గుజరాత్ ఎన్నికలు: ఈ ఐదు సవాళ్ళను కాంగ్రెస్ ఎదుర్కోగలదా?

- రచయిత, షకీల్ అఖ్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, అహ్మదాబాద్ నుంచి
డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అందుకే నరేంద్రమోదీకి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకొని ప్రచారం నిర్వహిస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ ముందు ఐదు పెద్ద సవాళ్లున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1) గుజరాత్‌లో గత 20 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ బీజేపీకి ఇప్పటికీ పట్టుంది. అధికారంలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇంకా బీజేపీని సమర్థించే వారి సంఖ్య ఎక్కువే ఉంది.
గుజరాత్‌లో అభివృద్ధి ఫలాలు కూడా బీజేపీని సమర్థించేవారికే దక్కడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా వారు మాత్రం బీజేపీకి ఓటు వేయడానికే ఇష్టపడతారు.

ఫొటో సోర్స్, Getty Images
2) గుజరాత్‌ను హిందుత్వ ప్రయోగశాల అంటారు. బీజేపీ ప్రభుత్వం, గుజరాత్ పరిపాలన రెండూ హిందుత్వ భావజాలంతోనే పనిచేస్తాయి. అక్కడి ప్రభుత్వం కూడా హిందుత్వ భావజాలాన్ని అభివృద్ధి అంశంతో జోడించింది. గుజరాత్ ఓటర్లు కూడా దీనిని ఇష్టపడతారు.
3) కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని, ముస్లింల కోసమే అది పనిచేస్తుందని గుజరాత్ ఓటర్లు నమ్మేలా చేయడంలో బీజేపీ, నరేంద్రమోదీ సఫలీకృతమయ్యారు.
గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ఇలాంటి ప్రచారంలో విజయం సాధించారు. గుజరాత్‌లో ముస్లింల పట్ల హిందువుల్లో ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలు దాడులు చేసే అవకాశం ఉందని, ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ కరువవుతుందనే అని చెప్పే వీడియోలను ఎంతో రహస్యంగా పంపిస్తున్నారు. ఓటర్లలో ఓ బలమైన వర్గం ఈ వాదనను గట్టిగానే నమ్ముతుంది.
4) కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే కాకుండా గుజరాత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపైనా స్పష్టత ఇవ్వలేదు.
నరేంద్రమోదీ వచ్చే వారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కానీ ఇప్పటికే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. అయితే గుజరాత్ రాజకీయ అగ్రగణ్యుడిగా భావించే నరేంద్రమోదీ స్థాయిని కాంగ్రెస్ పార్టీ సరిగా అంచనా వేసిందని చెప్పడం మాత్రం కష్టమే.

ఫొటో సోర్స్, Getty Images
5) 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా నరేంద్రమోదీ విజయం సాధించాలి. లేకుంటే రాజకీయంగా బలహీనపడ్డట్లు మాత్రమే కాకుండా పార్టీపై ఆయనకున్న పట్టు సడలిందనే భావన కలుగుతుంది. అందుకే గుజరాత్ ఎన్నికలు నరేంద్రమోదీకి ఎంతో కీలకంగా మారాయి.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తన అన్ని వనరులను, రాజకీయ సామర్ధ్యాలను ఉపయోగించబోతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది.
మా ఇతర కథనాలు:
- గుజరాత్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు?
- గుజరాత్ ఎన్నికల్లో తెలుగు జనం ఎటువైపు?
- గుజరాత్ ప్రచార బరిలో యూపీ సీఎం యోగి
- ‘వాట్సాప్ ఆగిపోతే? గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతుంది’
- ఈ ఎన్నికల సంఘం మోదీదో కాదో కానీ శేషన్ది మాత్రం కాదు!
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
- గుజరాత్‌లో వేగంగా మారుతున్న రాజకీయాలు!
- సెక్స్ సీడీ: హార్దిక్ పటేల్‌పై ఆరోపణలతో ఎవరికి నష్టం?
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- మూడీస్ రేటింగ్‌తో మోదీ ప్రతిష్ఠ పెరుగుతుందా?
- అమేథీపై అమిత్ షా కన్ను, గుజరాత్‌లో రాహుల్ సవాల్
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









