అన్వేషణ గురించి ద టాకింగ్ హెడ్స్ ఆల్బం రిమెయిన్ ఇన్ లైట్ లో కూలంకుషంగా మాట్లాడాక, ఇప్పుడు ఈ ఫ్రెంచ్-బెనినీస్ గాయని క్యూబాలో జన్మించి "సల్సా మహారాణి"గా ఖ్యాతి గందించిన సెలియా క్రూజ్ ఆఫ్రికన్ మూలాల గురించి పరిశోధిస్తున్నారు. యూనిసెఫ్ రాయబారిగా ఈవిడ బాలల హక్కుల గురించి కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే బటోంగా అనే తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆఫ్రికాలోని యుక్త వయసు బాలికల విద్యకి మద్దతు అందిస్తున్నారు.

    > ప్రేమగా, సంఘీభావంతో ఒకరి గురించి ఇంకొకరు శ్రద్ధ తీసుకోవదానిని మనం కొనసాగించాలి. ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ సంఘీభావం సామాజిక వర్గం, జాతి, లైంగికత లాంటి పరిధులని దాటి ఉండాలి.

  • చు కిం డక్

    వియెత్నాం ఆర్కిటెక్ట్ kim_duc_

    పిల్లలకి ఆడుకునే హక్కు ఉంది అని విషయాన్ని వియెత్నాం లో ప్రచారం చేయటం ఆర్కిటెక్ట్ చు కిం డక్ లక్ష్యం. థింక్ ప్లేగ్రౌండ్స్ అనే సస్మ్త సహ-స్థాపకులుగా, డైరక్టర్ గా ఉన్న చు తల్లిదండ్రుల, స్థానిక ప్రజల సహకారంతో దేశంలోని నూట ఎనభైకి పైగా ఆటస్థలాలని రీసైకిల్డ్ పదార్థాలతో అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

    ఈమె ప్రస్తుతం హనోయిలోని వియెత్నాం నేషనల్ చిల్డ్రన్ హాస్పిటల్ కోసం థెరపీ ఆటస్థలాలు అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. అలాగే పట్టణంలోని మొట్టమొదటి లో కార్బన్ ఆటస్థలంలో కూడా ఇది అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.

    > పనిలో కానీ జీవితంలో కానీ కులాసాగా ఉండండి. ఒక అంతర్లీన ప్రేరణతో నేర్చుకుంటూ వెళ్ళడమే: ఏమి చెయ్యాలి?, ఏమి చేస్తే ఆనందంగా ఉంటారు? ఇలా. మక్కువతో, నిరాటంకంగా నేర్చుకుంటుంటే దారిలో వచ్చే అవరోధాలని ఎదుర్కుని ఆశావాహ దృక్పధంతో ఉంటాం.

  • సఫా కుమారీ

    సిరియా ప్లాంట్ వైరాలజిస్ట్

    ప్లాంట్ వైరాలజిస్ట్ అయిన సఫా అంటువ్యాధుల కారణంగా పంటలకి చేకూరే నష్టాలని నివారించే విషయం మీద పనిచేస్తున్నారు. సిరియాలో ఆహారా భద్రతని సంరక్షించే విత్తనాలని కనుగొన్నాక వాటిని అలెప్పో నుండి తీసుకురావటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టారు.

    వైరస్ నిరోధక మొక్కలని కనుగొనటంలో ఆవిడ చాల సంవత్సరాలు గడిపారు.అందులో భాగంగానే ఫాబా నేక్రోటిక్ యెల్లో వైరస్ ని నిరోధించే ఫాబా బీన్ మొక్కని కనుగొన్నారు.

    > 2020లో ప్రపంచం చాలా మారింది. ఈ సవాళ్ళని ఎదుర్కోవటానికి కావాల్సింది సామర్ధ్యం. మన జెండర్ కాదు ముఖ్యం. పురుషుల పాత్ర ఎంత ఉందొ మహిళల పాత్ర అంతే ఉంది అన్న విషయాన్ని మహిళలు నమ్మటం చాలా అవసరం 

  • ఇష్తార్ లఖని

    దక్షిణాఫ్రికా సామాజిక కార్యకర్త

    ఇష్తార్ స్త్రీవాద కార్యకర్త అలాగే "సమస్యలు సృష్టించే" (ట్రబుల్ మేకర్) మనిషి అని తనకి తానె చెప్పుకుంటారు. దక్షిణాఫ్రికా వాసి అయిన ఇష్తార్ అక్కడ సామాజిక న్యాయ సంస్థలతో, ఉద్యమకారులతో కలిసి పనిచేస్తూ మానవ హక్కుల ప్రచారంలో వారి పనితీరుని మరింత మెరుగుపరచుకునేందుకు తోడ్పడుతుంటారు.

    సెంటర్ ఫర్ ఆర్టిస్టిక్ యాక్టివిజం అండ్ యూనివర్సిటీస్ అల్లీడ్ ఫర్ ఎస్సేన్షియల్ మేడిసిన్స్ వారు నిర్వహిస్తున్న ఫ్రీ ది వ్యాక్సిన్ ఉద్యమంలో ఈమె కీలక భూమిక పోషించారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటు ధరలో డెలివరీ పాయింట్ దగ్గర అందరికీ అందుబాటులో ఉండేలాగ చెయ్యటమే ఏకైక లక్ష్యంగా ఇప్పుడు మిగతా వారితో కలిసి పనిచేస్తున్నారు.

    > మన జీవితంలో ఎదురైన ఈ సమస్యాత్మక క్షణాలని మన సంతోషాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నిర్మించిన ఈ వ్యవస్థకి అతుకులు వెయ్యటం కంటే పూర్తిగా భిన్నమైన భవిష్యత్తు నిర్మాణానికి అవకాశంగా మలుచుకోవాలి.

  • క్లాడియా లోపెజ్

    కొలంబియా మేయర్

    కొలంబియా రాజధాని, ఆలాగే ఆ దేశంలోని అతి పెద్ద పట్టణమైన బొగోటాకి లోపెజ్ తోలి మహిళా మేయర్.

    బడి పంతులు కూతురైన ఈవిడ అలియాన్జా వెర్డే (గ్రీన్ అలయెన్స్) పార్టీ తరుపున 2014 నుండి 2018 వరకు సెనేటర్ గా ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈవిడ అమలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలలో ఒక కోటి పదహారు లక్షల ఓట్లు వచ్చాయి. అంటే 99% శాతం ఆమోదం లభించింది. కొలంబియా చరిత్రలోనే ఇది ఒక రికార్డ్.

    > ప్రపంచంలోని మహిళలకి నేను చెప్పేది ఒకటే- ఎక్కడా ఆగొద్దు. గత శతాబ్దంలో మొదలయ్యిన సామాజిక విప్లవం ఆగదు. మన వ్యక్తిగత జీవితాలలోను, బయటా ఈ మార్పుని మనం చూస్తాము.

  • జోసీన మాకెల్

    మొజాంబిక్ సామాజిక న్యాయ కార్యకర్త JosinaZMachel

    జోషీన మాకెల్ అనుభవజ్ఞురాలైన మానవ హక్కుల కార్యకర్త. సామాజిక కార్యకర్తల సాంప్రదాయంలో పుట్టారు. మహిళా హక్కుల గురించి ఈవిడ చాలా మక్కువతో పనిచేస్తున్నారు

    జోషీన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ ఎస్ సి ) నుండి ఎంఎస్సీ పట్టభద్రులు. గృహ హింస బాధితురాలైన ఈమె తన వ్యక్తిగత మానసిక గాయాన్ని కుల్హుక ఉద్యమం ద్వారా ఒక మార్పు వైపుకి మళ్ళించారు. లింగ ఆధారిత హింసకి సంబంధించి సామాజిక మార్పు కోసం ఈ సంస్థ పనిచేస్తోంజి. అలాగే దక్షిణ ఆఫ్రికా ప్రాంతంలో హింసకి గురైన వాళ్ళకి ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తోంది.

    > ఈ పరిస్థితులు మహిళల మీద అదనంగా చూపించిన ప్రభావం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మన ఆత్మనిర్భరతే మనల్ని తల్లులుగా, భార్యలుగా, అక్కా చెల్లెళ్ళుగా, నాయకులుగా, పరిశ్రమకి కావాల్సిన కెప్టెన్లగా ముందుకి నడిపిస్తోంది

  • సన్నా మరీన్

    ఫిన్లాండ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి

    సన్నా మరీన్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ అఫ్ ఫిన్లాండ్ నాయకులు. ఈవిడ నడుపుతున్న ప్రభుత్వం నాలుగు రాజకీయ పార్టీల కూటమి. ఈ పార్టీలు అన్నీ కూడా మహిళల నాయకత్వంలో నడుతున్న పార్టీలే: మరియా ఒహిసాలో (గ్రీన్ లీగ్), లీ ఆండర్సన్ (లెఫ్ట్ అలయన్స్), అన్నా-మజ హెన్రిక్సన్ (స్వీడిష్ పీపుల్స్ పార్టీ), అన్నికా సారిక్కో (సెంటర్ పార్టీ).

