వ్యతిరేక నినాదాలు చేస్తే షూట్ చేస్తానని బీజేపీ నేత బెదిరించారా - Fact Check

ఫొటో సోర్స్, Twitter/@KPGBJP
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
ఫరీదాబాద్ ఎంపీకి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినవారిని షూట్ చేస్తానని బీజేపీ ఎంపీ కల్‌రాజ్ మిశ్రా ఫరీదాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో బెదిరించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"బీజేపీ హింసాయుత ధోరణికి మరో తాజా ఉదాహరణ - ఫరీదాబాద్ ఎంపీకి వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిని కాల్చిపారేస్తానని ఓ ర్యాలీలో బీజేపీ ఎంపీ కల్‌రాజ్ మిశ్రా బెదిరింపులకు దిగారు. ఒకవేళ అది ఆయన రాష్ట్రమే అయ్యుంటే, ఆయనను ఇబ్బంది పెట్టినవారిని షూట్ చేసి ఉండేవారేమో. ప్రశ్నించినవారిని షూట్ చేస్తాం... ఇదేనా బీజేపీ ఇచ్చే సందేశం!" అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌ను వేలాదిమంది చూశారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌రియా లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ మిశ్రా ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో హరియాణా రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వివిధ బాధ్యతలను అప్పగించడంతో వాటి నిర్వహణ కోసం ఎన్నికల్లో పోటీచేయరాదని ఆయన నిర్ణయించుకున్నారు.
కల్‌రాజ్ బెదిరించారని చెబుతున్న ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే, సుర్జేవాలా చెబుతున్నదానిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
వాస్తవమేంటి?
22 సెకన్లున్న ఈ వీడియో 'విజయ్ సంకల్ప్ ర్యాలీ'లో మిశ్రా మాట్లాడిన సుదీర్ఘ వీడియోలో భాగం. కేంద్ర మంత్రి కృషన్ పాల్ గుర్జర్ కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు.
"ఇక్కడ సమస్యలు సృష్టించాలని ఎవరైనా కోరుకుంటే, వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతున్నా. సమస్యలు సృష్టించి, ఆ తర్వాత మేము మోదీ మద్దతుదారులం అని చెప్పేవారంతా అబద్ధాలు చెబుతున్నట్లే. మీరంతా దేశవ్యాప్తంగా మోదీ అనుకూలతకు నష్టం చేస్తున్నారు. మీరు దానికి సిగ్గుపడాలి. దేశాన్ని ప్రేమిస్తున్నానని మీరు భావిస్తుంటే, దేశం గురించి ఓసారి ఆలోచించండి" అని ఆ వీడియోలో మిశ్రా వ్యాఖ్యానించారు.
"నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఇది నా రాష్ట్రమే అయినా నేనిలాగే చెప్పేవాడిని. మీ అభిప్రాయాలను వెల్లడించండి. కానీ ఈ పద్ధతి సరికాదు" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Haryana BJP
ఆ ర్యాలీలో ఏం జరిగింది?
ఆదివారం జరిగిన "విజయ్ సంకల్ప్ ర్యాలీ"లో కేంద్ర మంత్రి, ఫరీదాబాద్ ఎంపీ కృషన్ పాల్ గుర్జర్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయడంతో కల్‌రాజ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
మీడియా కథనాల ప్రకారం, ఫరీదాబాద్ టిక్కెట్ కృషన్ పాల్ గుర్జర్‌కు ఇవ్వొద్దంటూ బీజేపీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు నిరసనకారులు నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని వారు ఆరోపించారు.
మీ అభిప్రాయాలను పార్టీకి చెప్పొచ్చు, కానీ ఈ పద్ధతిలో కాదు అని మిశ్రా తన ప్రసంగం ద్వారా నిరసనకారులకు చెప్పారు.

ఆ సందర్భంలోనే, "తన రాష్ట్రమైనా సరే తాను ఇలాగే చెప్పి ఉండేవాడిని (would have said the same)" అని వ్యాఖ్యానించారు. కానీ ఆ పదాలు స్పష్టంగా రాకపోవడంతో చెప్పి ఉండేవాడిని అనే మాటలు షూట్ చేసి ఉండేవాడిని (would have shot) అన్నట్లుగా ధ్వనించాయి.
అయితే, కృషన్ పాల్ గుర్జర్ ఈ సభలో ఏమీ మాట్లాడలేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత హరియాణాలో బీజేపీ నిర్వహించిన తొలి ప్రచార సభ ఇదే.
హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గెల్చుకుంటుందని ఈ సభలో మిశ్రా ధీమా వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వీడియోలోని శబ్దాన్ని సుర్జేవాలా కావాలనే తగ్గించి చూపించి, తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారంటూ చాలామంది బీజేపీ నాయకులు, మద్దతుదారులు మిశ్రాకు అనుకూలంగా కామెంట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ప్రజలను కాంగ్రెస్ ఎలా అమాయకులను చేస్తుందో సుర్జేవాలా ట్వీట్ ఓ కొత్త ఉదాహరణ" అని మిశ్రా ట్వీట్ చేశారు.
కానీ, బీజేపీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా సుర్జేవాలా తన ట్వీట్‌ను తొలగించలేదు.
ఇవి కూడా చదవండి.
- భారత నగరాలు స్మార్టుగా మారుతున్నాయా
- BBC Reality Check: భారత్దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- పాక్‌పై వైమానిక దాడులు చేసిన పైలట్లు వీరేనా
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- నిజామాబాద్‌లో కవితపై 236 మంది ఎందుకు పోటీ చేస్తున్నారు..
- వైమానిక దళం అమ్ములపొదిలో చేరిన చినూక్ హెలికాప్టర్లు.. పెరిగిన బలం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









