ఆసియా కప్ మహిళల హాకీ ఫైనల్లో చైనాను ఓడించిన భారత్

ఫొటో సోర్స్, Twitter@TheHockeyIndia
ఆసియా కప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్ చైనాను 5-4 తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
జపాన్‌లోని కాకమిగహారా నగరంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఫైనల్ పోటీలో పెనాల్టీ షూట్ ఔట్ ద్వారా భారత్ ఈ విజయం సాధించింది.
ఆసియా కప్‌లో భారత జట్టుకు ఇది రెండో విజయం. ఇంతకు మునుపు 2004లో భారత్ ఆసియా కప్ మహిళల హాకీ టైటిల్ గెల్చుకుంది.
నిరుటి విజేత జపాన్ను సెమి ఫైనల్లో ఓడించి భారత మహిళల టీం ఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఆట మొదటి అర్ధభాగంలో నవ్‌జోత్ కౌర్ గోల్ సాధించడం ద్వారా భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది.
అయితే ఆట 47వ నిమిషంలో చైనా ప్లేయర్ టియాన్టియన్ లువో ఓ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మల్చడంతో స్కోర్ సమం అయ్యింది.
పెనాల్టీ షూటౌట్లో రెండు జట్లూ 4-4 స్కోరును సాధించాయి. దాంతో సడెన్ డెత్ పరిస్థితి తలెత్తగా భారత క్రీడాకారిణి రాణి చివరి షాట్‌ను గోల్‌గా మల్చారు.
కానీ చైనా చివరి షాట్ మిస్ కావడంతో ఇండియా 5-4 స్కోరుతో టైటిల్ వశం చేసుకుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