    కోవిడ్ సంక్షోభాన్ని ఫిన్లాండ్ బాగా ఎదుర్కోగలిగింది అని ప్రశంసలు ఆ దేశానికి అందాయి. ఐరోపా మొత్తంలో నవంబర్ నాటికి ఫిన్లాండ్ లోనే అతి తక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఉంది.

    > వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కోగలము, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోగలం, అలాగే విద్య మీద దృష్టి పెట్టగలం, సమాజంలో సామాజిక సంస్కరణలు తీసుకురాగాలం అని మహిళా నాయకులుగా మనం ఈ ప్రపంచానికి చూపించగలం.

  • హయత్ మిర్షాద్

    లెబనాన్ సామాజిక కార్యకర్త

    స్త్రీవాద కార్యకర్త, జర్నలిస్ట్, మానవతవాది అయిన హయత్ 'ఫి-మేల్' అని లెబనాన్ లో ఉన్న స్త్రీవాద కలెక్టివ్ సహ-స్థాపకురాలు. ఎక్కడా రాజీపడని ఈమె బాలికలకి, మహిళలకి న్యాయం లభించేలా, న్యాయం గురించిన సమాచారం అందేలా, వాళ్ళ మానవ హక్కులు సంరక్షిచబడేలా పని చెయ్యటమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

    వివిధ మార్గాల ద్వారా తను తన సందేశాన్ని చేరవేస్తున్నారు. జాతీయ స్థాయి నిరసనలు, అవినీతి, పితృస్వామ్య పాలకులని ఎదిరించి మార్పు కోసం డిమాండ్ చెయ్యడానికి ప్రజలని సమీకరించడం చేస్తున్నారు.

    > మధ్య మధ్యలో అవరోధాలు ఎదురైనా కూడా చరిత్ర ఆసాంతం మహిళలు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సంఘీభావంతో, సోదరీభావంతో, ప్రేమతో ,మనం మన పోరాటాన్ని కొనసాగిద్దాము. మన గళాలని వినిపిద్దాము, ఒక న్యాయమైన, లింగ సమాన భవిష్యత్తుకై పనిచేద్దాము.

  • బులెల్వ కుటుకన

    దక్షిణాఫ్రికా గాయని/గీతరచయిత zaharasa

    జహార అనే రంగస్థల పేరుతో సుపరిచితులు అయిన బులెల్వ కుటుకన దక్షిణాఫ్రికాలో సామాన్య కుటుంబం నుండి వచ్చారు. పాఠశాల ప్రార్ధన బృందంలో పాడటం అంటే తనకున్న ఇష్టాన్ని తెలుసుకున్నారు. తన గాయని కెరీర్ ని వీధుల్లో పాటలు పాడటం ద్వారా మొదలుపెట్టిన జహార తను 2011లో తీసుకువచ్చిన మొదటి ఆల్బం మూడు వారాలలోనే డబల్ ప్లాటినం స్థాయికి చేరుకుంది.

    గాయనిగా, గేయ రచయితగా కుటుకన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సంగీత పరిశ్రమలో అద్వితీయమైన సాధించారు. అయితే తన ప్లాట్ఫార్మ్ ద్వారా దక్షిణాఫ్రికాలో మహిళలపై జరుగుతున్న హింస గురించి కూడా మాట్లాడుతున్నారు. తానె అటువంటి హింసకి గురయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టారు.

    > కష్టసమయంలో ప్రార్ధనలే నన్ను ముందుకు నడిపాయి. ప్రార్ధనని మించింది లేదు.

  • లూసీ మొనాఘన్

    ఉత్తర ఐర్లాండ్ ప్రచారకర్త

    2015లో తాను అత్యాచారానికి గురయ్యానని ఫిర్యాదు చేశాక తనతో పోలీసులు, న్యాయవాదులు ఎలా ప్రవర్తించారు అని అందరికీ తెలియచేయడానికి లూసీ మొనాఘన్ తన గోప్యత హక్కుని వద్దనుకుని తన పేరుతోనే అందరి ముందుకి వచ్చింది. తన మీద అత్యాచారం చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నతనితో లూసీ "ఫ్లర్టింగ్" చేసిందని కాబట్టి ఈ కేసులో అతనికి శిక్ష పడే అవకాశం లేదని పోలీసులు లూసీకి మొదట్లో చెప్పారు.

    పోలీసుల విచారణలో వైఫల్యాల గురించి లూసీ న్యాయస్థానంలో సవాలు చేసింది. దీని ఫలితంగా లైంగిక దాడికి గురైన వారి విషయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో మార్పు వచ్చింది. లూసీ నేడు అత్యాచార బాధితులకి అండగా ఉంటున్నారు. అలాగే 2019లో చట్టానికి 250కి పైగా సవరణలు ప్రతిపాదించిన జడ్డ్జి గిల్లెన్ సమీక్షలో లూసీ పాల్గొన్నారు.

    > నేను చెయ్యలేను అని వారు అన్నారు. కానీ నేనైతే చేశాను. కాబట్టి మీరు కూడా చెయ్యగలరు.

  • డౌస్ నమ్వెజి ఇబాంబ

    డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పాత్రికేయులు

    డౌస్ నమ్వెజి ఇబాంబ మల్టీ మీడియా పాత్రికేయులు, ఉవేజో ఆఫ్రికా ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు. జర్నలిజం, ఉద్యోగ శిక్షణ, సోషల్ ఎంటర్ప్రెన్యూయెర్షిప్ ద్వారా మహిళా సాధికారతను పెంపొందిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ ఇది.

    లైంగిక విద్య, పరిశుభ్రత కిట్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విద్యార్ధులకి, మహిళలకి అందుబాటులో ఉంచడం ద్వారా ఋతుస్రావం చుట్టూ అల్లుకునున్న అపోహలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

    > తమ రోజువారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే,మార్పుని అందిపుచ్చుకోగల అమ్మాయిలు, మహిళలలుగా మనం ఉందాం. ఏదీ అసాధ్యం కాదు అని చెప్పే అమ్మాయిలు, మహిళలుగా ముందుకెళ్దాం.

  • వనేస్సా నకాటే

    ఉగాండా పర్యావరణ కార్యకర్త

    ఇరవై మూడు సంవత్సరాల వనేస్సా నకాటే ఉగాండాకి చెందిన పర్యావరణ కార్యకర్త, అలాగే ఆఫ్రికా ప్రాంతానికి సంబంధించిన రైస్ అప్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు కూడా. వాతావరణ మార్పు ఆఫ్రికా మీద చూపిస్తున్న ప్రభావం గురించి అంతర్జాతీయ దృష్టికి తీసుకువచ్చే ప్రచారం చేస్తున్నారు. వాతావరణ సంక్షోభం పేదరికాన్న, ఘర్షనలని, లింగ అసమానతని ఏ విధంగా మరింతగా తీవ్రతరం చేస్తున్నది అనే దాని మీద ఆమె దృష్టి పెట్టారు.

    జనవరి 2020లో అసోసియేటెడ్ ప్రెస్ వారు నకాటే గ్రేటా థన్బర్గ్, ఇతర ఐరోపా కార్యకర్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో దిగిన ఫోటో నుండి తనను తొలగించారు. అప్పుడు నకాటే ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో ఉన్న జాత్యాహంకారం గురించి మాట్లాడారు. అసోసియేటెడ్ ప్రెస్ వారు ఆ ఫోటోలో నకాటేని తిరిగి చేర్చారు. అది దురుద్దేశంతో చేసిన పని కాదనైతే చెప్పారు కానే క్షమాపణలు మాత్రం కోరలేదు. జనవరి 27, 2020 నాడు అసోసియేటెడ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బుజ్బీ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ నుండి క్షమాపణలు కోరారు.

    > లాక్డౌన్ల వల్ల, పర్యావరణ సంక్షోభం వల్ల అందరికన్నా ఎక్కువగా కష్ట నష్టాలకు గురయ్యేది మహిళలే. అయితే దీనికి పరిష్కారం కూడా మనమే: మహిళలని విధ్యాదికులని చెయ్యటం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు, విపత్తులని మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు, భవిష్యత్తు పర్యావరణ నాయకులని తయారుచేయవచ్చు.

  • ఎథెల్రెడా నకిములి-పుంగు

    ఉగాండా మానసిక ఆరోగ్య నిపుణులు

    ఉగాండాలోని మకెరేరే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎథెల్రెడా నకిములి-పుంగు థెరపీ సాంస్కృతిక పరిస్థితులకి అనుగుణంగా ఉండే విధంగా థెరపీని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఐవి బాధితులు, డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి ఇచ్చే థెరపీ మీద ఆమె దృష్టి పెట్టారు.

    సామన్య ఆరోగ్య కార్యకర్తలకి నేర్పించటానికి అనుకూలంగా ఉండే అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న థెరపీ కార్యక్రమాన్ని ఆవిడ అభివృద్ధి చేశారు. డిప్రెషన్ లక్షణాలని ఈ థెరపీ బాగా తగ్గిస్తున్నది. అలాగే ప్రభావితులు మందులు తీసుకోవటం కూడా మెరుగయ్యింది

    > మీ మానసిక ఆరోగ్యాన్ని ఒక ముఖ్యాంశంగా చేసుకోండి. అలాగే మీ శక్తిని మీరు తిరిగి పొందండి.

