నలభై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తిని ఓ యూట్యూబ్ వీడియో కుటుంబంతో కలిపింది!

గంభీర్ సింగ్

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, యూట్యూబ్ వీడియో సాయంతో బంధువుల చెంతకు చేరిన గంభీర్ సింగ్ (కుడి)

40 ఏళ్ల క్రితం మాయమైన ఓ వ్యక్తిని ఆయన బంధువులు ఓ యూట్యూబ్ వీడియోలో గుర్తు పట్టడంతో వారు ఆయనను కలుసుకోగలిగారు. ఈ సంఘటన మణిపూర్‌లో జరిగింది.

ఖోమ్‌ద్రామ్ గంభీర్ సింగ్ 1978లో 26 ఏళ్ల వయసులోని మణిపూర్ నుంచి మాయమయ్యారు. ఆయన కుటుంబానికి కొన్ని దశాబ్దాల పాటు గంభీర్ సింగ్ గురించి సమాచారం ఏమీ తెలియలేదు.

అయితే గంభీర్ సింగ్ బంధువు ఒకరికి, ఇంఫాల్‌కు 3,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై నగరంలో హిందీ పాటలు పాడుతూ అడుక్కుంటున్న ఓ వ్యక్తి యూట్యూబ్‌లో కనిపించాడు.

ఆయనలో గంభీర్ సింగ్ పోలికలు ఉండడంతో బంధువులు పోలీసులను సంప్రదించారు. ఆ ఫొటోను అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫర్ ఫిరోజ్ షాకీర్ ముంబైకి చెందిన వాడు కావడంతో ఆయన కూడా అక్కడే ఉండి ఉండవచ్చని అనుమానించారు. అదే విషయాన్ని ఆయన పోలీసులకు తెలిపారు.

''నా సోదరుని మీద ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నాం. కానీ నా మేనల్లుళ్లు వీడియో చూపిస్తే నా కళ్లను నేనే నమ్మలేకపోయాను'' అని గంభీర్ సింగ్ సోదరుడు కులచంద్ర 'ద హిందూ' వార్తాపత్రికకు తెలిపారు.

ఇంఫాల్ పోలీసులు ఆయన ఫొటోను ముంబై పోలీసులకు పంపడంతో వారు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆయనను కనుగొన్నారు.

''ఆయనను ఒక రైల్వే స్టేషన్ పరిసరాల్లో కనుగొన్నాం. ఆయన చాలా అనారోగ్యంగా కనిపించారు'' అని ఇన్‌స్పెక్టర్ పండిట్ బీబీసీకి తెలిపారు.

గతంలో సైన్యంలో పని చేసిన గంభీర్ సింగ్‌కు 1978లో పెళ్లైంది. అయితే అసంతృప్తి కారణంగా తాను ఇల్లు వదిలిపెట్టానని సింగ్ పోలీసులకు తెలిపారు. నాటి నుంచి ఆయన ముంబైలో భిక్షాటన చేస్తూ, కూలీ పని చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు.

గంభీర్ సింగ్‌ను కనుగొన్న విషయాన్ని ముంబై పోలీసులు ఇంఫాల్ పోలీసులకు తెలియజేయడంతో ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను ఇంఫాల్‌కు తీసుకెళ్లారు.

ముంబై పోలీసులు ఈ అపూర్వ సంగమాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అలాగే షాకిర్ కూడా గంభీర్ సింగ్ ముంబై నుంచి ఇంఫాల్‌కు వెళుతున్న ఫొటోలను ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రస్తుతం గంభీర్ సింగ్ ఇంఫాల్‌లో తన కోసం స్నేహితులు, బంధువులు కలిసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటిలో ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)