మరో మహేష్‌బాబుతో హీరో మహేష్‌బాబు సెల్ఫీ

ఫొటో సోర్స్, Mahesh Babu/facebook
‘‘నన్ను నేను చూసుకొంటున్నట్టే ఉంది’’ అని చెప్పారు ప్రఖ్యాత సినీ నటుడు మహేష్‌బాబు అచ్చుగుద్దినట్టు ఉన్న మరో మహేష్‌బాబును చూసి.
ఆ మరో మహేష్‌బాబు మరెవరో కాదు.. మహేష్‌బాబు మైనపు బొమ్మ.
ప్రపంచంలో విపరీత ప్రజాభిమానం ఉన్న ప్రముఖుల మైనపు బొమ్మలను తయారు చేసి మ్యూజియంలో ఉంచే మేడమ్ టుసాడ్స్ సంస్థ తాజాగా మహేష్‌బాబు మైనపు బొమ్మను రూపొందించింది.

ఫొటో సోర్స్, @urstrulyMahesh
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మహేష్‌బాబు స్వయంగా తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. ఈ బొమ్మను సింగపూర్‌లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు.
మహేష్‌బాబుతో పాటు.. ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
సింగపూర్ మేడమ్ టుసాడ్స్‌లో ఉంచే మైనపు బొమ్మను బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి అని జనరల్ మేనేజర్ అలెక్స్ తెలిపారు.
సింగపూర్ మ్యూజియంలో ఒక తెలుగు సూపర్ స్టార్ ప్రతిమను ఉంచటం కూడా ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆరు నెలల పాటు 20 మంది కష్టపడి ఈ విగ్రహం తయారు చేసినట్లు వివరించారు.
మైనపు బొమ్మను ఆవిష్కరించిన వెంటనే.. ‘‘నాకు కొంత ఆందోళనగా అనిపిస్తోంది... నిజంగా ఫ్రీకీ... ఒక బొమ్మ ఇంతకంటే వాస్తవంగా ఉండదు’’ అని మహేష్‌బాబు స్పందించారు.

ఫొటో సోర్స్, @urstrulyMahesh
‘‘ఇప్పుడు నాకు ఇద్దరు భర్తలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ బొమ్మ చాలా అద్భుతంగా వాస్తవికంగా ఉంది. బొమ్మ కన్నా నిజమైన మహేషే అందంగా ఉన్నారు. అయినా మహేష్‌కు బొమ్మకు మధ్య ఈ రోజు టై అయింది’’ అని నమ్రత చెప్పారు.
‘‘ఈ విగ్రహం నాకు దక్కిన గౌరవం. మేడమ్ టుసాడ్స్ సంస్థ నన్ను సంప్రదించింది. వాళ్లు నా నుంచి కళ్లు, జుట్టు, గోళ్లు... ఇలా 200 రకాల కొలతలు సేకరించారు. విగ్రహం తయారయ్యాక ఫొటోల్ని నా కుటుంబం, సన్నిహితులకు చూపించాను. 'ఫొటో షూట్ ఫొటోలు కదా' అన్నారు. అంత సహజంగా తయారు చేశారు'' అని మహేష్ బాబు పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








