వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, జీవితాలు అస్తవ్యస్థమైన వలస కూలీల కష్టాలపై సుప్రీంకోర్టు స్పందించింది.
సొంతూళ్లుకు వెళ్లేందుకు వారు పడిన కష్టాలపై మీడియాలో వచ్చిన కథనాలు ప్రాతిపదికగా ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు తీసుకుంది.
ఇళ్ల అద్దెలు చెల్లించలేక, సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం లేక, ఎక్కడుండాలో, ఎలా వెళ్లాలో తెలియక చిన్నపిల్లలు సహా వేలాది కుటుంబాలు నడుచుకుంటూ వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

వలస కూలీల కష్టంపై తమకు అనేక లేఖలు వచ్చాయని, వారిని ఆదుకునేలా ప్రభుత్వాలకు సూచించాలంటూ వినతిపత్రాలూ వచ్చాయని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది.
వలస కూలీలకు వారు ప్రయాణిస్తున్న మార్గంలో ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలనూ కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ కల్పించలేదని ఫిర్యాదులు వచ్చాయని ధర్మాసనం తెలిపింది.
వారికి వెంటనే ఉచిత రవాణా సదుపాయం, ఆహారం, ఇతర ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వాలు ఈ దిశగా ఇప్పటికే తీసుకుంటున్న చర్యలు చాలవని చెప్పింది.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారి స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను మే 28కి వాయిదా వేసింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007



ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తిరుమల బోసిపోయింది... ఆదాయం నిలిచిపోయింది
- రంగనాయకమ్మ అరెస్ట్ వివాదం: ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది? ఏం కేసు పెట్టారు?
- హైకోర్టుకు చేరిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వివాదం ఏమిటి? ఎందుకు?
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- భారత్ - పాక్ సరిహద్దులో స్థానికులు పట్టుకున్న ఈ పావురం పొరుగు దేశపు గూఢచారా?
- 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను'.. పాకిస్తాన్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