  • నందర్

    మయన్మార్ స్త్రీవాద కార్యకర్త

    నందర్ స్త్రీవాద కార్యకర్త, అనువాదకులు, స్టోరీ టెల్లర్. ఫెమినిస్ట్ టాక్స్, జి-టా జగర్ వైన్ అనే రెండు పాడ్ కాస్ట్ లు కూడా రూపొందించారు. పర్పుల్ ఫెమినిస్ట్ గ్రూప్ స్థాపించారు. యాంగన్ లో ది వజైనా మోనోలోగ్స్ అనే దానికి సహ దర్శకులు.

    ఈశాన్య షాన్ రాష్ట్రంలో ఒక గ్రామంలో పెరుగుతున్నప్పుడు మయన్మార్లో కుటుంబ, సామాజిక సాంప్రదాయక విలువలని ఎదుర్కోవటంలో మహిళలు అనుభవించే కష్టాలు చవిచూశారు. ఇప్పుడు తన పాడ్ కాస్ట్ ల ద్వారా ఋతుస్రావం,అబార్షన్ లాంటి మాట్లాడకూడని విషయాల మీద అవగాహన కలిపిస్తున్నారు.

    > మనుషులుగా మనలని గౌరవించే ప్రపంచం కోసం అసమానతని రూపుమాపే పనిలో మరింత మంది పాల్గొంటే బాగుంటుందని నా కోరిక. కలిసికట్టుగా మనం ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించొచ్చు.

  • వెర్నెట్ట ఎం నే మోబెర్లీ

    యుఎస్ పర్యావరణ కార్యకర్త

    వెర్నెట్ట మోబెర్లీ భార్య, తల్లి, అమ్మమ్మ, స్నేహితురాలు.

    గత కొన్ని ఏళ్లుగా తన పూర్వీకుల నుంచీ అందిపుచ్చుకున్న నైపుణ్యాలను, జ్ఞానాన్ని కూడగట్టి తన తరువాతి తరాల వారికి అందచేస్తున్నారు. భూతల్లిని కాపాడటానికి పోరాడటమంటే ఆమెకి మక్కువ.

    > తల్లుల్లారా మీ గురించిన జాగ్రత్తలు తీసుకోండి. మీ పూర్వీకుల జ్ఞానాన్ని తెలుసుకోండి. మనమందరం కూడా ఒకరికొకరు కనెక్ట్ అయ్యున్నాము. మన పిల్లలు అభివృద్ధి చెందాలి అనే ఒకే కోరిక మనందరిది. సంఘర్షణ ఉంటె ఉంటుంది, దానికి పరిష్కారం కనుక్కోండి.

  • నేమోంట్ నెన్క్విమో

    ఈక్వెడార్ వోరని నాయకులూ nemonte.nenquimo

    నేమోంట్ నెన్క్విమో స్థానిక ఆదివాసీ వోరని మహిళ. తన పూర్వీకుల ప్రాంతాన్ని, అమెజాన్ సతిత హరితారణ్యంలో తమ జీవన విధానాన్ని సంరక్షించడానికి పునుకున్నారు.

    సెయిబో అలయన్స్ ని ఆదీవాసీల నాయకత్వంలో నడుతున్న లాభాపేక్ష సంస్థ సహ-స్థాపకురాలు. పస్తాజా ప్రాంతంలో వోరని సంస్తఃకి మొదటి మహిళా అధ్యక్షులు. అలాగే టైమ్స్ మ్యాగజైన్ వారి ప్రపంచంలో వందమంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరు.

    మనం నివసిస్తున్న ఈ భూ గ్రహం భవిష్యత్తు, మానవాళి భవిష్యత్తు ప్రమాదకరంగా ఉన్న ఈ సమయంలో మహిళలుగా మనకు దీని నుండి బయటపడే ఒక దారంటూ ఏర్పాటు చేసుకునే శక్తి ఉండాలి. మహిళలందరూ కలిసికట్టుగా ఉండవలసిన సమయం ఇదే.

  • సానియా నిష్తార్

    పాకిస్థాన్ ప్రపంచ ఆరోగ్య నాయకులు

    డాక్టర్ సానియా నిష్తార్ ప్రపంచ ఆరోగ్య, సుస్థిర అభివృద్ధి రంగంలో నాయకులు. 2018 నుండి ఎహ్సాస్ పోవర్టీ అల్లివేషన్ ప్రోగ్రాంని నడుపుతున్నారు. లక్షల మంది పాకిస్థానీ ప్రజలకి బ్యాంకింగ్, సేవింగ్ అకౌంట్స్, ఇతర ప్రాధమిక సదుపాయాలు కలిపించడం ద్వారా వారి జీవన పరిస్థితులని మెరుగుపరిచారు.

    పోవర్టీ అల్లివేషన్, సామాజిక భద్రత విషయం మీద పాకిస్థాన్ ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకులుగా ఉన్న సానియా పాకిస్థాన్ లో సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి చెయ్యడానికి ప్రాధమిక చర్యలు తీసుకోవడం ద్వారా ఎంతోమందికి సహాయం చేశారు.

    > కోవిడ్ ప్రభావం మెరుగైన ప్రపంచాన్ని నిర్మించటానికి, పేదరికాన్ని నిర్మూలించటానికి, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి జీవితంలో ఒకేసారి వచ్చేలాంటి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో మహిళలు సమాన భాగస్వాములుగా ఉండాలి.

  • ఫైలిస్ ఒమిడో

    కెన్యా పర్యావరణ కార్యకర్త

    ఫైలిస్ ఒమిడో సెంటర్ ఫర్ జస్టిస్ గవర్నెన్స్ అండ్ ఎంవిరామెంటల్ యాక్షన్ సంస్థ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. కెన్యాలోని వెలికితీత పరిశ్రమల కారణంగా ప్రభావితం అవుతున్న బలహీన వర్గాల పర్యావరణ, సామాజిక-ఆర్ధిక హక్కుల కోసం ఈ సంస్థ పని చేస్తున్నది. ఒవినో ఉహురులో సీసాన్ని కరిగించే పరిశ్రమని మూత పడేలా చేయడంలో సఫలమైనందుకు 2015లో గ్రీన్ నోబెల్ గా పిలవబడే గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారం గెలుచుకున్నారు.

    జూన్ 2020లో ఒవినో ఉహురు ప్రజలకి నూటముప్పై కోట్ల కెన్యా షిల్లింగ్స్, తన సంస్థకి డెబ్బై కోట్ల షిల్లింగ్స్ పరిహారం వచ్చేల పర్యావరణ కేసు గెలిచారు. ఆలాగే ఫైలిస్ లీగల్ ఖర్చులు కూడా వాపసు చెయ్యాలని కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ నేషనల్ ఎన్విరాన్మెంట్ మేనేజమేంట్ అథారిటీ వారు అప్పీల్ దాఖలు చేశారు

    > ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎన్నో అడ్డంకుల మధ్య తన స్థానాన్ని పునర్మూల్యాంకనం చేసుకుంటున్నట్టే ప్రకృతి కూడా ఈ పర్యావరణ సంక్షోభం నుండి కోలుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి కష్టాలని మహిళలు మాత్రమే అర్థం చేసుకోగలరు.

  • లాలే ఒస్మానీ

    ఆఫ్ఘనిస్తాన్ సామాజిక కార్యకర్త

    ఆఫ్ఘనిస్తాన్ లో ఒక మహిళా పేరుని పబ్లిక్ లో వాడటాన్ని హర్షించరు. జన్మధృవీకరణ పత్రంలో తండ్రి పేరు మాత్రమే రాయాలి. ఆ మహిళ పెళ్ళిచేసుకుకుంటున్నప్పుడు పెళ్లి శుభలేఖలలో తన పేరు ఉండదు, తనకి జబ్బుగా ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చీ ప్రిస్క్రిప్షన్ లో తన పేరు ఉండదు, తను చనిపోయినప్పుడు తన మరణధృవీకరణ పత్రంలో కూడా తన పేరు ఉండదు. చివరకి శ్మశానంలో తన జ్ఞాపకార్ధం పెట్టె సమాధిఫలకం మీద కూడా తన పేరు ఉండదు.

    మహిళలకి ప్రాధమిక హక్కులని కూడా నిరాకరించటంతో విసిగిపోయిన లాలే ఒస్మానీ వేర్ ఈజ్ మై నేం ప్రచారాన్ని ప్రారంభించారు. మూడేళ్ళ పోరాటం తరువాత జాతీయ ఐడి కార్డులలో, పిల్లల జన్మధృవీకరణ పత్రాలలో మహిళల పేర్లు నమోదు చెయ్యడానికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం 2020లో అంగీకరించింది.

    > ప్రపంచాన్ని మార్చి ఇంకాస్త మెరుగైన ప్రదేశంగా చెయ్యటంలో అందరికీ ఎంతోకొంత బాధ్యత ఉంది. మార్పు కష్టమే, అయితే అసాధ్యమేమీ కాదు. అతి సాంప్రదాయక దేశమైన ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో మహిళలు తమ అస్థిత్వం కోసం చేసిన పోరాటంలో ఈ విషయం మీరు గమనించవచ్చు.

