చైనా, భారత్ సరిహద్దు ఉద్రిక్తత: అయిదుగురు భారతీయులను అప్పగించిన చైనా

ఫొటో సోర్స్, Twitter/KirenRijiju
కనిపించకుండాపోయిన అయిదుగురు భారత పౌరులను చైనా శనివారం ఇండియన్ ఆర్మీకి అప్పగించింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిటు వద్ద సరిహద్దుల్లో వీరిని అప్పగించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వీరిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తరువాత వారివారి కుటుంబాలకు అప్పగిస్తారని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ అయిదుగురు సెప్టెంబరు 1 నుంచి కనిపించడం లేదు.
వారు సెప్టెంబరు 2న పొరపాటున వాస్తవాధీన రేఖ దాటి చైనా భూభాగంలో ప్రవేశించారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజపీ ఎంపీ తాపిర్ గావో సరిహద్దు దగ్గర సెప్టెంబర్ 3న చైనా దళాలు ఐదుగురు భారతీయులను కిడ్నాప్ చేశాయని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ట్వీట్ చేయడంతో వీరి విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ తరువాత చైనాకు హాట్ లైన్ సందేశం పంపించడంతో వారు ఈ అయిదుగురు తమ భూభాగంలో ఉన్నట్లు ధ్రువీకరించారు. అనంతరం నిర్ణీత ప్రక్రియల తరువాత శనివారం వారిని విడిచిపెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వీరిని చైనా అప్పగించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ధ్రువీకరించారు. ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించిన భారత సైన్యాన్ని ఆయన అభినందించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ - చైనా ఉద్రిక్తతల మధ్య.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి చైనా దళాలు అపహరించినట్లు చెబుతున్న యువకులు చైనా భూభాగంలోనే ఉన్నారని చైనా సైన్యం ధ్రువీకరించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా సైన్యం నుంచి సమాధానం వచ్చిందని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
"భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్‌ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కనిపించకుండా పోయిన యువకులు తమ వైపు ఉన్నట్లు తెలిసిందని వారు ధ్రువీకరించారు. వారిని మన అధికారులకు అప్పగించడం, మిగతా విధానాల గురించి చర్చిస్తున్నాం" అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజపీ ఎంపీ తాపిర్ గావో.. సరిహద్దు దగ్గర సెప్టెంబర్ 3న చైనా దళాలు ఐదుగురు భారతీయులను కిడ్నాప్ చేశాయని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ట్వీట్ చేశారు. దాని గురించి ఆయన మరిన్ని వివరాలు ఇవ్వలేదు.
దీనిపై చైనా సైన్యానికి హాట్‌లైన్ మెసేజ్ పంపించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ తర్వాత తెలిపారు. కానీ.. భారతీయుల అదృశ్యం గురించి చెప్పటానికి తమ దగ్గర ఎటువంటి వివరాలూ లేవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
అంతేకాదు.. అరుణాచల్ ప్రదేశ్ అని చెప్తున్న ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగమని.. దానిని అరుణాచల్ ప్రదేశ్‌గా తాము ఎన్నడూ గుర్తించలేదని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''అరుణాచల్ ప్రదేశ్' అని పిలిచే ప్రాంతాన్ని చైనా ఎన్నడూ గుర్తించలేదు. అది చైనాలోని దక్షిణ టిబెట్ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఐదుగురు భారతపౌరుల అదృశ్యం గురించి భారత సైన్యం పీఎల్ఏకు సందేశం పంపించిందనే ప్రశ్న మీద ఇప్పటివరకైతే మా దగ్గర ఎటువంటి వివరాలూ లేవు’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ అప్పుడు తెలిపింది.
తాజాగా.. ఆ ఐదుగురు యువకులు చైనా భూభాగంలో ఉన్నట్లు చైనా సైన్యం ధ్రువీకరించిందని కిరణ్ రిజిజు వెల్లడించారు.
చైనా, భారత్ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆగస్టులో వారం లోపు రెండు సార్లు చైనా దళాలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాయని భారత్ ఆరోపించింది. వీటిని చైనా ఖండించింది. తాజాగా ఇరు పక్షాలూ పరస్పరం కాల్పులు జరిపాయంటూ ఆరోపణలు చేశాయి.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








