#గమ్యం: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ - ఎంటెక్‌కు ఏది బెస్ట్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
ఇటీవలే గేట్ ఫలితాలు వెలువడ్డాయి. గేట్ స్కోరు మూడేళ్లపాటు పనికొస్తుంది.
ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేవారికి గేట్ ఉత్తమ మార్గం. గేట్‌లో క్వాలిఫై అయినవాళ్లలో చాలామంది ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఎందులో, ఎలా చేరాలనే దానిపై సందిగ్ధంగా ఉంటారు. దీనికి సంబంధించిన వివరాలను ఈరోజు 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఎడిటర్ (ఇంజనీరింగ్) ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ప్రతి ఐఐటీకీ దరఖాస్తు చేయాలా?
ఐఐటీల్లో చేరాలంటే ప్రతి ఐఐటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిందే. ఐఐఎస్సీ, బెంగళూరులో చేరాలంటే పీజీలో ఫస్ట్ క్లాస్ అవసరం లేదు. సాధారణంగా ఏప్రిల్ మొదటివారంలోనే ఐఐఎస్సీ ప్రవేశాలకు గడువు ముగిసిపోతుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన కూడా విడుదలైంది. సాధారణంగా ఏప్రిల్ రెండో వారంలోపు ఈ గడువు కూడా ముగిసిపోతుంది.
ప్రతి విద్యార్థీ ఒకటి కన్నా ఎక్కువ ఐఐటీల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయడం సర్వసాధారణం. ఒకవేళ అన్ని ఐఐటీల్లో సీటు దొరికినా ఎందులో చేరాలనేది పూర్తిగా విద్యార్థి ఇష్టం. దీనివల్ల ఆ విద్యార్థి దరఖాస్తు చేసిన మిగిలిన ఐఐటీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఇబ్బందిని అధిగమించడానికి గత సంవత్సరం నుంచి ఐఐటీల్లో ఎంటెక్ కామన్ అడ్మిషన్స్ కోసం ఓ కోప్ (సీఓఏపీ - కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్)ను ప్రారంభించారు.
దాదాపు 16-18 ఐఐటీలు ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. ప్రిలిమినరీ అప్లికేషన్ నింపిన తర్వాత కోప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇది కూడా ఏప్రిల్ రెండోవారం తర్వాత ప్రారంభమవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీ ర్యాంకు, స్కోరును బట్టి ఏ ఐఐటీ మీకు సీటు ఇవ్వడానికి అంగీకరించిందో చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ తీసుకుని, ఆ ఐఐటీకి వెళ్లి, ఫీజు చెల్లించాలి. దీంతో మీ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినట్లు.

ఫొటో సోర్స్, NIT-Rourkela
ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశం ఎలా?
కొత్త ఎన్ఐటీల కన్నా గతం నుంచి ఉన్న సంస్థల్లో ప్రవేశానికి ప్రయత్నించండి. విద్యా ప్రమాణాలపరంగా పాత ఎన్ఐటీలు ఉత్తమంగా ఉంటాయి. ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సీసీఎంటీ (సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్/ఎంప్లాన్/ఎంఆర్క్) ద్వారా జరుగుతాయి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ నింపి, ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 3న ఈ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా సంస్థల కట్ ఆఫ్ స్కోరు, మీరు చేయాలనుకుంటున్న స్పెషలైజేషన్ ఆ సంస్థ ఆఫర్ చేస్తోందా లేదా, మీ బీటెక్ బ్రాంచికి, మీరు చేయాలనుకుంటున్న ఎంటెక్ బ్రాంచికి మ్యాచ్ అవుతోందా వంటి అంశాలను ముందుగానే చెక్ చేసుకోవాలి. దీని ప్రకారం మీరు అప్లికేషన్‌లో ఆప్షన్స్ నమోదు చేయాలి.
గేట్ స్కోరుతో రాష్ట్రాల్లోని ఇతర యూనివర్శిటీల్లో కూడా ఎంటెక్ ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మళ్లీ ఆయా యూనివర్శిటీలు లేదా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. గేట్ స్కోరు ఉన్నవారికి కౌన్సెలింగ్ సమయంలో ప్రత్యేక అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఎంటెక్‌లో చేరవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని యూనివర్శిటీల్లో ఎంటెక్ చేయాలంటే ఏపీపీజీసెట్, తెలంగాణలో ఎంటెక్ చేయాలంటే టీఎస్‌పీజీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇవి మే నెలలో జరుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండూ కూడా ఆన్‌లైన్ పరీక్షలు.

ఫొటో సోర్స్, PMRF
స్కాలర్‌షిప్
గేట్ క్వాలిఫై అయిన ఎంటెక్ విద్యార్థులకు ఏఐసీటీఈ నెలకు రూ.12000 స్కాలర్‌షిప్ ఇస్తుంది. దీనిపై పూర్తి వివరాలకు ఏఐసీటీఈ వెబ్‌సైట్ చూడండి.
ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి కేంద్రీయ విద్యాసంస్థల నుంచి బీటెక్, ఎంటెక్ చేసేవారికి ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అవకాశం కూడా ఉంది. పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. దీనికి గేట్ స్కోరు అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
- #గమ్యం: ఈ 10 అంశాలు పాటించండి! పరీక్షల ఒత్తిడిని జయించండి!!
- #గమ్యం: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డులు... మీ పిల్లలకు ఏది మంచిది?
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్‌షిప్
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
- #గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?
- #గమ్యం: జేఈఈ, ఎంసెట్... ఇంకా ఏమేం రాయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