  • రిధిమా పాండే

    ఇండియాపర్యావరణ కార్యకర్త

    వాతావరణ మార్పుకి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని భారత ప్రభుత్వం మీద తొమ్మిది సంవత్సరాల రిధిమా పండే కేసు వేశారు. 2019లో పదిహేను మంది ఇతర బాల పిటీషనర్స్ తో కలిసి ఐదు దేశాల మీద ఐక్యరాజసమితిలో కేసు వేశారు.

    రిధిమా ప్రస్తుతం అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొంటూ తమ భవిష్యత్తు గురించి, జీవవైవిధ్యం గురించి అన్ని స్థాయిలలోని విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నారు. రిధిమా తన భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు గురించి పనిచేస్తున్నారు.

    > మనం కలిసికట్టుగా ఉంటూ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మనం చెయ్యగలం అని చూపించాల్సిన సమయం ఇది. ఒక మహిళ తానూ ఏదైనా సాధించాలి అనుకుంటే తనని ఆపటం ఎవరి తరం కాదు.

  • లోర్ణ ప్రెన్డర్గాస్

    ఆస్ట్రేలియా డెమెన్షియా పరిశోధకులు

    మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి ఏజింగ్ విభాగంలో 90 సంవత్సరాల వయసులో మాస్టర్స్ పట్టా పొంది 2019లో లోర్ణ ప్రెన్డర్గాస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమె తన పట్టాని డెమెన్షియాతో బాధపడుతున్న తన భర్తకి అంకితం ఇచ్చారు. వారి వైవాహిక బంధానికి 64 ఏళ్లు.

    ఓ పరిశోదకురాలిగా లోర్ణ డెమెన్షియా రోగుల అవసరాలని లోతుగా అర్థం చేసుకోవటం, వారి జీవన విధానాన్ని మెరుగుపరచడం, వారిని చూసుకునేవారితో వారికుండే అనుబంధం గురించి ఆమె తెలుసుకున్నారు.

    > మీ వయసుతో సంబంధం లేకుండా మీరు ఈ ప్రపంచంలో మార్పుకి దోహదపడగలరు.

  • ఒక్సానా పుష్కినా

    రష్యా స్టేట్ డ్యూమా డిప్యూటీ

    ఒక్సానా పుష్కినా రష్యా స్టేట్ డ్యూమాలో కుటుంబ, మహిళల, పిల్లల వ్యవహారాల కమిటీ డిప్యూటీ వైస్-చైర్ఉమన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    2018లో స్టేట్ డ్యూమా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ లియోనాయిడ్ స్లట్స్కీ మీద పదుల సంఖ్యలో మహిళా పాత్రికేయులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళకి మద్దతుగా వచ్చిన ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యులు ఒస్కానా. 

    > ఈ సంవత్సరం ప్రపంచం ఎంతో మారిపోయింది. బాధ, సంక్షోభంతో నేను నేర్చుకున్న ఇంకొక విషయమేమిటంటే సరికొత్త సవాళ్ళు మనుషులలో ఉన్న అద్వితీయమైన నైపుణ్యాలని బయటకి తీసుకువస్తాయి.

  • సిబేలే రేసీ

    బ్రెజిల్ ఉపాధ్యాయురాలు

    సావ్ పాలోలో ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకి జాతి సమానత గురించి శిక్షణ ఇవ్వటంలో పదవీ విరమణ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిబేలే కొత్త ఒరవడిని సృష్టించారు.

    తన పాఠశాల నిర్వహణని సమీక్షించి జాతి, లింగం, స్థానం అనే బేధాలు లేకుండా అక్కడ పనిచేసేవారందరికీ పని ప్రదేశాన్ని సమ్మిళిత ప్రదేశంగా చేశారు.

    > ఈ సంవత్సరం మార్పు కోసం సమాజానికి మనం అందించే తోడ్పాటు గురించి మనలోకి మనం తరిచి చూసుకునే పరిస్థితి కలిపించింది. రాబోయే సంవత్సరంలో మన ముందుకి వచ్చే మార్పుకి సంబంధించిన సవాళ్ళని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని సరిపడా సేకరించాము అని ఆశిస్తున్నాను.

  • సుసానా రఫ్ఫాలి

    వెనిజులా పోషకాహార నిపుణులు

    సుసానా 22 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలలో తన సేవలు అందించిన హ్యూమన్ యాక్టివిస్ట్. వెనెజ్వెలా సంక్షోభ సమయంలో ఆ ప్రభావం పిల్లల మీద రియల్ టైంలో ఏ విధంగా ఉంది అని తెలిపే సాధనం ఒకదానిని అభివృద్ధి చెయ్యడానికి కారిటాస్ డీ వెనెజులాకి సహకారం అందచేశారు. ఆ సమయంలో అక్కడ సంక్షోభం ఉండనే విషయాన్నే ఒప్పుకోవటం లేదు అక్కడివాళ్ళు. సుసానా స్లమ్స్ లో ఉంటున్న పిల్లలకి పోషకాహారం అందచేసే కేంద్రాలని స్థాపించటంలో తోడ్పాటు అందించారు.

    ఈ సంవత్సరం కోవిడ్ సమయంలో యువ ఖైదీలకి, అల్పాదాయ వర్గాలకి, హెచ్ ఐ వి ఉన్న మహిళలకి ఆహర సదుపాయం అందచేసే విషయం మీద పనిచేశారు. స్కేలింగ్ అప్ న్యూట్రీషన్ మూవ్మెంట్ తో పనిచేస్తూ కోవిడ్ సమయంలో మధ్య అమెరికా ప్రాంతంలో ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు పోషకాహారం అవసరాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం గురించి తన సలహాలు అందచేశారు.

    > మీలోకి మీరు చూసుకుని అక్కడ నుండి మీ విముక్తిని సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టండి. అది నిజమైన లాక్డౌన్.

  • సపనా రోకా మగర్

    నేపాల్ శ్మశానవాటిక నిపుణులు

    మూడు నెలలు పాటు నిరాశ్రయురాలుగా ఉన్న తర్వాత సపనా ఖాట్మండుకి వెళ్లి ఎవరూ పని చేయడానికి పెద్దగా ఇష్టబడని శవాలని దహనం చేసే సంస్థలో పనిచెయ్యడం మొదలుపెట్టారు.

    కోవిడ్ కారణంగా చనిపోయిన వారి శవాలను నేపాల్ సైన్యం మాత్రమే దహనం లేదా ఖననం చేస్తుంది. సపనా పనిచేస్తున్న సంస్థ వదిలివేయవబడిన శవాలను వీధుల నుండి లేదా మార్చురీ నుండి తీసుకుని శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది. ఒక శవాన్ని తీసుకోవటానికి ముప్పై ఐదు రోజుల పాటు ఎవరూ రాకపోతే ఈ సంస్థే వాటిని శ్మశానానికి తీసుకువచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తుంది. హిందూ సంసృతిలో కొడుకు ఈ ఈ తంతు నిర్వహిస్తాడు.

    > ప్రపంచంలో వదిలివేయబడిన, నిరాశ్రయులు అయినా వారు ఎంతోమంది ఉన్నారు. వీధులలో చనిపోయినవారు కూడా అంతిమ సంస్కారాలకి నోచుకోవాలి. నేను ఈ పని సమాజ సేవ కోసం చెయ్యటం లేదు. నా ప్రశాంతత కోసం చేస్తున్న పని ఇది.

  • పార్దిస్ సబేటి

    ఇరాన్ కంప్యుటేషనల్ జన్యు శాస్త్ర నిపుణులు

    పర్దిస్ సబేటి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో, ఎం ఐ టి అలాగే హార్వార్డ్ వారి బ్రాడ్ ఇన్స్టిట్యూట్, హోవార్డ్ హ్యూజ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ లలో ప్రొఫెసర్. మానవ, సూక్ష్మజీవుల జెనోమిక్స్ ని అర్థం చేసుకోవటంలో, ఇన్ఫర్మేషనల్ థియరీ, గ్రామీణ అంటూ వ్యాధుల మీద నిఘా, అలాగే పశ్చిమ ఆఫ్రికాలో విద్య అవకాశాలలో తన తోడ్పాటు అందించారు.

    2014లో ఎబోలా వైరస్ ని ఎదుర్కున్న బృందం లో ఈవిడ ఒకరు. టైం మ్యాగజైన్ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు, అలాగే ఆ మ్యాగజైన్ వారి 100 మోస్ట్ ఇన్ఫ్లుఎన్షియల్ జాబితాలో కూడా చోటు సంపాదించారు. ఎగైనెస్ట్ ఆల్ ఓడ్స్ అనే ఒక విద్యావంతమైన వీడియో సిరీస్ హోస్ట్ కూడా. అలాగే థౌజండ్ డేస్ అనే రాక బ్యాండ్ లో ప్రధాన గాయని.

