సోషల్: తనను తాగుబోతు అన్న ట్రోల్‌కు పూజా భట్ ఇలా జవాబిచ్చింది!

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌లో తనను 'తాగుబోతు' అంటూ ట్రోల్ చేసిన వ్యక్తికి బాలీవుడ్ నటి పూజా భట్ దీటైన జవాబిచ్చింది. దాంతో ఆ విమర్శకుడి నోరు మూతపడింది.
ఇదెలా ప్రారంభమైందంటే.. ఇటీవల వెలుగులోకి వచ్చిన కఠువా, ఉన్నావ్ రేప్ కేసుల విషయంలో మాట్లాడడానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చాలా వెనుకాముందాడుతున్నారు.
ఈ ఘటనలు భయంకరమైనవని పేర్కొంటూ, వాటిపై మాట్లాడడానికి తనకు అసహ్యం వేస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై స్పందిస్తూ పూజా భట్ ఓ ట్వీట్ చేసింది. "ఎంత వద్దనుకున్నా నేను పింక్ సినిమాను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నాను. వెండితెరపై కనిపించే ఇమేజ్‌ను వాస్తవికంగా మార్చడం సాధ్యపడదా?" అని ఆమె అందులో రాశారు.
'పింక్' సినిమాలో అమితాబ్ లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిల పక్షాన న్యాయవాదిగా నటించి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో అమితాబ్ పోషించిన పాత్రను గుర్తు చేయడం.. తాజా అత్యాచార ఘటనలపై అమితాబ్ ఏమీ మాట్లాడనందుకు తన అసంతృప్తిని ప్రకటించడం పూజా భట్ ట్వీట్ సారాంశం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ట్వీట్ తర్వాత అమితాబ్ అభిమానులు భగ్గున మండిపోయారు. పూజా భట్ బోల్డెంత ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొంత మంది ఆమెకు మద్దతుగా కూడా రంగంలోకి దిగారు.
ఒక బిగ్ బీ అభిమాని ఆమెను చెడామడా తిట్టిపారేస్తూ, ఆమె ఓ తాగుబోతు అని కూడా అన్నాడు.
"ఒక సీజనల్ పురుగు.. పేరు మోసిన తాగుబోతు. అమితాబ్ బచ్చన్ పేరును ఉపయోగించుకొని పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తోంది" అంటూ ఆ వ్యక్తి ట్రోల్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, పూజా భట్ దీనికి ఏ మాత్రం ఆగ్రహానికి గురి కాకుండా తనదైన శైలిలో జవాబిచ్చింది. తన పట్ల తనకు గర్వంగా ఉందనీ, తానేం చేస్తున్నానో తనకు బాగా తెలుసని ఆమె చెప్పింది.
"నేను మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్నాను. దీనికి నేను గర్విస్తున్నాను. అసలు మద్యపాన వ్యసనం గురించి చర్చించడం కాదు గదా, కనీసం తమకు ఈ సమస్య ఉందని గుర్తించడానికి కూడా నిరాకరించే వాళ్లున్న దేశంలో... తమ లోపాల్ని గుర్తించడం అంటేనే సిగ్గుచేటుగా భావించే గుంపుకు దూరంగా నిలబడ్డందుకు నాకు గర్వంగా ఉంది" అని పూజా భట్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, @PoojaB1972
తాను 2016లో మద్యపాన వ్యసనాన్ని వదిలించుకున్నాననీ, అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు తాగుతున్నాను అని ఆమె ట్విటర్‌లో తెలిపింది.
ఈ ట్వీట్ తర్వాత చాలా మంది పూజా భట్‌కు మద్దతు పలిగారు.
"కొంత మంది తమ కెరీర్‌లో ఎంతగా నిమగ్నమై పోయారంటే, బేటీ బచావో అంబాసిడర్ అయి ఉండి కూడా తమ బాధ్యతల్ని మర్చిపోయారు" అంటూ పరోక్షంగా అమితాబ్‌ను విమర్శిస్తూ ఓ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పూజా భట్‌ను తాగుబోతు అని తిడుతూ కామెంట్ చేసిన ట్రోల్‌ను ఉద్దేశిస్తూ, "నీ పట్ల నువ్వు సిగ్గుపడాలి. ప్రౌడ్ ఆఫ్ యూ పూజా. తప్పుడు ధోరణులపై పోరాడే సామర్థ్యం నీలో ఉంది" అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కఠువా గ్యాంగ్ రేప్, ఉన్నావ్ రేప్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వీటిపై ఎలా స్పందిస్తారని అమితాబ్‌ను అడిగినపుడు ఆయన జవాబు చెప్పకుండా దాటవేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)