"బికినీల వల్లే చాలామంది అమ్మాయిలు బాడీ బిల్డింగ్‌ను ఎంచుకోవట్లేదు"- బినల్ రాణా

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి చెందిన ఓ మహిళ బాడీ బిల్డింగ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఇందుకోసం ఆమె శారీరకంగా శ్రమించడంతో పాటు మానసికంగానూ చాలా కష్టపడాల్సి వచ్చింది.
బినల్ రాణా నేషనల్ కాంపిటిషన్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించారు. పోటీల్లో ఆమె బికినీలు ధరించడంపై కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతోంది.
'బికినీ ధరించానని మావాళ్లు మాట్లాడలేదు'
బినల్ రాణా అథ్లెట్, ఫిజియోథెరపిస్ట్. అంతేకాదు, యోగా నిపుణురాలు కూడా.
పురుషులతో పోలిస్తే బాడీ బిల్డింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. మహిళా బాడీ బిల్డర్‌గా ఆమె చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట తన కుటుంబం నుంచే సమస్యలు మొదలయ్యాయి.
మొదట్లో బినల్ రాణా బికినీ ధరించి పోటీల్లో పాల్గొనడం ఆమె కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆఖరుకు ఆమె ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి కూడా వచ్చింది.
"మొదట్లో బికినీ విషయం దాచిపెట్టాను. చాలా పోటీల్లో పాల్గొన్నప్పటికీ మా వాళ్లకు ఆ విషయం చెప్పలేదు. బికినీ ధరించేందుకు మా అమ్మానాన్నలు అంగీకరించేవారు కాదు. కానీ కొన్నాళ్లకు ఆ విషయం తెలిశాక సంవత్సరం పాటు వాళ్లు నాతో మాట్లాడలేదు" అని బినల్ చెప్పారు.

బినల్ రోజూ జాగింగ్ చేస్తారు. రెండు గంటలపాటు సాధన.. ఆ తర్వాత యోగా చేస్తారు. వీటితో పాటు పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేక పద్ధతులను ప్రాక్టీస్ చేస్తారు.

ఇప్పుడు బినల్ రాణా కుటుంబంలో సాధారణ పరిస్థితి నెలకొంది. బికినీ ధరించడంపై ఉన్న అపోహలే మహిళలు బాడీ బిల్డింగ్‌కు దూరమవడానికి కారణమంటున్నారు బినల్.
"స్విమ్మర్లు స్విమ్ సూట్ వేసుకున్నట్టే మేము బికినీ ధరిస్తాం. బికినీల వల్లే చాలా మంది యువతులు ఈ ప్రొఫెషన్‌ను ఎంచుకోవడం లేదు. నేను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చిన కొత్తలో పురుషులు కూడా ఇబ్బందికరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది" అని చెప్పారు బినల్.

బాడీ బిల్డర్, యోగా టీచర్, పెయింటర్ ఇలా రకరకాల నైపుణ్యాలు బినల్‌లో ఉన్నాయి. అయితే బాడీ బిల్డింగ్‌ను ఆమె తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కోచ్ సందీప్ చౌహాన్ ఆమెను గైడ్ చేస్తున్నారు.
"నాకు బినల్‌పై విశ్వాసం ఉంది. కెరీర్‌లో ఆమె ఉన్నత విజయాలు సాధిస్తుంది. బినల్‌ను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది అమ్మాయిలు జిమ్‌లో చేరారు" అని సందీప్ చౌహాన్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్: 'ఇదో చిన్న కేసు.. మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది'
- నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- లక్ష్మీకుట్టీ అమ్మ: ‘విషానికి విరుగుడు ఈ బామ్మ నాటువైద్యం’
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- ‘రాజకీయ నాయకులూ ‘కళా పోషకులే’.. కానీ వారి సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









