బిల్ క్లింటన్‌కు కూడా నచ్చిన బొబ్బిలి వీణ ప్రత్యేకత ఏమిటి

వీడియో క్యాప్షన్, బిల్ క్లింటన్‌కు కూడా నచ్చిన బొబ్బిలి వీణ ప్రత్యేకత ఏమిటి

బొబ్బిలి వీణలకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. 1980లోనే ఈ వాద్యానికి జాతీయ అవార్డు దక్కింది. అంతకుముందే, సర్వసిద్ధి వీరన్న అనే కళాకారుడి ప్రతిభను గుర్తించి, వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అవార్డు ప్రకటించారు.

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.

2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రదర్శనలో ఉంచిన బొబ్బిలి వీణ చూసి ఆయన మురిసిపోయారు.

ఇంతకీ బొబ్బిలి వీణ ప్రత్యేకత ఏమిటి? దానికి ఎందుకంత గుర్తింపు వచ్చిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)