గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా, కాదా

ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని చాలామంది నమ్ముతారు. అందుకే పాలు పంచదార కలిసిన మామూలు టీని పక్కనబెట్టి అనేక మంది ఆరోగ్యం కోసం గ్రీన్ టీని తాగడం మొదలుపెట్టారు.
కానీ, గ్రీన్ టీతో అన్నీ లాభాలు మాత్రమే కాదని, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తాగేవారికంటే అమ్మేవారికే దాని వల్ల ఎక్కువ లాభమని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ అంటారు. కరీనా కపూర్, ఆలియా భట్ లాంటి బాలీవుట్ నటీమణులకు ఆమె పోషకాహార నిపుణురాలు.
అన్ని టీల లానే గ్రీన్ టీని కమెలియా సైనెసిస్ మొక్క నుంచే సేకరిస్తారు. దాదాపు ఐదు వేల ఏళ్ల నుంచే గ్రీన్ టీను తాగుతున్నా, ఇటీవలి కాలంలోనే అది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయని, క్యాన్సర్ ప్రమాదంతో పాటు బరువును తగ్గిస్తుందని చెబుతారు. కానీ, ఇప్పటిదాకా దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలూ లేవు. అందుకే గ్రీన్ టీని వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
సరైన మోతాదులో తీసుకుంటేనే గ్రీన్ టీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది.
అందులో ఉండే కెఫీన్ కారణంగా తలనొప్పి, నిద్ర సమస్యలు, వాంతులు, డయేరియా లాంటివి తలెత్తొచ్చు. బీపీ ఉన్నవాళ్లు గ్రీన్ టీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
గ్రీన్ టీలో ఉండే టానిన్ కారణంగా ఐరన్‌ను శోషించుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్ టీలో ఇతర పోషకాలతో పాటు కెఫీన్ కూడా ఉంటుంది. అందుకే కెఫీన్ పడనివాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండటం మేలు. గ్రీన్ టీ సప్లిమెంట్ల కారణంగా తమ కాలేయం పాడైందని చెప్పేవాళ్లూ ఉన్నారు.
కానీ, సరైన మోతాదులో తీసుకుంటే దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
గ్రీన్ టీ వల్ల ఏకాగ్రత మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏదేమైనా, ఎంత అలవాటున్నా గ్రీన్ టీని మరీ ఎక్కువగా తీసుకోకపోవడమే మేలు.
ఇవి కూడా చదవండి
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- జుట్టు ఎందుకు ఊడిపోతుంది.. పొడవు జుట్టు రహస్యమేంటి
- ఆ ఒత్తిడి నాకు అలవాటైపోయింది: బీబీసీ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు: సముద్ర జలాలపై అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి
- ఎన్టీఆర్ తరువాత నందమూరి సుహాసినే
- అండమాన్ సెంటినలీస్ మిత్రుడు - ఆయన పేరు పండిట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