    > మనం ఎదుర్కునే సవాళ్ళు ద్వారానే సంఘీభావం ఏర్పరుచుకుంటాము. మెరుగైన ప్రపంచం కోసం మనం చేసే ఈ పోరాటంలో నలుగురితో కలివిడిగా ఉండటమే మన విజయానికి సోపానం.

  • ఫెబ్ఫీ సేత్యావతి

    ఇండోనేషియా సామాజిక కార్యకర్త Febfisetyawati

    ఫెబ్ఫీ సేత్యావతి Untukteman.id అనే సంస్థ వ్యవస్థాపకురాలు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంస్థ సహాయపడుతుంది. తను, తన బృందం వోక్స వ్యాగన్ క్యాంపర్ వ్యానులో చుట్టూ తిరిగి విద్యార్ధులు తమ చదువు కొనసాగించుకునేదానికి ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కలిపించారు. నిజానికి ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఈ బృందం ఇంటర్నట్ సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ ట్రాన్స్మిటర్లు అందచేసే ప్రయత్నాలలో ఉంది. 

    తన కొడుకు ఆకారా హాయ్కల్ మోయిబస్ సిండ్రోమ్ అనే అరుదైన నరాల జబ్బుతో చనిపోయినప్పుడు తానూ అనుభవించిన వేదనే ఇతరులకి సహాయం చేయటానికి ఫెఫ్బిని పురగొల్పింది.

    > ఈ సంవత్సరం ప్రపంచం చాల మారింది. ప్రపంచంతో పాటు మనమూ మారాలి. అన్నిటి గురించి ఫిర్యాదు చేసే బదులు మనం చెయ్యగలిగినంత చెయ్యటం ఉత్తమం.

  • రూత్ షేడీ

    పెరూ పురాతత్వ శాస్త్రవేత్త

    రూత్ షేడీ పురాతత్వ శాస్త్రంలో, మానవ శాస్త్రంలో పిహెచ్.డి పట్టా పొందారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ శాన్ మార్కోస్ లో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో పరిశోధన విభాగం వైస్-డీన్ గా పని చేస్తున్నారు. కరల్ ఆర్కియోలోజికల్ సైట్ దగ్గర మల్టీడిసిప్లినరీ పరిశోధన విభాగం డైరక్టర్ గా కూడా ఉన్నారు. ఈ ప్రదేశం అమెరికా ఖండంలో పురాతనమైన నాగరిక ప్రదేశంగా చెబుతున్నారు.

    పెరూలోని ఐదు విశ్వవిద్యాలయాల ఈమెకి గౌరవ డాక్టరేట్లు అందించాయి. 2018లో ఉమెన్ ఇన్ సైన్స్ విభాగంలో ఎల్ ఓరియల్-యునెస్కో జాతీయ పురస్కారం పొందారు. అలాగే రిపబ్లిక్ ఆఫ్ పెరూ మెడల్ ఆఫ్ హానర్ పురస్కారం కూడా పొందారు.

    > మార్పుకి దోహదపడే పనులలో మహిళలు పాలుపంచుకోవాలి. అలాగే మనుషులందరూ సఖ్యతతో, ప్రకృతితో సమతౌల్యతతో జీవించే సమాజాన్ని నిర్మించే పనిలో కూడా భాగస్వాములు అవ్వాలి.

  • పనుసాయ సిథిజిరావట్టనకుల్

    థాయిలాండ్ విద్యార్ధి నాయకులు 

    ఈ సంవత్సరం థాయిలాండ్ ని ప్రజాస్వామ్య ఉద్యమాలు ముంచేత్తాయి. 22 సంవత్సరాల పనుసాయ లాంటి విద్యార్ధులు అందులో ముందు వరసలో ఉన్నారు. వాటిలో పాల్గొన్నందుకు ఆమెతో సహా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జామీను మీద విడుదల చేశారు.

    ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ప్రసారమైన లైవ్ విడియోలో నలుగురు మఫ్టీలో ఉన్న పోలీసులు తనని తన హోటల్ గది గచ్చు మీద నుండి వీల్ చైర్ లోకి ఎక్కించి పోలీసు వాహనం వరకు ఆ వీల్ చైర్ ని తోసుకువెళ్ళటం కనిపించింది. దేశద్రోహంతో సహా తన మీద మోపిన ఆరోపణలని పనసూయ ఖండించారు.

    ఆగస్ట్ నెలలో ఒక విద్యార్ధి ర్యాలీలో వేదికేక్కి నేడు బాగా ప్రసిద్ధి చెందిన పది పాయింట్ల మేనిఫెస్టోని చదివి వినిపించింది. రాచరికం రాజకీయాలలో తలదూర్చటం మానుకోవాలి అనేది ఆ మేనిఫెస్టో ముఖ్యమైన డిమాండ్. తన చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. రాచరికాన్ని విమర్శిస్తే క్రిమినల్ పరువు నష్ట దావా వేసే అవకాశం ఉన్న అతికొద్ది దేశాలలో థాయిలాండ్ ఒకటి. రాజు కానీ, రాణిని కానీ, వారసులుని కానీ, వారసుల ప్రతినిధిని కాని విమరిస్తే థాయిలాండ్ చట్టం ప్రకారం పదిహేను సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

    > ప్రతి ఒక్కారు ప్రపంచాన్ని మార్చగలిగేవారే. మీరెవరో, మీరేం చేస్తారో అనవసరం. ఆత్మవిశ్వాసంతో ఉండండి, మీ జీవితాన్ని విలువైనదిగా చేసుకోండి.

  • నస్రిన్ సొతౌదేహ్

    ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త

    నస్రిన్ సోతౌదేహ్ ఇరాన్లో న్యాయవాది. చట్టబద్ద పాలన కోసం, రాజకీయ ఖైదీల హక్కుల కోసం, విపక్షాల కార్యకర్తల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, బాలల హక్కుల కోసం పోరాడుతున్నారు. తీవ్ర విమర్శకు గురవుతున్న ఇరాన్ దేశపు న్యాయ వ్యవస్థకి ఎదురొడ్డి నిలబడినందుకు ఆమెకి జైలు శిక్ష విధించారు. ఇప్పుడు తన శిక్ష నుండి తాత్కాలిక సెలవులో ఉన్నారు.

    తనని జైలులో పెట్టినా, కుటుంబ సభ్యులని బెదిరించినా కూడా సొతౌదేహ్ చట్టబద్ధ పాలన గురించి ధైర్యంగా పోరాడుతున్నారు.

    > ఇరాన్ లో హిజబ్ తప్పనిసరి. ఈ అరమీటర్ గుడ్డని మా మీద రుద్దగలిగారంటే మాతో ఏమి కావాలంటే అది చెయ్యగలరు వీళ్ళు.

  • కాథీ సుల్లీవన్

    యుఎస్ శాస్త్రవేత్త/వ్యోమగామి

    కాథీ సుల్లీవన్ పేరు పొందిన శాస్త్రవేత్త, వ్యోమగామి, రచయిత, కార్యనిర్వహణాధికారి. 1978లో నాసా వ్యోమగామి బృందంలో చేరిన ఆరుగురు మహిళలలో ఈవిడ ఒకరు. అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ మహిళగా ఈవిడ చరిత్ర సృష్టించారు.

    సముద్రంలోని లోతైన పాయింట్ కి డైవ్ చేసిన మొదటి మహిళ కూడా ఈవిడే. తన అంతరిక్ష ప్రయాణం, సముద్ర ప్రయాణం కారణంగా "ప్రపంచంలోకెల్లా అత్యంత నిటారైన మనిషి" అని పేరుపొందారు.

    > ఈ సంవత్సరం ప్రపంచం చాలా మారింది. ఈ భూమి మీద అన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపది ఎలా జీవిస్తున్నాయి అనే విషయం మనకి బాగా అర్థమయ్యింది. మనకి నిజంగా కావలసింది ఏమిటి, విలువైనది ఏమిటి అని మనం మళ్ళీ ఆలోచించేలా చేసింది.

  • రీమా సుల్తానా రిము

    బంగ్లాదేశ్ ఉపాధ్యాయురాలు

    రీమా సుల్తానా రిము యంగ్ ఉమెన్స్ లీడర్స్ ఫర్ పీస్ ఇన్ కాక్సస్ బజార్, బంగ్లాదేశ్ సభ్యులు. ఈ సంస్థ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ పీస్ బిల్డర్స్ భాగస్వామి. సంక్షోభ ప్రభావిత దేశాల యువ మహిళలని శాంతి కపోతాలుగా, నాయకులుగా తయారు చేయటం ఈ సంస్థ లక్ష్యం.

    రోహింజ్యా శరణార్ధుల సంక్షోభానికి స్పందించిన రీమా లింగ ఆధారిత మానవతా దృక్పధాన్నిప్రచారం చేస్తున్నారు. రోహింజ్యా శరణార్ధులలో విద్యకి వెసులుబాటు లేని మహిళల, బాలికల కోసం లింగ ఆధారిత, వయసు ఆధారంగా విద్యా బోధన నిర్వహిస్తున్నారు. ఐక్యరాజసమితి నిర్ణయాల- ముఖ్యంగా మహిళలలు, శాంతి, భద్రతకి సంబంధించినవి- గురించి రేడియో, నాటక ప్రదర్శనల ద్వారా తన సమాజంలో అవగాహన కలిపిస్తున్నారు.

