ఎన్‌సీపీ: బంగ్లాదేశ్‌లో విద్యార్థుల కొత్త పార్టీ
బంగ్లాదేశ్‌లో విద్యార్ఖులు ఏడు నెలల క్రితం చేసిన ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకున్నారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలోనూ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ విద్యార్థులలో చాలామంది రాజధాని ఢాకాలో తమ సొంత రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య చరిత్రను అవామీ లీగ్ ,బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేశాయి.
ఈ రెండు పార్టీల కంటే నేషనల్ సిటిజన్స్ పార్టీ ఏ విధంగా భిన్నం? బంగ్లాదేశ్ నుండి బిబిసి ప్రతినిధులు జుగల్ పురోహిత్ అందిస్తున్న రిపోర్ట్‌లో చూడండి.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









