పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా...
పిల్లల కోసం ఎంతోకాలం ఎదురుచూసిన దంపతులు ఇక తమకు పిల్లలు పుట్టరని తెలిశాక, ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావిస్తారు.
కానీ దత్తత తీసుకోవాలని వారు అనుకోగానే అది సులభంగా జరిగిపోదు.
భారత్‌లో దత్తత తీసుకోవడం చట్టబద్ధమే అయినా, దానికి కొన్ని నియమ, నిబంధనలు కూడా ఉన్నాయి.
దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉండాలి.
దంపతులకు దీర్ఘకాలిక వ్యాధులు ఏవీ ఉండకూడదు. ఆ దత్తతకు ఇద్దరూ అంగీకరించాలి.
దత్తత తీసుకోవాలనుకున్న దంపతులకు తమ రక్తం పంచుకుని పుట్టిన ఉండకూడదు.
ఒంటరిగా ఉన్న మహిళలు ఆడ, మగ ఇద్దరు పిల్లలనూ దత్తత తీసుకోవచ్చు
కానీ ఒంటరిగా ఉన్న పురుషులు మాత్రం మగబిడ్డను మాత్రమే దత్తత తీసుకోడానికి అనుమతి ఉంటుంది.
పెళ్లైన రెండేళ్ల తర్వాత మాత్రమే భార్యాభర్తలకు దత్తత తీసుకోడానికి అర్హత లభిస్తుంది.
దంపతులకు వారు దత్తత తీసుకునే పిల్లలకు మధ్య వయసులో 25 ఏళ్ల వ్యత్యాసం ఉండాలి.
అన్ని అర్హతలు ఉన్నా దంపతులు ఎవరైనా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని దత్తత తీసుకోవడం కుదరదు.
ఇవి కూడా చదవండి:
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









