నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ: చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు

ఫొటో సోర్స్, Getty Images
సంక్షేమానికి చేటు చేసే చెడ్డ విధానాలను తాను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తానని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
ఈ విషయంలో తనకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించటం సరైనది కాదని ఆయన బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...
అభిజిత్ బెనర్జీ: అన్నిటికన్నా పెద్ద సమస్య అంతర్గత రాజకీయాలు, దేశాల ఆర్థిక విధానాలు, సమస్యల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణులు. వీటితో రైట్ వింగ్ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వీటిని ముందుగా చూడాలి.
ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో గ్యాసోలీన్ పైన పన్నులు పెంచడం, తద్వారా ప్రజలను మరిన్ని కష్టాల్లో పడవెయ్యడం ద్వారా యెల్లో వెస్ట్ ఆందోళనలకు కారణమయ్యారు ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్. ఇదొక తప్పుడు విధానం. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి తప్పుడు విధానాలు కనిపిస్తున్నాయి.
బీబీసీ: రాజకీయపరమైన అనివార్యతలు, తమ మనుగడ కోసం రాజకీయ నాయకులు అనుసరిస్తున్న విధానాలు నేటి ఆర్థికవ్యవస్థను శాసిస్తున్నాయా?
అభిజిత్ బెనర్జీ: చెడ్డ నిర్ణయాలు ఎప్పుడైనా చెడ్డ నిర్ణయాలే. వాటిని స్పాన్సర్ చేసే వాళ్లకు కూడా అవి చెడ్డ నిర్ణయాలే. కాబట్టి రాజకీయ అనివార్యతలు భిన్నమైనవేమీ కాదు. మా దృష్టంతా ఫలానా కార్యక్రమం నిజంగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందా అనేదాని మీదే ఉంటుంది? ఈ విషయం రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
బీబీసీ: మీరు లేవనెత్తుతున్న అంశాలు ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు కదా? వాటిపై విమర్శలు, ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు.
అభిజిత్ బెనర్జీ: మేం ప్రొఫెషనల్స్ మాత్రమే. మాకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతలూ ఉండవు. మా వరకు చెడ్డ విధానాలు చెడ్డ విధానాలే. మంచి విధానాలు మంచి విధానాలే. మేం చెడ్డ విధానాలను వ్యతిరేకిస్తాం. ప్రతిఘటనను ఎవరు మొదలుపెట్టారన్న దాంతో మాకు సంబంధం లేదు. మంచి విధానాలను మేం ప్రమోట్ చేస్తాం.
బీబీసీ: వాళ్లు ఉపయోగిస్తున్న పదజాలం మీ వృత్తిని గౌరవిస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా?
అభిజిత్ బెనర్జీ: నేను వామపక్ష వాదిని కాబట్టి నేను చేప్పే దాంట్లో ఉపయోగరకమైన విషయాలేవీ ఉండవని చెప్పడం కూడా ఒక రకంగా నా వృత్తిని అవమానించడమే. నేను చెప్పే విషయాల్లో కొన్ని వామపక్షవాదులకు కూడా రుచించవు. ముఖ్యంగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో, నేను వారికి మద్దతుదారుగా ఎప్పుడూ లేను. నేను వారి విధానాలను ఎన్నోసార్లు విమర్శించిన విషయాన్ని మీరు చదవొచ్చు. కాబట్టి నన్ను నేను ముందుగా ఒక ప్రొఫెషనల్‌గానే భావిస్తాను.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా?
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించి వారికి తెలియదు
- ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో 'టాలీవుడ్'
- శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా... అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









