కర్ణాటక ఎన్నికల ఫలితాలు: మలుపు తిరిగిన రాజకీయం.. ప్రభుత్వ ఏర్పాటుకు పోటాపోటీ

ఫొటో సోర్స్, AFP/Getty Images
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లభించలేదు.
06.00 మొత్తం ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు 222 ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ 104, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యులర్) 37 స్థానాల్లో గెలుపొందగా.. బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ చెరొక స్థానాన్ని పొందగా.. స్వతంత్ర అభ్యర్థి మరొక స్థానంలో గెలుపొందారు.
22.30 మొత్తం 222 స్థానాలకు గాను 221 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ 103, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యులర్) 37 స్థానాల్లో గెలుపొందగా.. బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ చెరొక స్థానాన్ని పొందగా.. స్వతంత్ర అభ్యర్థి మరొక స్థానంలో గెలుపొందారు. మిగిలిన ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
14.56 కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘‘దేవెగౌడ, కుమారస్వామిలతో మేం మాట్లాడాం. ముఖ్యమంత్రి పదవికి జేడీఎస్ ఎవరిని నిర్ణయిస్తే.. కాంగ్రెస్ కూడా వారికే మద్దతిస్తుంది. మా ప్రతిపాదనను వారు స్వీకరించారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
14.00కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన వారికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి పాలైన వారు తిరిగి పోరాడాలని మమత సూచించారు. కాంగ్రెస్, జేడీఎస్ జత కట్టి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని మమత అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
13.43 ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ, 'కర్ణాటకలో కమలం వికసించింది' అన్నారు. బీజేపీకి అద్భుత విజయం దక్కిందన్న మేనక.. మోదీ నాయకత్వంలో అలుపెరుగకుండా శ్రమించిన పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
13.13 - బీజేపీ 10 స్థానాలలో, కాంగ్రెస్ 2 స్థానాలలో విజయం సాధించాయి. బీజేపీ 99 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 69 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.
12.47 - కర్ణాటకలో బీజేపీ 4 స్థానాలలో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ 104 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 69 స్థానాలలో, జేడీఎస్ 40 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 3 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.
12.23 - కర్ణాటకలో మొత్తం 220 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. 2 స్థానాలలో విజయం సాధించిన బీజేపీ మరో 112 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 64 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 2 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.

ఫొటో సోర్స్, జుబేర్ అహ్మద్
12.02 - మొత్తం 220 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. బీజేపీ 115 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా.. కాంగ్రెస్ 63 స్థానాలలో, జేడీఎస్ 40 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. 2 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.
11.42 - కర్ణాటక ఫలితాలపై ప్రముఖ చరిత్రకారులు రామచంద్ర గుహ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలతో సిద్ధరామయ్యకు భంగపాటు కలిగిందని అన్నారు. వీటితో కాంగ్రెస్ అధ్యక్షునికి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్లు సిద్ధరామయ్యను తోసిపుచ్చినా, ఏ ఒక్క కాంగ్రెస్ నేతకైనా రాహుల్ గాంధీని ప్రశ్నించే ధైర్యం ఉందా అని గుహ ట్వీట్ చేశారు.
11.23-మొత్తం 214 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడైంది. వాటిలో బీజేపీ 114 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 58 స్థానాలలో, జేడీఎస్ 39 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.
11.02-మొత్తం 209 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడి కాగా - బీజేపీ 111 స్థానాలలో, కాంగ్రెస్ 58 స్థానాలలో, జేడీఎస్ 37 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒకో స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.

10.47- కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 205 స్థానాలలో ఫలితాల సరళి వెల్లడి కాగా - బీజేపీ 109 స్థానాలలో, కాంగ్రెస్ 56 స్థానాలలో, జేడీఎస్ 37 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
10.29 - మొత్తం 192 సీట్ల ఫలితాల సరళి వెల్లడైంది. 100 స్థానాలలో బీజేపీ, 52 స్థానాలలో కాంగ్రెస్, 37 స్థానాలలో జేడీఎస్ ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ ఒక స్థానంలో, కేపీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.
10.00 - మొత్తం 157 సీట్ల ఫలితాల సరళి వెల్లడైంది. వాటిలో 76 చోట్ల బీజేపీ, 44 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల జేడీఎస్ ఆధిక్యతలో ఉన్నాయి.
09.57 - కర్ణాటకలో 'విజయం'పై బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గీయ అమిత్ షాకు అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
09.53 - ఇప్పటివరకు 152 సీట్ల ఫలితాల సరళి వెలువడింది. వాటిలో 72 చోట్ల బీజేపీ, 44 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. జనతాదళ్ సెక్యులర్ 33 చోట్ల ఆధిక్యతలో ఉంది. బీఎస్పీ ఒక స్థానంలో, కేపీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
09.51 - కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కర్నాటకలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
9.48: మొత్తం 129 సీట్లకు సంబంధించిన ఫలితాల సరళి విడుదల కాగా..బీజేపీ 67, కాంగ్రెస్ 42, జేడీఎస్ 30 చోట్ల ముందంజ. ఇతరులు 3 చోట్ల ముందంజలో ఉంది.

9.36: బీజేపీ 55, కాంగ్రెస్ 29, జేడీఎస్ 21 చోట్ల ముందంజ. ఇతరులు 3 చోట్ల ముందంజ.
కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ట్రెండ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ 44 చోట్ల ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 25 స్థానాల్లో ముందుంది. జేడీఎస్ 17 చోట్ల ముందంజలో ఉంది.
ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలక పాత్ర పోషించే అవకాశముంది.
9.35: బీజేపీ 44, కాంగ్రెస్ 25 చోట్ల, జేడీఎస్ 17 చోట్ల ముందంజ
బీజేపీ 34 చోట్ల ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 17 చోట్ల ముందంజలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
9.24: బీజేపీ 34, కాంగ్రెస్ 17 చోట్ల, జేడీఎస్ 9 చోట్ల ముందంజ
9.20: బీజేపీ 24, కాంగ్రెస్ 13 చోట్ల, జేడీఎస్ 6 చోట్ల ముందంజ
9.15: బీజేపీ 17, కాంగ్రెస్ 11 చోట్ల, జేడీఎస్ ఆరు చోట్ల ముందంజ
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కూడా కీలకంగా మారనుంది.

ఫొటో సోర్స్, ECI
8.48: బీజేపీ 2 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట ముందంజ
8.40: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోందని ప్రభుత్వ అధికారిక టీవీ దూరదర్శన్ పేర్కొంది.
8.37: కర్ణాటకలో మొత్తం 38 చోట్ల పటిష్ఠ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలైంది.
8.35: ఎన్నికల సంఘం అప్‌డేట్ ప్రకారం.. రౌండ్ 1 ఇంకా పూర్తికాలేదు
8.30: రాజరాజేశ్వరీ నగర్, జయనగర్ అనే రెండు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ పూర్తికాలేదు.
8.20: ఎన్నికల సంఘం ప్రకారం.. రౌండ్ 1 ఇంకా పూర్తికాలేదు.
8.15: పలు టీవీ చానెళ్లు ఎన్నికల సరళి ఇదంటూ పలు వార్తలు ఇస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ ఫలితాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
8.00: ఓట్ల లెక్కింపు ప్రారంభం
మొత్తం అసెంబ్లీ సీట్లు

ఫొటో సోర్స్, Getty Images
6.4 కోట్ల జనాభా ఉన్న కర్నాటకలో సుమారు 4.97 కోట్ల మంది ఓటర్లున్నారు.
గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)