    > బంగ్లాదేశ్ లో లింగ సమానత్వం తీసుకురావాలని నా అభిలాష. మన హక్కుల కోసం పోరాటంలో బాలికల, మహిళల పాత్రం పట్ల నాకు నమ్మకం. మనం సఫలం చెందుతాము.

  • లీ టి

    బ్రెజిల్ ట్రాన్స్ జెండర్ మోడల్ leat

    తమ మొదటి ఉద్యోగం గివెంచీతో అని చెప్పుకోగలిగే మోడల్స్ సంఖ్య చాలా తక్కువ. అయితే లీ టికి అదికుదిరింది . ఆమె పదేళ్లకు పైగా ఆమె ఆ బిజినెస్ లో ఉన్నారు. మేరీ క్లారీ, గ్రాజియా, వోగ్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లు లీ గురించి ప్రస్తుతిస్తూ ప్రస్తావించాయి.

    2016 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో పాల్గొన్న తొలి ట్రాన్స్ జెండర్ గా కూడా లీకి పేరు ఉంది. ట్రాన్స్ జెండర్ అనుకూల వాదానికి లీ ఓ పాప్ కల్చర్ ఐకాన్ అని చెప్పవచ్చు. ఎల్జీబీటీ సమూహాలపై చూపే వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటం, వివక్ష చూపడాన్ని మానుకోవాలని సమాజానికి పిలుపివ్వటం వంటి కార్యక్రమాలు లీ చేస్తుంటారు. తనలాంటి వారికి తమ తమ కలలు సాకారం చేసుకునేలాగా లీ ప్రేరణ ఇస్తుంటారు.

    > ప్రపంచం ఎప్పుడూ మారూతునే ఉంటుంది. మనం ఆ మార్పులో ఎప్పుడూ భాగమే. అయితే మహిళలు ఒకొక్కరుగా ఆ పని చెయ్యలేరు.

  • అనా టిజౌక్స్

    ఫ్రాన్స్ సంగీతకారిణి

    అనా టిజౌక్స్ చిలీ దేశపు హిప్-హాప్ నిరనసకారులు. స్త్రీవాదిగా, కార్యకర్తగా రచనల్లో సామాజిక, సాంస్కృతిక వైషమ్యాలను ఖండిస్తూ వస్తుంటారు. చిలీలో ఔగుస్టో పినోషెట్ నియంతృత్వ పాలనలో అనా తల్లితండ్రులు దేశం వదిలి పెట్టి వెళ్ళిపోయారు. అందుకే ఆమె చేస్తున్న పనిలో సామాజిక, రాజకీయ అంశాల పట్ల సానుభూతి కనిపిస్తుంటుంది.

    తన వెంగో ఆల్బంలో యాంటీ పేట్రీయార్క్ గీతం ద్వారా మహిళల హక్కులకి మద్దతు లింగ ఆధారిత హింసకి వ్యతిరేకత ప్రకటించారు. ప్రపంచంలోని అసమానతకి, అణిచివేతకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో టిజౌక్స్ తరుచుగా పాల్గొంటుంటారు.

    > ఈ ఆర్ధిక వ్యవస్థ ఎంత బలహీనమైనదో ఈ సంవత్సరం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఈ పరిస్థితుల్లో మన బలం మన బంధాలే. ఈ బంధాలలోనే మన విలువ, మన బలం ఉందన్న విషయాన్ని మనమెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

  • ఓపల్ టోమేటీ

    యుఎస్ మానవ హక్కుల కార్యకర్త

    ఓపల్ టోమేటీ పలు పురస్కారాలు పొందిన మానవ హక్కుల కార్యకర్త, బ్లాక్ లైవ్స్ మేటర్ ముగ్గురు వ్యవస్థాపకులలో ఒకరు. డయాస్పోరా రైజింగ్ అనే న్యూ మీడియా సంస్థ వ్యవస్థాపకులు కూడా.

    నైజీరియా నుండి అమెరికా వలస వచ్చిన కుటుంబంలో జన్మించారు ఓపల్. తన యాక్టివిజానికి సరిహద్దులు లేవు. ఇరవై సంవత్సరాల నుండి ఇదే పనిలో ఉన్నారు.

    > ఒక నిజమైన మేల్కొలుపు కలిగింది ఈనాడు. జరుగుతున్న అన్యాయంతో మాకు సంబంధం లేదు అని అన్నామంటే ఆ అన్యాయంలో మనకూ భాగస్వామ్యం ఉందని ఈ రోజు మనందరికీ తెలుసు. అందరూ ధైర్యంగా ఉండాలని, తమ పనికి కట్టుబడి ఉండాలని, తమ వాళ్ళతో బంధాలు ఉంచుకోవాలని నేను అందరికీ చెబుతాను.

  • స్వియత్లానా సిహానౌస్కాయ

    బెలారస్ రాజకీయ నాయకులు

    స్వియత్లానా సిహానౌస్కాయ బెలరాస్ అధ్యక్ష పదవికి పోటి చేశారు. అక్కడ ఈవిడ ప్రజాస్వామ్య ఉద్యమం నడిపారు. ఆగస్ట్ 2020లో అధ్యక్షులు అలెగ్జాండర్ లుకాషెన్కో తానూ భారీ మెజారిటీతో గెలుపొందానని ప్రకటించుకున్నారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రిగ్గింగ్ కి పాల్పడ్డారు అనే ఆరోపణలు భారీ స్థాయిలో వచ్చాయి.

    ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకి తన పిల్లల భద్రత దృష్ట్యా స్వియత్లానా బెలారస్ వదిలి లిథుయానియాకి వెళ్ళిపోయారు. అక్కడ నుండే ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడుపుతున్నారు.

    > మీరు బలహీనులు అని ఎవరు చెప్పినా కూడా ఒక్క క్షణం కూడా నమ్మకండి. మనం ఎంత బలవంతులమో చాలా సార్లు మనమే తెలుసుకోము.

  • యులియా స్వెత్కోవా

    రష్యా సామాజిక కార్యకర్త

    యులియా స్వెత్కోవా రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఒక చిన్న పారిశ్రామిక పట్టణంలో పుట్టారు. అక్కడే కళలు, నృత్యం, దర్శకత్వం విభాగాల్లో విద్యనభ్యసించారు.ఆ తరువాత థియేటర్ & కమ్యూనిటీ సెంటర్లో యాక్టివిస్ట్ గా పని చేశారు. మహిళల హక్కులకు సంబంధించిన అంశాలను లేవనెత్తడం,ఎల్ జి బి టి హక్కుల కోసం, పర్యావరణం కోసం, మిలటరిజానికి వ్యతిరేకంగా పని చెయ్యటం మొదలుపెట్టారు.

    స్వెత్కోవా అశ్లీల చిత్రాలని పంచుతున్నారని, "ఎల్ జి బి టి ప్రచారం" చేస్తున్నారని 2019లో ఆమెపై కేసులు పెట్టారు. మహిళా శరీరానికి సంబంధించిన రేఖాచిత్రాలని ఇంటర్నెట్ లో షేర్ చేశారన్న నెపంతో ఆమెపై ఆరేళ్ల జైలు విధించే అవకాశం ఉన్న కేసును ఎదుర్కొంటున్నారు..రష్యాలోని మానవ హక్కుల సంస్థలు ఆమెను రాజకీయ ఖైదీగా గుర్తించాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ఆమె ఖండిస్తున్నారు.

    > ప్రభుత్వం ,సహచరులు, లేదా సమాజం ఎవరి నుంచైనా వచ్చే వేధింపులని ఎప్పుడూ సహించవద్దు. ప్రపంచాన్ని మార్చే బలం, శక్తి మీకున్నాయి. పరిస్థితులు ఎంత గడ్డుగా అయినా ఉండనివ్వండి కలలు కంటూనే ఉండండి, పోరాడుతూనే ఉండండి.

  • అరుస్సి ఉండా

    మెక్సికో ప్రచారకర్త

    మెక్సికోలో ఫెమిసైడ్ రేటు పెరుగుతుండడంతో అరుస్సి, ఆమె నడుపుతున్న స్త్రీవాద సంస్థ కలెక్టివ్ 'బ్రుజాస్ డేల్ మర్ (విచేస్ ఆఫ్ ది సీ) అక్కడ మహిళలకు గళమెత్తే అవకాశం కల్పించాయి.

    ఈ ఏడాది మార్చి 9నాడు దేశవ్యాప్త సమ్మె చెయ్యటానికి మహిళలకి ప్రేరణగా నిలిచారు. ఆ రోజు ఆ దేశ మహిళలంతా పని మానేసి ఇంట్లో ఉన్నారు.

    > "విప్లవం స్త్రీవాద విప్లవం అవుతుంది", " భవిష్యత్తు స్త్రీవాదానిదే" లాంటి ఎన్నో నినాదాలు ఈ రోజు ఉన్నాయి. అయితే భవిష్యత్తు ఇప్పటికే ఇక్కడ ఉంది. మనం ధైర్యంగా ఉంటూ పైకి ఎదుగుతూనే ఉండాలి.

  • అనస్తాసియ వోల్కొవా

    ఉక్రెయిన్ వాణిజ్యవేత్త

    డాక్టర్ అనస్తాసియ వోల్కొవా ఎంటర్ప్రెన్యూయెర్, వ్యవసాయ ఇన్నోవేటర్. సైన్స్, సాంకేతికతలని వాడుకుని ఆహార భద్రత మీద పని చేస్తున్నారు.

    2016లో ఫ్లోరోశాట్ అనే సంస్థి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ డ్రోన్స్, శాటిలైట్ డేటా, ఆల్గోరిథమ్స్ , ఇతర సాధనాలని వాడుకుని రైతులు తమ పంట ఉత్పత్తిని తమకి అనుకూలంగా చేసుకునే విధంగా వారికి సహాయం చేస్తున్నది.

    > ఈ ప్రపంచంలో మీరేమి మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మీరే అవ్వండి. మనమందరం మన మన మార్గాలు తెలుసుకుని ఒక సానుకూల మార్పు తీసుకురాగలమని ఆశిస్తున్నాను.

  • కొత్చకోర్న్ వొరాఖోం

    థాయిలాండ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ kotch_voraakhom

    కొత్చఖోం వొరాఖోం తనని తాను "బ్యాడాస్ థాయ్ అర్బన్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్" గా అభివర్ణించుకుంటారు. బ్యాంకాక్లో విస్తరిస్తున్న నగర "చీలికల పేవ్మెంట్" ని తొలిచి అందులోనుండి సరికొత్త ఆలోచనలు మొలకలేత్తే లాగ చెయ్యటమే తన లక్ష్యంగా పని మొదలుపెట్టారు.

    ప్రస్తుతం ఆమె పబ్లిక్ ప్రదేశాలని నిర్మాణాత్మకమైన పనులకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. పెద్ద పెద్ద నగరాలు వాతావరణ మార్పుని తట్టుకునేందుకు అవసరమైన పార్క్ సీజ్డ్ క్రాక్స్ ను అభివృద్ధి చేస్తున్నారు.

    > నగరమే మునిగిపోతున్నప్పుడు ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ ఉంటె మాత్రం ఏమి లాభం? మనం మరింతగా అభివృద్ధి పధంలోకి వెళ్ళేముందు వాతావరణ మార్పుని పరిగణలోకి తీసుకోవాలి. అంతే కానీ మా ప్రాంతం, మా ప్రదేశం, మా దేశం అని గిరి గీసుకుని కూర్చుంటే సరిపోదు. ఒకే సమైఖ్య ప్రపంచంలాగా ఉండాలి, పని చెయ్యాలి. ఈ భూమే మన ఇల్లు. దీనిని సరిదిద్దాలంటే ఒకటిగా పనిచెయ్యటమే మార్గం.

  • సూజీ వైల్స్

    బ్రిటన్ శాస్త్రవేత్త

    కోవిడ్ సమయలో న్యూజీలాండ్ లో ప్రముఖ పాత్ర పోషించిన సూజీ శాస్త్రవేత్త, ప్రజారోగ్యవేత్త. కార్టూనిస్ట్ టోబీ మారిస్ తో కలిసి కోవిడ్ వెనకాల ఉన్న సైన్స్ ని ప్రచారం చేశారు. అందులో బాగా పేరుపొందినవి " ఫ్లాటెన్ ది కర్వ్ " అనే విజువల్. ఇది అనేక భాషలలోకి అనువాదం అయ్యింది. అలాగే అనేక ప్రభుత్వాలు లాక్డౌన్ గురించి ప్రజలకి వివరించటానికి దీనిని వాడుకున్నాయి.

    ఈవిడ ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో బయోలుమినిసెంట్ సూపర్బగ్స్ ల్యాబ్ ని నడిపిస్తున్నారు. ఆమె బృందం ఇక్కడ చీకటిలో సూక్ష్మజీవులు వెలిగేలా చేస్తున్నారు. సూక్ష్మజీవులు మనల్ని ఎలా రోగాలపాలు చేస్తాయో, వాటికి మందులు ఏమిటో కనుక్కోవటానికే ఆమె ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.

    > ఒకరినొకరు ఈ కోవిడ్ నుండి కాపాడుకోవటానికి కొన్ని దేశాలలో ప్రజలు కలిసికట్టుగా పనిచేశారు. ఇటువంటి వాటిని చూస్తే ఎంత పెద్ద సవాలునైనా కరుణతో, సమిష్టి చర్యలతో ఎదుర్కోవచ్చు అని మనకి అర్థమవుతుంది.

  • ఎలిన్ విలియమ్స్

    వేల్స్, బ్రిటన్ డిస్ ఏబుల్డ్ బ్లాగర్

    ఎలిన్ ఒక రచయిత, వికలాంగుల హక్కుల కార్యకర్త. మైలాజిక్ ఎన్సిఫాలోమయేలిటిస్, రేటినిటిస్ పిగ్మెన్టోసా వ్యాధులతో కాలం వెళ్లదీస్తున్నారు. తన అనుభవాలని తన బ్లాగ్ లో- మై బ్లర్డ్ వరల్డ్- పదహారు ఏళ్ళ వయసప్పటి నుండి రాస్తున్నారు.

    తన అనుభవాల గురించి నిజాయితీగా రాస్తారు. సలహాల దగ్గర నుండి తన పరిస్థితులు తన మీద చూపించే మానసిక ప్రభావం, సమాజంలో తాను ఎదుర్కునే అడ్డంకులు, ఫ్యాషన్ పరిశ్రమలో అంగవైకల్యం కలవారికి అవకాశాలు గురించి రాస్తుంటారు. రాసే ప్రతిదాంట్లో ఒక ఆశావాహ దృక్పధం ఉంటుంది. నలుగురిలో అవగాహన పెంపొందించేవిధంగా, ఇలాంటి సమస్యలే ఉన్నవారు ఒంటరి కాదు అనే భావన పెంపొందించే విధంగా రాస్తారు.

    > మీ సృజనాత్మకత, ఆలోచనలు, బాధ, ఆనందం అన్ని వెల్లడి చేయగల ఒక దారి ఎందుకోండి. మీకు మాత్రమే సొంతమైనది మీకే సొంతమవ్వాలి. బయటి శక్తులేవి దానిని ప్రభావితం చెయ్యనివ్వకూడదు.

  • ఆలిస్ వాంగ్

    యుఎస్ వికలాంగుల హక్కుల కార్యకర్త

    ఆలిస్ డిజెబిలిటీ విజిబిలిటీ ప్రాజెక్ట్ ని స్థాపించారు. అంగవైకల్యం కలవారు తమ కథలని రికార్డ్ చేసే విధంగా వారిని ప్రోత్సహించే క్షేత్రస్థాయి ప్రాజెక్ట్ ఇది.

    ఈ సంవత్సరం ఈవిడ 'డిజెబిలిటీ విజిబిలిటీ: ఫస్ట్ పర్సన్ స్టోరీస్ ఫ్రం ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' అనే సంపుటిని ప్రచురించారు.

    > ఈ సంవత్సరం ప్రపంచం చాలా మారిపోయింది. పరిస్థితులు తిరిగి "సాధారణ స్థితికి " వెళ్ళకూడదు అని నేను కోరుకుంటున్నాను.

  • లియో యీ-సిన్

    సింగపూర్ వైద్యులు

    డాక్టర్ లియో యీ-సిన్ సింగపూర్ కి చెందిన అత్యాధునికమైన నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ని నడుపుతారు. అంటువ్యాధులు ప్రబలినప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద ఈ సెంటర్ పనిచేస్తుంది.

    కోవిడ్ మీద యుద్ధం చెయ్యటంలో ముందు వరసలో ఉండటమే కాకుండా ఈమె చాలా దశాబ్దాలు సింగపూర్ లో హెచ్ఐవి సంరక్షణని మెరుగుపరచటం మీద పనిచేశారు. అంతేకాక సార్స్ లాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని ఎదుర్కునే బృందాలకి నాయకత్వం వహించారు. తన వృత్తితో పాటు ముగ్గురు పిల్లల తల్లి కూడా ఈవిడ.

    > కోవిడ్ అందరి జీవితాలని మార్చివేసింది. అయితే మహిళా నాయకత్వం అవసరాన్ని మార్చలేదు. ఈ వైరస్ తో పోరాడుతున్న వారిలో ముందువరసలో మహిళలే ఉన్నారు. ఆ పని వారు చాలా ధైర్యంతో చేస్తున్నారు.

  • మిషెల్ యేఓ

    మలేసియా నటి michelleyeoh_official

    "పురుషుల ప్రపంచం" అయిన హాంగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రాలలో తన సొంత స్టంట్లు చేస్తూ మిషెల్ సినీ ప్రపంచంలోకి దూసుకువచ్చారు. తరువాత హాలీవుడ్ లోకి అడుగుపెట్టి బాండ్ గర్ల్ ( టుమారో నెవర్ డైస్) పాత్ర చేశారు. ఆసియా నుండి అమెరికాలో దీర్ఘకాలంగా విజయవంతమైన కెరీర్ ఉన్న అతి కొద్ది నతీమణుల్లో ఈవిడ ఒకరు.

    ఈ పరిశ్రమలో ముప్పై సంవత్సరాలకి పైగా ఉన్నాకా ఇప్పుడు మిషెల్ కి కొత్తగా వస్తున్నా అవతార్ సినిమాలలో, మొదటిసారిగా ఆసియా సూపర్ హీరో నేపధ్యంలో వస్తున్న మార్వేల్ సినిమా- షాంగ్-ఛి-లో లాభదాయకమైన పాత్రలు లభిస్తున్నాయి. హాలీవుడ్ లో ఆసియా వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందని ఈవిడ తరుచుగా చెబుతుంటారు. 2030 కల్లా పేదరికాన్ని అంతం చెయ్యాలి అనే ఐక్యరాజసమితి లక్ష్యానికి రాయబారిగా ఉన్నారు.

    > కోవిడ్ ప్రభావం మనందరి మీద ఉంది. అయితే కోవిడ్ కష్టాలన్నీ మహిళలు పడుతున్నారు. మనం ఒంటరి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒంటరిగా అనిపిస్తుంటే సహాయం కోసం చూడాలి. అలా సాయం చేసేవాళ్ళు ఉండటం ఇప్పుడు చాలా అవసరం.

  • ఐషా యెసుఫు

    నైజీరియా సామాజిక కార్యకర్త

    ఐషా యెసుఫు నైజీరియాలో సామజిక కార్యకర్త. తన దేశంలో సుపరిపాలన కోసం డిమాండ్ చేస్తున్నారు.

    2014లో బోకో హరాం మిలిటెంట్ సంస్థ నైజీరియాలోని చిబోక్ లో ఒక సెకండరీ పాఠశాల నుండి రెండు వందల మంది బాలికలని అపహరించిన ఘటన తరువాత ఏర్పడిన బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్ ఉద్యమానికి ఈమె కో-కన్వీనర్. "ఎండ్ సార్స్" ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం సందర్భంగా నైజీరియన్ పోలీస్ ఫోర్స్ లో జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి ఆ దేశవాసులు రోడ్ల మీదకి వచ్చారు. సామాన్యులని హత్య చేశారు, అత్యాచారం చేశారు, దోపిడీ చేశారు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదాస్పద స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్ (సార్స్) ని రద్దు చెయ్యాలి అనేది ఈ ఉద్యమం ప్రధాన డిమాండ్ లలో ఒకటి.

    > ఈ ప్రపంచంలో తమ భాగాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా మహిళలు తీసుకోవాలి అని నేను ఇచ్చే సలహా. తమకి భాగం కలిపించాలి అని అడగటం ఆపేసి తామే కొత్త భాగాన్ని సృష్టించాలి.

  • గుల్నాజ్ జుజ్బేవా

    కిర్గిస్థాన్వికాలంగుల హక్కుల కార్యకర్త gulnazzhuzbaeva

    కిర్గిస్థాన్ లో ఐదు వేల మందికి పైగానే చూపు సరిగ్గా లేని వారు ఉన్నారు. అయితే ఈనాటికి ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలు వారి అవసరాలకి తగ్గట్టు ఉండటం లేదు. గుల్నాజ్ జుజ్బేవా కిర్గిజ్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ అనే సంస్థని స్థాపించారు. బ్రెయిలీ లిపిలో చూపు సరిగ్గా లేని వారికి పత్రాలు అందుబాటులో ఉంచడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.

    ఉద్యోగ విపణిలోకి అడుగుపెట్టడానికి చూపు లేని వారికి తన బృందం అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ ఇస్తుంది. 2020లో 22 మంది వయోజనులు ఈ ప్రోగ్రాం పూర్తి చెయ్యగా అందులో ఆరుగురుకి ఇప్పటికే ఉద్యోగాలు రాగా మరో ఇద్దరు చదువుకోవటానికి విశ్వవిద్యాలయంలో చేరారు.

    > జీవితం ఒక ముళ్ళబాట. జరిగినదానిని జరిగినట్టు తీసుకోండి

100 మంది మహిళల ఎంపిక ఎలా జరిగింది?

బీబీసీ వరల్డ్ సర్వీసెస్‌కు చెందిన వివిధ భాషల బృందాలు సూచించిన పేర్లను 'బీబీసీ 100 మంది మహిళా మణులు' టీమ్ పరిశీలించి తుది జాబితాను రూపొందించింది. గత 12 నెలల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ముఖ్యమైన కథనాలకు ప్రేరణగా నిలిచిన వారి కోసం మేం అన్వేషించాం. అలాగే, వార్తల్లోకి ఎక్కకపోయినప్పటికీ తమ విశిష్ట కృషి ద్వారా ఇతరులను ప్రభావితం చేసి, స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలు ఎవరెవరన్నది కూడా పరిశీలించాం. అలా ఎంపిక చేసిన పేర్లను 'మార్పును సాధ్యం చేసిన మహిళలు' అనే ఈ ఏడాది అంశంతో కలిపి చూశాం. తుది జాబితా రూపొందించే ముందు నిష్పాక్షికంగా ఉండేందుకు ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సరి చూసుకున్నాం.

line

ఫొటోల కాపీరైట్లు: యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, కిమ్ సూహైయాన్, క్వాక్ డట్, రచాటా సాంగ్క్రోడ్, ఫీ-గ్లోరియా గ్రోయెనెమేయర్, రక్యాన్ బ్రమాస్టో, ఎన్‌సీఐడీ, థామస్ లాయిస్నే, నండార్, కుంజన్ జోషి, షాజన్ సామ్, షాబాజ్ షాజి, అక్స్‌కిమియా, అరాష్ అషోరినియా, యూఎన్‌హెచ్‌సీఆర్, నాన్సీ రాషెడ్, ఎమిలీ అల్మాండ్ బార్, ఐసీఏఆర్‌డీఏ, 89అప్, నో ఐసోలేషన్, అన్నా ఖొడిరేవా, బాగ్డోనోవా ఎక్టెరినా, అనస్తీషియా వోల్కోవా బై సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్/జాన్ కైర్న్స్, అర్విడ్ ఎరిక్సన్, జెరోనిమో జునిగా/అమెజాన్ ఫ్రంట్‌లైన్స్, అలెజాండ్రా లోపెజ్, విక్టర్ హ్యూగో యానెజ్ రామోస్, రిక్ బంచన్ ఫొటోగ్రఫీ, ఎడ్డీ హెర్నాండెజ్ ఫొటోగ్రఫీ, ఆంట్ ఐ ఫొటోగ్రఫీ, క్రిస్ కాలింగ్రిడ్జ్, అబ్దుల్ హమీద్ బెలాహ్మదీ, కున్మీ ఓవోపెటు, ఏలియన్ ప్రోస్ స్టూడియో, మాస్టర్ కార్డ్ ఫౌండేషన్, హన్నా మెంట్జ్, ఫోర్ట్రెస్స్, వైస్ మీడియా గ్రూప్ ఎల్ఎల్‌సీ, ఫ్రాన్సిస్ మ్యూజె ఫ్రమ్ సైటెడ్ డిజైన్, ఆంగ్లూ స్టూడియోస్, జోలా ఫొటో, డేవీడ్ గీ, విల్ కిర్క్, పలోమా హెర్బ్‌స్టీన్, మిగ్వెల్ మెండోజా ఫొటో స్టూడియో, డెనిస్ ఎల్స్, డయోన్డ్ విలియమ్స్, అక్లాడియా మేయర్ డి బొగోటా, గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ వుమెన్ పీస్‌బిల్డర్స్, రీస్ విలియమ్స్ విత్ ఆర్టిస్ట్స్ ఇన్ ప్రెసిడెంట్స్, సెబాస్టియన్ లిండ్‌స్టోర్మ్, గెట్టీ ఇమేజెస్, ఆండ్రిస్ కెరెస్, గుల్నాజ్ జుజ్బాయేవా, క్లైర్ గోడ్లీ, ద ఆస్ట్రేలియన్ వాటర్ అసోసియేషన్, వు బావోజియాన్, లారా కోటిలాస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఓషియా టొమేటి, మరియా ఎస్మ్ డెల్ రియో, గియో సోలిస్, లారెంట్ సెర్రౌసీ, డీసీఎంఎస్, ఇంటి గజార్డో, మోర్గాన్ మిల్లర్, హెలెనా ప్రైస్ హాంబ్రెక్ట్, కర్టసీ ఆఫ్ జాన్ రస్సో, యూఎన్ వుమెన్/ప్లోయ్ ఫుట్ఫెంగ్

line

క్రెడిట్స్

ఎడిటింగ్: అమీలియా బటర్లీ, లారా ఒవెన్, లోరిన్ బోజ్కర్ట్, వలేరియా పెరాసో, స్టెఫానీ గబాట్, ప్రొడక్షన్: అలిసన్ ట్రోస్డేల్, అనా-లూసియా గోంజాలెజ్, డెవలప్మెంట్: మర్టా మర్టీ మార్క్వెజ్, క్లో స్కిల్‌మాన్, డిజైన్: షాన్ విల్మాట్

line
100 women BBC season logo

100 మంది మహిళలు... అంటే ఏంటి?

బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)